.
తను అడ్డగోలుగా బుక్ అవుతున్నాననే స్పృహ కేటీయార్‌లో చాలా రోజులుగా కనిపిస్తోంది… తమకు ఇన్నేళ్లుగా అణిగిమణిగి కోవర్టు ఆపరేషన్లు చేసే నాయకుడు కాదు కదా రేవంతుడు…
అసలే బాధితుడు కదా… కాస్త కసిగానే వర్కవుట్ చేస్తున్నాడు… కవితను వదిలేయండి, ఆమె బీజేపీ స్ట్రాటజీ కస్టమర్… సరే, వాళ్లు కొన్నాళ్లకు పిచ్చి పొలిటికల్ స్ట్రాటజీల పేరిట ఉపేక్షిస్తారు… అదే కేసీయార్ మళ్లీ ఏవేవో డ్రామా ఎపిసోడ్లతో బీజేపీని బజారుకీడుస్తాడు… బీజేపీ నాయకులకు సిగ్గూశరం ఏమీ ఉండదు తెలిసిందే కదా…
Ads
ఇప్పుడు కేటీయార్‌ను ఫార్ములా కేసులో పెట్టారో లేదో… అగ్నిగుండం మన్నూమశానం అని ఏదో బీఆర్ఎస్ వాళ్లు అంటారు గానీ… ముందుగా ఉలిక్కిపడి, వెంటనే ఈడీని రంగంలోకి దింపారు బీజేపీ నేతలు.,. అంటే కర్ర విరగదు, పాము చావదు.,. కత్తి మా చేతుల్లో ఉండాలి… చెత్తా వ్యూహం…
అటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏమీ తేలదు… ఇటు ఈ ఫార్ములా కేసూ ఏమీ తేలదు… కేసుల మెరిట్స్‌లోకి నేను పోవడం లేదు… కాలేశ్వరంలో కేసీయార్, హరీష్… పవర్ కేసుల్లో కేసీయార్… ప్లస్ ఫోన్ ట్యాపింగు… అబ్బే, ఇవన్నీ తేలేవి కావు, ఎవరికీ శిక్షలు పడేవి కావు అంటారా..?
అంతేలే… నిరంజన్‌రెడ్డిలు, హరీష్ సాల్వేలు, కపిల్ సిబల్‌లు… ఎందరో ఉంటారు… తెలంగాణను అక్షరాలా అమ్మేసుకుని, ఒవైసీ చెప్పినట్టు ఏడెనిమిది తరాల సంపాదన సాధించి… సగటు తెలంగాణావాదిని నిండా ముంచేసిన కుటుంబానికి ఏమవుతుంది..? ఏమీ కాదు అంటారా..?
డెమోక్రసీ మీద వీసమెత్తు నమ్మకం లేని పక్కా డిక్టేటర్ కుటుంబం… beyond that… ఫాఫం, సగటు తెలంగాణవాది..! అంత పెద్ద 2జీ కుంభకోణంలో ఏమైంది కణిమొళికి..? ది గ్రేట్ రాజాకు..? సిగ్గూశరం లేని బీజేపీ పుణ్యమాని వాళ్లు సేఫ్… కానీ ఇలాంటివెన్నో కేసులు… ( బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్‌కు ఏ శరమూ లేకపోయినా సరే…) ఓ చిరు ఆశ… నిన్న మరణించాడు కదా ఓం ప్రకాష్ చౌతాలా..? ఆ కథ చదవాలి వీళ్లందరూ… ప్రత్యేకించి హరీష్ రావు అనే కేరక్టర్…
ఈ దేశ ఉపప్రధాని దేవీలాల్ కొడుకు… తండ్రి హర్యానా సీఎం, కొడుకు సీఎం… ఐతేనేం..? ఏదో ఓ స్కాంలో నిందితుడై ఏళ్లుగా శిక్ష అనుభవించాడు… చివరకు కరోనా కారణంగా విడుదలయ్యాడు… కుటుంబంలో నాలుగైదు తరాలు రాజకీయాల్లో పదవులు… బోలెడు పార్టీల చీలికలు… సో వాట్..?
చచ్చాడు, ఏం కట్టుకుపోయాడు..? ప్రజలు ఈరోజుకూ బండబూతులు తిట్టుకుంటున్నారు… అదేం బతుకు అంటారా..? రాజకీయాల్లో అంతే,.. కళ్లు కనిపించవు… వారసత్వ రాజకీయాలతో బుర్ర మసకేస్తుంది…
సో, ఈ కథలో నీతి ఏమిటంటే..? బతకడం, సంపాదించడం కాదు… ఎలా బతికామనేది ముఖ్యం..? ఫామ్ హౌజులో తనను అందలమెక్కించిన జనాన్ని విస్మరించి బతకడం కూడా కాదు… ఎలా తలెత్తుకుని బతికాం అనేదే ముఖ్యం…. తెలంగాణలో దొరవారిని నమ్మి, పొర్లుదండాలు పెట్టిన జనానికి అర్థమయ్యేలోపు పదేళ్ల పుణ్యకాలం గడిచిపోయింది… సరే, తెలంగాణకు శతాబ్దాలుగా ఎప్పుడూ భంగపాటే కదా…
ఒక ఎన్టీయార్, ఒక వైఎస్ఆర్, ఒక కేసీయార్… మన లేదు, పరాయి లేదు… అందరూ అందరే… రేవంత్ ఏమీ శుద్ధపూస కాదు… కాదు… వాళ్లను మించిన తాత… చెప్పుకుందాం ఇక క్రమేపీ…! ఎన్టీయార్ 100 అడుగుల విగ్రహానికి స్థలం ఇవ్వడం అనే పరమ దరిద్రమైన నిర్ణయం దగ్గర నుంచీ… తన పాలనా దరిద్రాల గురించి..!!
Share this Article