.
నిజంగానే కేసీయార్‌కు ఏదో అయ్యింది… ఏమంటున్నాడు తను..? కత్తి ఒకరికిచ్చి ఇంకెవరినో యుద్ధం చేయమంటే ఎట్లా..? అన్నా రావే రావే అని ఆయన్ని వేడుకుంటున్నారట.,. నన్ను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టిన్రు కదా, ఏడికి రావాలె అనడుగుతున్నాడు… సంపూర్ణ బాధ్యతారాహిత్యపు వ్యాఖ్యలు… ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తి నోటి నుంచి రాకూడని, ఊహించని డొల్ల మాటలు అవి,.,
కేసీయార్‌కు ఏదో రాజకీయ పరిణతి ఉందని అనుకునేవాళ్లను కూడా షాక్‌కు గురిచేస్తుండు కేసీఆర్… అసలు తన కత్తి అనే వ్యాఖ్యలకు ఏదైనా అర్థముందా..? ఎన్నికల్లో గెలుపూ ఓటములు ఉంటాయనే కనీస స్పృహ కూడా కోల్పోయి, జనం మీద అక్కసు వెళ్లగక్కడం ఏమిటి…?
Ads
ఈరోజుకూ తను మళ్లీ ప్రజాజీవితంలోకి రాలేదు… తెలంగాణ జనం నానా సమస్యల్లో ఉంటే… నన్ను ఓడించారు కదా, మంచిగైంది, అనుభవించండి అనే ఓరకమైన కసి కనిపిస్తుంది తనలో… కానీ ఎందుకు తనను ఓడించారనే బేసిక్ మథనం లోపించింది తనలో…
అసలు ఓటమి తరువాత ఇన్నాళ్లలో ఒక్కసారి కూడా ప్రజాతీర్పును ఆమోదిస్తున్నట్టు, గౌరవిస్తున్నట్టు చెప్పలేదు తను… ఇది నియంతతనాన్ని మించి మరేదో… అనర్హత వేటు వేస్తారనే భావనతో అసెంబ్లీకి అలా వచ్చి, ఇలా వెళ్లిపోయాడు… అంతేగానీ… జనం పట్ల గానీ, చట్టసభ పట్ల గానీ… ప్రజాజీవితపు కనీస బాధ్యతల పట్ల గానీ వీసమెత్తు గౌరవాన్ని ప్రదర్శించలేకపోయాడు…
తొమ్మిదిన్నరేళ్లు పాలించిన తనను జనం ఎందుకు ఛీత్కరించారనే ఆలోచన, సమీక్ష లేదు ఈరోజుకూ… ఐనా కత్తి ఇవ్వడం అంటే అధికారం ఇవ్వడం కదా… అది ఇస్తే ఎవరి మీద పోరాడతాడు..? ఒక పదానికీ మరో పదానికీ నడుమ లంకె, అర్థం కూడా లేనంత అయోమయం…
అవును, నిన్ను ప్రతిపక్షంలో ఉండి వాచ్‌డాగ్ పాత్ర పోషించమన్నారు జనం… అధికారంలో ఉంటేనే ప్రజాజీవితం, లేకపోతే అజ్ఞాతమా ఈ ధోరణి..? మరి అలాంటప్పుడు బీఆర్ఎస్‌ను ఓడించినా సరే, కేటీయార్, హరీష్, కవిత ఎందుకు జనంలోకి వస్తున్నట్టు..? కేసీయార్ ఈక్వేషన్, పద్ధతి కరెక్టు అయితే, జనం ఓడిస్తే ఇక జనంలోకి రావద్దనేదే సూత్రమైతే వాళ్లెందుకు వస్తున్నారు..?
సరే, జనం తప్పు చేశారు… ఓడించారు… మరి ఆ ఎమ్మెల్యే పోస్టు కూడా దేనికి జనంలోకి రానప్పుడు..? జనం మీద అదే విరక్తితో వదిలేయవచ్చు కదా… ప్రభుత్వంతో పోరాడవయ్యా నువ్వు అని జనం చెబితే, చేతిలో కత్తి లేదు, పానా లేదు, నట్టు లేదు అనే మాటలేమిటి అసలు..?
పోనీ, తొమ్మిదిన్నరేళ్లు నీ చేతిలోనే కత్తి ఉంది కదా… ప్రజాస్వామిక స్పూర్తిని నరికీ నరికీ చివరకు రాష్ట్రాన్ని మేడిగడ్డ బరాజ్‌ను చేశావని కదా కాంగ్రెస్ విమర్శ… మీకు మంచిగైంది, కావల్సిందే, అనుభవించండి, శాస్తి జరిగింది అనే మాటలు ఇన్నేళ్ల రాజకీయ జీవితం ఉన్న వ్యక్తి నుంచి వెలువడటం తెలంగాణ దురదృష్టం కాదా..!
సరే, నీకు కత్తి ఇస్తాం ఇప్పుడు… ఎవరి మీద పోరాటం చేస్తవ్, అప్పుడు నువ్వే కదా అధికారంలో ఉండేది… ఓడిపోయిన కాంగ్రెస్ మీద ప్రలోభాల వలలు విసిరి, ఎమ్మెల్యేలను లాగేసి, పార్టీని ఖండఖండాలుగా నరుకుతావు, అదేనా పోరాటం..? ఇతర పార్టీల్లో కోవర్టుల్ని పెట్టుకుని వాళ్లను కకావికలం చేస్తవ్, అంతేనా..? అదేనా పోరాటం..?
బీజేపీ మోడీని, అమిత్ షాను బజారుకు లాగి, బట్టలిప్పి బదనాం చేయాలని ఏదో నాటకం ఆడి, భంగపడి… తెరవెనుక ఏవో లోపాయికారీ వ్యవహారాలు… మరోవైపు తెర ముందు ఇప్పుడు అదే రేవంత్ రెడ్డితో కలిసి స్టాలిన్ దగ్గర యాంటీ – బీజేపీ వేషాలు.. అసలు మోడీకి కదా సోయి ఉండాల్సింది..!!
Share this Article