.
కల్వకుంట్ల కవిత కాళేశ్వరం కథలో మరింత మసాలా యాడ్ చేసింది… అనుకోని ఫ్లేవర్ ఇది… తాజాగా ఆమె ఏమంటున్నదంటే..?
కవిత సంచలన కామెంట్స్… కాళేశ్వరం అవినీతిలో హరీశ్ రావు పాత్ర లేదా… వాళ్ల స్వార్థం కోసం అవినీతికి పాల్పడ్డారు… అందుకే రెండవ టర్మ్ లో ఆయన్ను ఇరిగేషన్ మంత్రిగా తప్పించారు…
Ads
హరీష్ రావు, సంతోష్ వల్లనే కెసిఆర్ కి అవినీతి మరకలు… నాపై కుట్రలు చేసినా సహించాను… కానీ కెసిఆర్ పై అవినీతి ఆరోపణలు వస్తుంటే తట్టుకోలేపోతున్నా…
హరీష్ రావు, సంతోష్ వెనకాల రేవంత్ ఉన్నాడు… అవినీతి అనకొండలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు… నేను ఎవరైనా ఆడిస్తే ఆడే ఆటబొమ్మను కాను…
సోషల్ మీడియాలో నాపై ఈ ఇద్దరు ఇష్టమున్నట్లు రాయిస్తున్నారు… కవిత భావోద్వేగం… కెసిఆర్ పై సిబిఐ కేసులు పెట్టే స్థాయికి వచ్చాక పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత…
కాంగ్రెస్ కు దమ్ముంటే హరీశ్ రావు, సంతోష్ లపై చర్యలు తీసుకోండి… ఇద్దరి పేర్లు చెబుతున్నా… ఇద్దరు ఇరిగేషన్ అధికారుల దగ్గర వందల కోట్లు దొరికాయి… వారి వెనకాల ఎవరున్నారో దర్యాప్తు చేయండి…
1) కేసీయార్ మచ్చలేని చంద్రుడు, హరీష్ రావు, సంతోష్ మాత్రం అవినీతిపరులా…? అదెలా..? చిన్న సారు అవినీతిపరుడు అని సాక్షాత్తూ పెద్ద సారు బిడ్డే చెబుతోంది… అంటే తనే స్వయంగా కాళేశ్వరంలో అవినీతి ఉన్నట్టు అంగీకరిస్తోంది అన్నట్టేగా..?
2) సో, ఘోష్ కమిషన్ రిపోర్టును సాక్షాత్తూ కేసీయార్ సొంత కూతురే ఆమోదిస్తున్నట్టు లెక్క… సరే, చిన్న సార్లు ఎంత తిన్నారు, పెద్ద సారు ఎంత తిన్నారు అనేది సీబీఐ తేలుస్తుంది కదా…
3) రెండో టరమ్‌లో హరీష్ రావు బాగా తింటున్నాడని కేసీయార్ దూరం పెట్టాడని అంటున్నది కదా… మళ్లీ ఎందుకు చేరదీశాడు..? బారా ఖూన్ మాఫీ ఎందుకైంది..?
4) హరీష్, సంతోష్‌ల వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడంటే… అదే నిజమైతే, ఘోష్ కమిషన్ రిపోర్టులో 63 సార్లు హరీష్ రావు పేరెందుకు వచ్చినట్టు..? తననూ ఎందుకు ఫిక్స్ చేసినట్టు..?
5) కేసీయార్‌పై సీబీఐ కేసు పెట్టే స్థితి వచ్చాక ఇక పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత..? అదే కదా కేటీయార్, కేసీయార్ కూడా పరోక్షంగా చెబుతున్నది… పార్టీ నుంచి ఆల్రెడీ దూరం పెట్టేశారు కదా… ఇప్పుడు ఆ పార్టీలో లేనట్టే కదా…
6) హరీష్ రావు, సంతోష్‌లపై దమ్ముంటే చర్య తీసుకోవాలని డిమాండ్ కదా… హరీష్ మీద ఎలాగూ సీబీఐ దర్యాప్తు ఉంటుంది… సంతోష్ సంగతి కూడా ఆ దర్యాప్తులో తేలితే తనూ శిక్షార్హుడే… ఇందులో దగ్గూదమ్ము ఏమన్నయ్..?
7) అవునూ, ఇదే ఘోష్ కమిషన్ ఎదుటకు కేసీయార్ వెళ్తున్నప్పుడు ఈ ఆరోపణలు చేసి ఉంటే కథ మరింత రసకందాయంలో పడేది కదా… సీబీఐ దర్యాప్తు ప్రకటించాక, అంటే ఇంత లేటు స్పందన దేనికి..?
Share this Article