Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పొలిటికల్ ఫోర్స్ కోసం… మళ్లీ ఆ బతుకమ్మపైనే కవిత నమ్మకం…

September 24, 2025 by M S R

.

కుటుంబం దూరం పెట్టేసింది… పార్టీ సస్పెండ్ చేసింది… పార్టీ మీడియా దుమ్మెత్తిపోస్తోంది… ఆమె మీటింగులకు ఎవరూ వెళ్లవద్దని పార్టీలో అంతర్గతంగా ఓరకమైన నిషేధాజ్ఞలు… ఈ స్థితిలో… ఆమె భయపడుతుందనో, డిమోరల్ అయిపోయి డీలాపడిపోతుందనో సహజంగానే అందరూ అనుకున్నారు…

ఏదో ప్రెస్ మీట్లతో, ట్వీట్లతో… దెయ్యాలు, లిల్లీ ఫుట్స్‌పై విమర్శలు, ఆరోపణలు, కౌంటర్లతో కొన్నాళ్లు రాజకీయ తెర మీద కనిపిస్తుంది… తరువాత హేండ్సప్ తప్పదు అనీ తేలికగా తీసిపడేశారు… మరో షర్మిల అనీ కొట్టిపడేశారు…

Ads

కేసీయార్ సొంతూరు చింతమడకలో ఎంగిలిపూల బతుకమ్మకు హాజరై… ఏ బతుకమ్మ తనకు రాజకీయంగా జన్మనిచ్చిందో, పెంచిందో… మళ్లీ అదే కల్చరల్ బాటలోనే తనదైన రాజకీయాల్ని కొనసాగించాాలనే తన స్ట్రాటజీని బయటపెట్టింది… మరుసటి రోజు శ్రీరాంపూర్… అదే బతుకమ్మ…

kavitha

ఎంతమందొస్తారులే అనుకుంటే… మహిళలు బాగా వచ్చారు… ఆమె పట్ల ఆదరణ కనిపించింది… వర్షంలో కూడా ఆమె ఏం చెబుతుందో వినడానికి ఆసక్తి కనబరిచారు… వాళ్లు సమీకరించబడిన మహిళలు కాదు…

https://www.facebook.com/reel/1123459179269665

ఐతే… ఇక్కడ రెండుమూడు అంశాలు చెప్పుకోవాలి… 1) ఆమెది ప్రస్తుతానికి అక్షరాలా ఒంటరి ప్రయాణం… 2) ఒక మహిళగా దూకుడుగా ముందుకు పోవడానికి కొన్ని అననుకూలతలు ఉంటాయి… 3) పార్టీ, కుటుంబం కంప్లీట్‌గా టార్గెట్ చేశాయి… 4) సొంతంగా రాజకీయాల్లో ఇంపాక్ట్ చూపించాలంటే సాధనసంపత్తి అవసరం… 5) జనం ఆదరణ కనిపించినా దాన్ని సస్టయిన్ చేసుకోవాలి…

6) మీటింగుల్ని ఆర్గనైజ్ చేయడం ఈరోజుల్లో చాలా వ్యయప్రయాసలతో కూడుకున్నది… 7) అన్నింటికీ మించి ఆమెపై మద్యం అక్రమాల కేసు ఉంది… అదొక మరక… 8) ఏదో ఒక పార్టీతో అనుసంధానం కావడం వేరు, ఒక సొంత పార్టీ పెట్టి ఓ ఫోర్స్‌లాగా మారడం వేరు… కష్టమైన మార్గం…

మొదట్లో ఒకరిద్దరు నేతలు ఆమెను టార్గెట్ చేసి, విమర్శలకు దిగినా… ఆమె ఎదురుదాడితో ప్రస్తుతానికి కేసీయార్ క్యాంపు సైలెంట్ అయిపోయింది… ఆమె అడుగులను జాగ్రత్తగా పరిశీలిస్తోంది… బీజేపీతో బీఆర్ఎస్ విలీన ప్రయత్నాలకు ఆమె వ్యతిరేకి కదా… బీజేపీ ప్రభుత్వం ఆమె మీద కేసు పెట్టి, అరెస్టు చేయించింది కదా… ఐనా సరే, బీజేపీ అటాకింగ్ మోడ్‌లో లేదు… ఆమె కూడా బీజేపీ మీద విమర్శల జోరు ఏమీ చూపించడం లేదు…

కాంగ్రెస్ పైకి ఏం చెబుతున్నా సరే, ఆమె పట్ల సాఫ్ట్ కార్నర్‌తోనే కనిపిస్తోంది… దానికి బలమైన ప్రత్యర్థి కేసీయార్… ఆ క్యాంపులో ఇలాంటి కలకలం రేగడం దానికీ సంతోషమే కదా… సో, కవిత తన పట్ల జనం దృష్టిని, ఆసక్తిని ఎన్నాళ్లు సస్టెయిన్ చేసుకోగలదనేది ఆసక్తికరం..!!

  • *అవసరాన్ని బట్టి, సమయాన్ని బట్టి జాగృతినే రాజకీయ పార్టీగా ప్రకటిస్తాం* ఇదీ ఆమె స్టేట్‌మెంట్
  • Share this Article



    Advertisement

    Search On Site

    Latest Articles

    • అసలే ఆమె రేఖ… పైగా ఓ సరళీకృత అక్రమ ప్రేమ కథ… తెర చించేసింది…
    • ఆహా… నోబెల్ అవార్డుల జ్యూరీకి మనస్పూర్తి ప్రశంసలు… ఎందుకంటే..?
    • అంబానీలు, ఆదానీలు బోలెడు… అచ్చమైన భారత ‘రతన్’ టాటా ఒక్కడే..!
    • రేఖ బయోబుక్..! పుట్టుక నుంచీ ఆమె లైఫ్ జర్నీపై సంపూర్ణ చిత్రణ…
    • రష్మికపై కన్నడ ఇండస్ట్రీ నిషేధం..? నిజమేనా..? ఎవరితో లొల్లి..?!
    • అగ్ని శలభ న్యాయం… జర్నలిజం కొలువులూ అంతే… మాడిపోతారు..!!
    • నీయమ్మని, నీయక్కని, నీతల్లిని… ఈ డర్టీ సాంగ్‌కు సిగ్గూశరం లేని సమర్థన..!!
    • నా బిడ్డ పెళ్లిని ఆ బైకర్ల గ్రూప్ రఫ్‌గా అడ్డుకుంది… కానీ మంచే జరిగింది…
    • ఆహా… దక్షిణ వాగ్గేయకారులకూ అయోధ్య రాముడి చెంత చోటు…
    • గుడ్డు అంటేనే గుడ్డు… వెరీ గుడ్డు… అకారణ భయాలే నాట్ గుడ్డు…

    Archives

    Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions