Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పగులుతున్న పాపాల పుట్టలు – బీఆర్ఎస్ క్యాంప్ హఠాత్తుగా సైలెంట్

October 30, 2026 by M S R

.

వరుసగా ఎదురుదెబ్బలు… బీఆర్ఎస్ క్యాంపు సైలెంట్… లక్షల కోట్ల అక్రమాల పుట్టలు బయటపడేకొద్దీ నోటమాట రాని దురవస్థ… కేసీయార్ పాలనకాలంలో సాగిన అంతులేని అరాచకపు, ఆర్జనపర్వం వెలుగులోకి వస్తున్నాయి… కాంగ్రెస్ నాయకుడిగా కాదు, ఏకంగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి చెబుతున్న, వెలికితీస్తున్న కేసీయార్ అండ్ కో దోపిడీ కథలు, కఠిన నిజాలు తెలంగాణ సమాజాన్ని విభ్రాంతికి గురిచేస్తున్నాయి…

ఓసారి చెప్పుకున్నాం కదా… కేసీయార్ మార్క్ అక్రమాలపై శిక్షించడానికి కాదు, ఆ అక్రమాల నిగ్గుతేల్చడానికే రేవంత్ రెడ్డి పదవీకాలం సరిపోదని..! అదే జరుగుతోంది… రేవంత్ రెడ్డి తెలంగాణకు చేసిన అతి పెద్ద మేలు… ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన పదేళ్లలో జరిగిన అంతులేని దోపిడీని బరిబాతల తెలంగాణ సమాజం ఎదుట చూపించడం..!

Ads

ఇప్పుడు కూడా తనేమీ దాచుకోవడం లేదు… బాజాప్తా పేర్లతోసహా వెల్లడిస్తున్నాడు… మియాపూర్‌లో 50 వేల కోట్ల అత్యంత విలువైన భూమిని కబ్జాదారుల నుంచి సుప్రీంకోర్టు కాపాడింది… ఆ కబ్జాదారులకూ కేసీయార్ అండ్ కో ఎలా అండగా నిలబడిందో ముఖ్యమంత్రి ఢిల్లీలో వివరంగా చెప్పుకొచ్చాడు… అందుకే బీఆర్ఎస్ నేతలకు మాట కరువైంది, మొహం చెల్లడం లేదని సూటిగానే సంధించాడు… (లక్షల కోట్ల ఖజానా హైదరాబాద్ భూములు… ఇంకా తవ్వేకొద్దీ ఇంకెన్ని పుట్టలు పగులుతాయో ఊహకు కూడా అందదు)…

miyapur lands

ముఖ్యమంత్రి మాటల్లో కొన్ని ముఖ్యమైనవి… 

– మియాపూర్ భూములు కొల్లగొట్టేందుకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన బంధువు దామోదర్ రావు, గోల్డ్ స్టోన్ ప్రసాద్ ద్వారా ప్రయత్నించారు… కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని విలువైన భూములు కబ్జాకు ప్రయత్నించారు

– ఎమ్మెల్యేగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షునిగా ఈ కబ్జా వ్యవహారాలపై పోరాడడంతోనే కక్ష గట్టి నన్ను జైలుకు పంపారు… మియాపూర్ భూముల విషయంలో దామోదర్ రావుకు ముందుగానే విలాసవంతమైన కార్లు లంచంగా ఇచ్చారు… కేసీఆర్ కు నగదు రూపంలో ముడుపులు ఇచ్చారు…

– కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల కబ్జాల నుంచి భూములను రక్షించే ప్రయత్నిస్తున్నాం… మా ప్రభుత్వం వచ్చాక రూ. 1.50 లక్షల కోట్ల విలువైన భూములు రక్షించాం… IMG భూములను భలేరావు కుటుంబ సభ్యులతో కుమ్మక్కై కేటీఆర్ కొట్టేయాలని చూస్తే న్యాయపోరాటంతో అడ్డుకున్నాం…

– కంచె గచ్చిబౌలి, మామిడిపల్లి భూములను కొట్టేసేందుకు బీఆర్ ఎస్ నాయకులు ప్రయత్నిస్తే న్యాయపోరాటంలో గెలిచాం… గుర్రంగూడ అటవీ భూములను కేటీఆర్ అనుచరులు కబ్జాకు ప్రయత్నిస్తే సుప్రీం కోర్టులో పోరాడాం…

– మంచిరేవులలో 143 ఎకరాల భూమిని కేటీఆర్ రాయలసీమ బిల్డర్స్ తో కలిసి కబ్జాకు ప్రయత్నిస్తే దానిని రక్షించాం… జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 400 ఎకరాల అటవీ భూమిని బీఆర్ఎస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేకు నజరానాగా అప్పగిస్తే సుప్రీం కోర్టులో పోరాడి రక్షించాం…

– మియాపూర్ భూములపై ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే ఎందుకు బీఆర్ఎస్ నాయకులు స్పందించడం లేదు..? కనీసం రెవెన్యూ అధికారులను ఎందుకు బీఆర్ఎస్ నాయకులు అభినందించడం లేదు..?

– పద్మాలయ స్టూడియో, ల్యాంకో భూములపై ఉమ్మడి రాష్ట్రంలో కేసులు వేసిన కేసీఆర్, హరీష్ రావు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు వాటిని స్వాధీనం చేసుకోలేదు..? అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిపై కేసులు వేశారో వారితో కేసీఆర్, హరీశ్ రావు లాలూచీ పడ్డారు..

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పగులుతున్న పాపాల పుట్టలు – బీఆర్ఎస్ క్యాంప్ హఠాత్తుగా సైలెంట్
  • ఎఐ కొలువుల్నే కాదు, ప్రాణాలనూ తీయగలదు… బహుపరాక్…
  • ఫ్లూ వేక్సిన్ అనగానే… చిన్ననాటి మశూచి టీకాలు, పుండ్లు గుర్తొచ్చాయి…
  • మరీ ‘ఆదర్శ’ కుటుంబం కాదు గానీ… ఏదో సంసారపక్షంగా నడిపించేశారు!
  • అటు నోటి దూలతో నెగెటివిటీ – ఇటు మహర్దశ కూడా నడుస్తోంది
  • ప్రవచనకారి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారూ… తమరు తప్పులో కాలేశారు…
  • … చివరకు ఓటీటీలోనూ ఫాస్ట్‌ఫార్వర్డ్ చేస్తూ సైతం చూడలేకపోతి…
  • మియాపూర్ కేసు ! కేసీయార్ పట్టించుకోలేదు- రేవంత్ చేసి చూపించాడు !!
  • ‘అన్యమతస్తులు ఎంతటివారైనా సరే… ధ్వజస్థంభం దాటడానికి లేదు…’
  • వారణాసి OTT బిజినెస్… జక్కన్న మరో మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడా ?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions