Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బిగ్‌బాస్ అర్జున్‌రెడ్డి… బండ అనుకున్నాం కానీ బండెడు లవ్వుంది…!!

November 17, 2024 by M S R

మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా… చివరి బంతి, నాలుగు రన్స్ కావాలి, కూల్‌గా ఓ హెలికాప్టర్ షాట్‌తో సిక్స్ కొట్టేసి, ఫైనల్ గెలిచేసినా సరే… ధోని మొహంలో వీసమెత్తు ఆనందపు ఉద్వేగం కనిపించదు… ఓ స్టంపు తీసుకుని, బ్యాట్ చంకలో పెట్టుకుని నిర్వికారంగా వచ్చేస్తాడు…

పక్కా రాక్ ఫార్మేషన్… ఉద్వేగం పలకదు… తత్వమే అది కావచ్చు… సేమ్, మన బిగ్‌బాస్ నిఖిల్… కన్నడిగ… తెలుగు టీవీ సీరియల్స్ నటుడు… హౌజులో మొదటి నుంచీ దుమ్మురేపే కంటెస్టెంట్,,. విజేత కావడానికి అన్ని కోణాల్లోనూ అర్హత ఉన్న పోటీదారు… కాకపోతే ఆశ్చర్యం ఏమీ లేదు, ఎందుకంటే అది బిగ్‌బాస్ నానా చిత్తప్రకోపాల టీమ్ షో కాబట్టి…

kavya

Ads

తన మొహమూ సేమ్… బండ… మానవ సహజ ఉద్వేగాలు కనిపించవు… స్ట్రాటజీలు, గేమ్ ప్లాన్లు వోకే, ప్రత్యర్థిని బెదరగొడతాడు… ఆటలో దిగితే బ్రహ్మరాక్షసుడు… తన మొహంలో ఏదైనా ఉద్వేగం కనిపించిందీ అంటే రెండే సందర్భాలు… ఒకటి అమ్మ వచ్చినప్పుడు… చిన్న పిల్లాడయిపోయి కన్నీళ్లు పెట్టుకున్నాడు… సింహబలుడైతేనేం… అమ్మకు కొడుకే కదా…

రెండో సందర్భం… కంటెస్టెంట్లు అందరూ తమ లవ్, క్రష్ గురించి చెప్పుకున్నప్పుడు… తనూ చెప్పాడు… కన్నీళ్లు పెట్టుకున్నాడు… తను ఓ అర్జున్ రెడ్డి… ఎస్, తన కోయాక్టర్ కావ్యతో చాన్నాళ్ల లవ్… పెళ్లే తరువాయి అనుకుంటున్నవేళ, తనే ఏదో ఇంటర్వ్యూలో ఇప్పుడు తనతో లేదని దాదాపు బ్రేకప్ అని చెప్పినట్టు గుర్తు…

ఆమె అమితంగా ప్రేమించింది తనను… కానీ నిఖిలే ఏ పొరపాట్లు చేశాడో గానీ ఆమె మనసు విరిచాడు… ఇప్పుడు మళ్లీ చెబుతున్నాడు… ‘‘నాకు తనొక్కతే, ఇండస్ట్రీలో కాలు పెట్టినప్పుడే తెలిసింది… ఆరేళ్లవుతోంది… ఫ్యూచర్‌లో వేరే వ్యక్తి వచ్చినా రాకపోయినా ఆ నిఖిల్ మళ్లీ రాలేడు… ఆ ఒక్క వ్యక్తితోనే ఉంటాడు…

బ్యాక్ గ్రౌండ్ చూడలేదు, హార్ట్‌ల్ ఫిక్సయితే అది ఫిక్సే… తనే నా భార్య… అలా ఫిక్స్ అయిపోయాం… కొన్ని కారణాలు, సైలెంటుగా ఉన్నా… కాస్త స్పేస్ కోరుకున్నా, అంతే… తనే ఫస్ట్, తనే లాస్ట్… బోలెడు జ్ఞాపకాలు… విడిపోయామా..? ఏమో… నా వైపు కూడా తప్పుంది, కానీ అర్థం చేసుకోవచ్చుగా నన్ను అనే కోపం… మా అమ్మ, తను ఒకటే అనుకున్నాను…

నేను ఖచ్చితంగా వస్తా, నువ్వు కోప్పడతావు, కొడతావేమో… ఏడుస్తావేమో… ఏదయితే అది కానీ, మళ్లీ వస్తా, తిట్టు, కొట్టు, ఈ షో నుంచి బయటికి రాగానే నీ ముందుకే వచ్చి నిలబడతా… పిచ్చి లేస్తే లేపుకెళ్తా… నేను ఏం చేశానో సారీ… నాకు నువ్వు కావాలి… ఒక బిడ్డ తప్పు చేస్తే అమ్మ క్షమించదా, నువ్వూ నన్ను క్షమిస్తావు.,. నాకు నువ్వు కావాలి…’

ఇలా చెప్పుకొచ్చాడు… తనపై ఏవో ఆశలున్న యష్మి కూడా విని అర్థం చేసుకున్నట్టుగా చివరలో చప్పట్లు కొట్టింది… ఆమోదసూచనగా… హౌజులో నిఖిల్ స్నేహితులు వాళ్లే కదా… యష్మి, ప్రేరణ, పృథ్వి… నిఖిల్‌లో ఈ రేంజ్ ప్రేమికుడు ఉన్నట్టు తెలియదు… మొత్తానికి ఆ ఎపిసోడ్ చూసిన ప్రేక్షకులు కూడా ఉద్వేగానికి గురయ్యారు…

అదీ సింపతీ తెచ్చుకునే డ్రామానా..? కాకపోవచ్చు… నిఖిల్ సింపితీ ఎప్పుడూ కోరుకోలేదు హౌజులో… భీముడిలా ఆడటమే… టేస్టీ తేజ తల్లిని హౌజుకు తీసుకొచ్చారు… పృథ్వి లవర్, కోయాక్టర్ దర్శినిని తీసుకొచ్చారు… మరి కావ్యను ఎందుకు తీసుకురావొద్దు అని నెటిజనం బోెలెడు కామెంట్లు పెడుతున్నారు…

బిగ్‌బాస్‌ది ఏం పోయింది… అడుగుతాడు… ఆమె అంగీకరిస్తుందా… అసలే కోపమ్మీద ఉంది… క్షమిస్తే వస్తుంది… ఏమో… ఏమాటకామాట… ఆ ఇద్దరూ చూడముచ్చటైన జంట… తత్వాలు అంటారా..? కలిసిపోతే అన్నీ రాజీలే కదా..!!

చెప్పనే లేదు కదూ… నిఖిల్ ఎపిసోడ్ ప్రసారం అయిన వెంటనే కావ్య తన ఇన్‌స్టాలో ఓ పోస్టు పెట్టింది… ముసుగులు చూసి మోసపోవద్దు అని, ఆ ముసుగులు తొలగిపోయి నిజాలు బయటపడతాయి అని… ఇంకెవరు..? నిఖిల్‌ను ఉద్దేశించే…. భాఘా ఖోఫంఘా ఉన్నట్టుంది..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చంద్రబాబు ప్రమోట్ చేశాడు… టేస్ట్ అట్లాస్ కూడా తప్పనిసరై గౌరవించింది…
  • ఇద్దరు వీరోయిన్లతో చిరంజీవి కిందామీదా పడి దొర్లినా… ప్చ్, పాపం..!!
  • 82వ ర్యాంకు కాదు…! 2, 3 ఏళ్లలో వరల్డ్ టాప్-20 లిస్టులోకి హైదరాబాద్..!!
  • ధర్మేంద్ర కుటుంబానికి బ్రిటిష్ రాజవంశంతో చుట్టరికం..! ఎలా..?!
  • సాంబ, మూర్తి, వెంకటకృష్ణ… వీళ్లే హైదరాబాద్ ప్రేక్షకులకు ఇష్టులు..!!
  • అడ్డగోలు దందా బీఆర్ఎస్ హయాంలో..! బురద జల్లేది ఈ ప్రభుత్వంపై..!!
  • మీడియా జీవితాలను, కుటుంబాలను నిలబెట్టగలదు… ఇవి అవే స్టోరీస్…
  • సర్‌ప్రయిజ్ అప్పియరెన్స్..! ఈ తెలంగాణ ‘బతుకమ్మ’ గుర్తుందా మీకు..?!
  • యాక్షన్ లేదు, ఆధార్ బ్లాకూ లేదు… ఈ వివాదం పూర్వపరాలు ఇవీ…
  • మిస్టర్ కీరవాణీ… ఈ వారణాసి లవ్ సాంగ్ వీడియో నువ్వైనా చూశావా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions