.
వావ్… ఈ మాట మొన్నటి పంద్రాగస్టు నాడు సోనీ లివ్‌లో వచ్చిన కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రాం గురించి… ప్రశ్నలు, లైఫ్ లైన్లు, మధ్యలో కంటెస్టెంట్ల వ్యక్తిగత వివరాలు గట్రా ఎప్పుడూ ఆసక్తికరమే… అందుకేగా ఇన్నేళ్లుగా… పదహారు సీజన్లు దాటి, పదిహేడో సీజన్ కూడా ఆరంభమైంది…
అదే అమితాబ్… తను తప్ప ఏ భాషలోనూ ఎవరూ ఈ ప్రోగ్రాంను ఇంత సమర్థంగా డీల్ చేయలేదు… అమితాబ్ ఎదుట కూర్చోవడం కోట్లాది మంది భారతీయులకు, అదీ కేబీసీలో..? ఓ డ్రీమ్… అప్పుడప్పుడూ సెలబ్రిటీలను తీసుకొచ్చి కూర్చోబెడతారు, ఫన్, ప్రోగ్రామ్‌కు ఒక వాల్యూ యాడిషన్…
Ads
కానీ ఈసారి బాగా నచ్చేసింది… దేశభక్తికి సంబంధించిన ఓ సినిమా చూసినట్టు అనిపించింది… జయహో కేబీసీ… ఈసారి గెస్టు కంటెస్టెంట్లు ఎవరంటే… 1) ఇండియన్ ఆర్మీ లేడీ కల్నల్ సోఫియా ఖురేషీ… 2) ఇండియన్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్… 3) ఇండియన్ నేవీ ఫస్ట్ లేడీ కమాండ్ ప్రేరణ దియోస్థలె…
రియల్లీ హేట్సాఫ్… ఓ మాంచి క్యాప్సూల్ ప్రజెంట్ చేశారు… ఆపరేషన్ సిందూర్ విశిష్టత వేరు తెలుసు కదా… దాని మీడియా బ్రీఫింగ్ మొత్తం లేడీ ఆఫీసర్లతో చేయించారు… భారతీయ త్రివిధ దళాల్లో మహిళల పాత్ర, తెగువను చూపే కేరక్టర్లు వాళ్లు… ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ మాత్రమే కాదు… ప్రతి యుద్ధంలో ఇక చాలా వింగ్స్ పనిచేయాల్సి ఉంటుంది… అదంతా వేరే కథ…
కానీ ఇలాంటి ప్రోగ్రాంకు అమితాబ్ ఎంత పెద్ద అసెటో ఈ ఎపిసోడ్ చక్కగా నిరూపించింది… అడుగడుగునా దేశభక్తికి సంబంధించిన ఎమోషన్ ఫిల్ చేశారు… ఆ ముగ్గురూ హుందాగా, గంభీరంగా, స్పూర్తిదాయకంగా ఎంత బాగా మాట్లాడారో… ఆపరేషన్ సిందూర్ గురించే కాదు…
తాము ఈ సర్వీసులో ఎలా వచ్చారోె, ఏం నేర్చుకున్నారో, కీలక సమయాల్లో వాళ్ల ఫీలింగ్స్ ఏమిటో, ఫ్యామిలీ సపోర్ట్ ఏమిటో… వాట్ నాట్..? కేబీసీ టీమ్ బాగా ప్లాన్ చేసింది… ఆ ముగ్గురూ మాట్లాడిన తీరు ఎంత బాగుందో… మరోసారి వావ్…
ఎస్, సోనీ లివ్‌లో ఉంది… చూడొచ్చు… వోెకే, త్రివిధ దళాల్లో వాళ్లను మించిన చాలా హోదాలుంటయ్… కానీ మన సైన్యంలో మహిళల పాత్రలకు వాళ్లు ప్రతీకలు… ఎక్కడా బ్యాలెన్స్ కోల్పోకుండా ఆపరేషన్ సిందూర్ గురించి, స్ట్రెయిట్‌గా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు… పర్టిక్యులర్‌గా సోఫియా ఖురేషీ… అఫ్‌కోర్స్ వ్యోమికా…
జస్ట్, కేబీసీ ఆడించడం కాదు… ఆడిస్తూ అన్ని వివరాలూ చెప్పించడం… ఎఎన్ఐ వీడియో ఫీడ్, ఆర్మీ ఫీడ్ సమయానుకూలంగా చూపిస్తూ… ఓ పర్‌ఫెక్ట్ క్యాప్సూల్ క్రియేట్ చేసింది కేబీసీ టీమ్… మరీ స్క్రిప్టెడ్ గాకుండా కేబీసీ ప్రశ్నలు కూడా బాగున్నయ్… ఈసారి కేబీసీ రూల్స్, లైఫ్ లైన్స్ ఎట్సెట్రా కొన్ని మారాయి, ప్రత్యేకించి హింట్ ఆప్షన్ వంటివి… ఈ ఎపిసోడ్‌కు సంబంధించి సెల్యూట్ టు కేబీసీ టీమ్, అండ్ అఫ్‌కోర్స్, టు త్రీ లేడీ డిఫెన్స్ ఆఫీసర్స్…
Share this Article