Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కాళేశ్వరం అక్రమాలపై హరీష్‌రావు తెలివిగా కేసీయార్‌ను ఫిక్స్ చేశాడా..?

September 21, 2025 by M S R

.

కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై తను సేఫ్‌గా ఉంటూ, రేప్పొద్దున ఏదైనా ఎదురుతిరిగితే స్వయంగా కేసీయారే ఫిక్సయ్యేలా హరీష్‌రావు కుట్ర చేశాడా..? చివరకు పీసీ ఘోష్ కమిషన్ ఎదుట కూడా కేసీయారే అడ్డంగా బుక్కయ్యేలా, తను సేఫ్‌గా ఉండేలా స్టేట్‌మెంట్లు ఇచ్చాడా..?

నిన్న కవిత ప్రెస్‌మీట్‌లో మీడియా ఏవేవో వివరాల్ని కవర్ చేసింది గానీ… ఆమె వెల్లడించిన విషయాల్లో ఈ పాయింట్లకే వార్తా ప్రాధాన్యం ఉన్నట్టు కనిపిస్తోంది… కొద్దిరోజులుగా ఆమె హరీష్‌రావు, సంతోష్‌రావు ఎలా తన తండ్రి, పార్టీ అధినేతను ఎలా తప్పుదోవ పట్టించారో… ఎలా సంపాదించారో, ప్రత్యేకించి కాళేశ్వరాన్ని అక్రమాలు, అవినీతి, అవకతవకల పుట్టగా మార్చారో చెబుతూనే ఉంది…

Ads

కావాలనే హరీష్‌రావు తను సేఫ్‌గా ఉండేలా… కేసీయార్‌ను మాత్రమే ఫిక్స్ చేసేలా ఎలా ఫౌల్ గేమ్, నయవంచన కుట్రకు పాల్పడ్డాడో వెల్లడించడం ఆసక్తికరం కాగా… నిన్నటి ప్రెస్‌మీట్‌లో మరో ముఖ్యమైన పాయింట్ చెప్పింది… అది 2016 లోనే తాను సోదరుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్‌కు కాళేశ్వరం ఫైళ్ల అక్రమాల గురించి హెచ్చరించాను అంటోంది… (2016 లో అంటే కాళేశ్వరం పనులు ప్రారంభించిన సంవత్సరంలో)…

అంటే, తనకు 2016 నుంచీ కాళేశ్వరం అక్రమాల గురించి తెలుసునన్నమాట… అక్రమాలు నిజమేనని ఆమె, అంటే సాక్షాత్తూ కేసీయార్ బిడ్డ అంగీకరిస్తోంది… ఆమె ఇంకా ఏం చెప్పిందంటే..? ‘‘ఫైళ్లు కింది స్థాయిలో పరిశీలన లేకుండానే, నేరుగా ముఖ్యమంత్రికి పంపించబడ్డాయి… జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్ నివేదికను ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే అన్నీ స్పష్టమవుతాయి”…

తన మాటల సారాంశం ఏమిటంటే..? చివరకు సంబంధిత ఉన్నతాధికారులు, మంత్రి సంతకాలు లేకుండానే ఫైళ్లు కేసీయార్‌కు పంపించి, సంతకాలు చేయించి… స్వేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డారు… ఒకరకంగా హరీష్ రావే కేసీయార్‌ను ఈ అక్రమాల కేసులో బుక్ చేశాడు… కమిషన్ ఎదుట కూడా అదే చెప్పాడు…

‘‘అవును, హరీష్ రావుతో నాకేమీ వ్యక్తిగత విరోధం లేదు… కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంపైనే తనతో విభేదిస్తున్నాను, నిజాలు వెల్లడిస్తున్నాను… కేటీయార్‌ను అలర్ట్ కూడా చేశాను’’ అని వివరించింది…

మరి కన్సర్న్‌డ్ ఉన్నతాధికారులు, మంత్రి సంతకాలు లేకుండా ఆ ఫైళ్లకు కేసీయార్ ఎందుకు క్లియరెన్స్ ఇచ్చినట్టు..? సాక్షాత్తూ తన సోదరే తనను సీరియస్ అక్రమాలపై అలర్ట్ చేసినా సరే కేటీయార్ ఎందుకు పట్టించుకోలేదు… ఇవన్నీ గమనించాకే కేసీయార్ చాన్నాళ్లు హరీష్‌రావును దూరం పెట్టాడా..? ఈ క్లారిటీ రావల్సి ఉంది…

ఇవన్నీ వెల్లడిస్తున్నాను కాబట్టే బీఆర్ఎస్ సోషల్ మీడియా, హరీష్ రావు, సంతోష్ రావుల సీక్రెట్ మీడియా తనపై రకరకాలుగా దాడి చేస్తున్నాయనీ, ఈ దాడుల్ని జనం కూడా గమనిస్తున్నారని చెప్పింది… ఈ విషయంలో ఆమె గతంలో కూడా ఆరోపణలు చేసింది… తనను తన పార్టీ సోషల్ మీడియాయే బదనాం చేస్తుంటే, దుష్ప్రచారం చేస్తుంటే… పార్టీ పెద్దలకు (కేసీయార్, కేటీయార్) చెప్పినా పట్టించుకోలేదని గతంలో కూడా చెప్పింది…

మీడియా మీట్‌లో ఆమె ప్రస్తావించిన మరికొన్ని అంశాలు…

  • రాజకీయాల్లో ఎవరికీ ఎవరూ స్పేస్ ఇవ్వరు, తొక్కుకుంటూ పోవాల్సిందే, దారి చేసుకోవాల్సిందే…
  • కాంగ్రెస్ పార్టీలో చేరను, నన్నెవరూ అడగలేదు కూడా… రేవంత్ రెడ్డి పదే పదే తన పేరు ప్రస్తావనకు ఎందుకు తీసుకొస్తున్నాడో తెలియదు, ఏమో, ఆయనే పార్టీ నుంచి బయటికి పోతాడేమో…
  • సుప్రీంకోర్టు స్టే ఉన్నా సరే, కర్నాటక ప్రభుత్వం దూకుడుగా ఆలమట్టి ఎత్తు పెంపుపై ముందుకు వెళ్తోంది, మహారాష్ట్ర అడ్డుకుంటామని చెబుతోంది… తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించి కోర్టుకెక్కాలి… ప్రభుత్వానికి చేతకాకపోతే జాగృతి తరఫున మేమే కోర్టుకెక్కుతాం…
  • స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామా లేఖ ఇచ్చాను, మరెందుకు ఆమోదించడం లేదో…
  • నాతో చాలామంది బీఆర్ఎస్ నేతలు టచ్‌లో ఉన్నారు…
  • తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ కాబడిన బిడ్డను బహుశా నేనొక్కదాన్నేనేమో దేశంలో…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈజిప్ట్ గనుక బరిలోకి దిగితే… ఇక మూడో ప్రపంచయుద్ధం షురూ..!!
  • అడవి అంటే చాలు, తెలుగులో హిట్ పక్కా… కథాకాకరకాయ డోన్ట్‌ కేర్…
  • కాళేశ్వరం అక్రమాలపై హరీష్‌రావు తెలివిగా కేసీయార్‌ను ఫిక్స్ చేశాడా..?
  • ఆహా… తను నందమూరి తమన్ కాదు… ఇప్పుడు తమన్ కళ్యాణ్..!!
  • తెలంగాణ పెద్ద పండుగ దసరా… ఈ సోయి సర్కారుకు లేకుండా పోయింది…
  • ఆ డీఎస్పీ నళినికి ఏమైంది..? ఏమిటీ మరణవాంగ్మూల, వీలునామా ప్రకటన..?!
  • ప్రత్యేకించి ఇండియాపైనే అమెరికా ట్రంపుకు ఎందుకీ అక్కసు..?
  • కెప్టెన్సీ ఊడబీకేశారు… సంచాలక్స్ తలదించేశారు…గాడితప్పిన షో…
  • కేదారనాథ్‌కే కాదు… హేమకుండ్‌కూ రోప్ వే… ఈ రెండూ ఎందుకంటే..?
  • ఎవెరీబడీ లవ్స్ ఎ వైట్ రేషన్ కార్డ్..! అందరూ పేదవాళ్లే..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions