Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చివరకు కాశీకి వెళ్లినా ఆ పడికట్టు పదాలేనా కవితమ్మా..!!

January 29, 2021 by M S R

ఏ పూజకైనా సరే… సంకల్పం స్థిరంగా, సూటిగా ఉండాలి… ఏ ఫలితం కోసం ఆ పూజ చేయబడిందో, ఆ ఫలితాన్నే ఆశించేలా దృష్టి కేంద్రీకృతమై ఉండాలి, ఆ సంకల్పాన్ని పక్కదోవ పట్టించే మాటలు, చేష్టలు ఉండకూడదు… అలా చేస్తే పూజాఫలమే సిద్ధించదు……….. అప్పుడప్పుడూ పురోహితులు చెప్పే మాటలివి… ఇవెందుకు గుర్తొచ్చాయంటే… ఓ వార్త చదివాక..! సీఎం కేసీయార్ కుటుంబం కాశికి పోయి, గంగకు హారతి ఇచ్చి, దేవుడిని ప్రార్థించింది అనేది ఆ వార్త… ‘‘ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థించాం’’ అని ఎమ్మెల్సీ కవిత చెప్పింది… అక్కడ, ఆ వాక్యం దగ్గర స్టక్ అయిపోయింది రీడర్ చూపు… అవసరమా ఈ వ్యాఖ్య..? ఏదో, నమస్తే తెలంగాణ పత్రికను పెద్దగా ఎవరూ చదవరు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇలాంటి వ్యాఖ్యలతో నష్టం జరగదా..?

రాజకీయాల్లో అబద్ధాలో, హిపోక్రటిక్ మాటలో, సర్వకాలాల్లోనూ మేం ప్రజల గురించే ఆలోచిస్తామనే పరోక్ష సందేశ ప్రకటనలో సర్వసాధారణం… పడికట్టు పదాలు వాడుతూనే ఉంటారు… ‘ప్రజలకు సేవ చేయడానికే’ మేం రాజకీయాల్లో ఉన్నాం అన్నట్టుగా సాగే మాటల్లో ఎంత నిజం ఉంటుందో అందరికీ తెలుసు… కానీ ఈరోజుకూ పొలిటికల్ లీడర్లు అలాగే మాట్లాడుతూ ఉంటారు… కానీ ఇప్పటితరం అలాంటి డొల్లతనాన్ని ఇష్టపడటం లేదు… జాగ్రత్తగా గమనిస్తే, ఇప్పటితరం స్ట్రెయిటుగా మాట్లాడేవాళ్లను ఇష్టపడుతున్నారు… ప్రత్యేకించి ఇలాంటి స్టీరియోఫోనిక్ పడికట్టుపదాల్ని యువత లైట్ తీసుకుంటోంది… లేదు, లేదు, మేం మా పాత పడికట్టు భావజాలానికే కట్టుబడతాం అనుకుంటే ఎవరూ చేసేదమీ లేదు…

varanasi

ఇక కాశీకి వద్దాం… కేసీయార్ భగాలాముఖి పూజల్ని ప్రత్యేకంగా చేయించాడనేది అందరికీ తెలుసు… అందులో దాచుకోవడానికి కూడా ఏమీ లేదు… తనకు పూజలు, హోమాలు, యాగాలు గట్రా చాలా కామన్… కాకపోతే ఈసారి కాస్త భిన్నంగా వామాచార పూజల వైపు వెళ్తున్నాడు… వాటి పద్ధతే భిన్నం… మనకు అలవాటైన పూజాపద్ధతులు కావు అవి… ప్రత్యేకించి భగాలాముఖి వంటి పూజలు కొంత అరాచకం టైపు… కాకపోతే పవర్‌ఫుల్ అనే భావన భక్తుల్లో ఉంటుంది… ఆ పూజలు చేయించడం కూడా 99 శాతం మంది సాధారణ అర్చకులకు తెలియదు… ఈ భగాలాముఖిలో ఆడవాళ్లు పూజాద్రవ్యాలు లేదా అవశేషాలను తీసుకుపోయి నదీప్రవాహాల్లో కలపడం కూడా ఒకటి… కేసీయార్ సతీసమేతంగా కాలేశ్వరం వెళ్లింది అందుకే… ఇప్పుడు ఆయన సతీమణి తన బిడ్డ, ఇతర బంధుగణంతో కలిసి గంగకు వెళ్లింది కూడా ఆ అవసరం కోసమే అంటున్నారు… అందులో తప్పేమీ లేదు… పూజాపద్ధతుల్ని పాటించడంలో సిన్సియారిటీ అభినందనీయమే… కానీ ఏ సంకల్పం కోసం, ఏ ఫలితం కోసం కాశి దాకా వెళ్లారో దానికే స్టికాన్ అయి ఉండటం బెటర్… తీరా ఆ పని మీద వెళ్లి, మేం ప్రజల సుఖసంతోషాల కోసం ప్రార్థించాం వంటి స్టీరియో ఫోనిక్ ప్రకటనలు, మాటలు దేనికి..? నిజానికి భగాలాముఖి శత్రువుపై విజయం కోసం చేసే పూజ… అది శక్తిపూజ… సో, కాశికి వెళ్లినా ఇటువంటి పడికట్టు పదాలేనా..?!

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • రంగమార్తాండ సినిమాలో కృష్ణవంశీ ఎక్కడెక్కడ రాంగ్‌స్టెప్స్ వేశాడంటే..?!
  • ధమాకా, ఖిలాడీ మూవీల కంబైన్డ్ కిచిడీ… విష్వక్సేనుడి దాస్‌కాధమ్కీ…
  • Rangamarthanda… ప్రకాష్‌రాజ్ ‘అతి’… బ్రహ్మానందం పర్‌ఫెక్ట్… రమ్యకృష్ణ వోకే…
  • రంగు సోడాల కడుపులు కొట్టి… ఆర్గానిక్ షర్బతుల పనిపట్టి… కూల్‌డ్రింక్స్ రసాయనదాడి…
  • ఢిల్లీ టు మద్రాస్… గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌లో రెండు రోజుల ప్రయాణం…
  • FingerTip… సోషల్ మీడియా కోట శ్రీనివాసరావును చంపేశాక ఇది గుర్తొచ్చింది…
  • ఈసారి ఉగాది టీవీ షోస్… పులుపు లేని చింత, తీపి లేని బెల్లం, చేదెక్కువ వేప్పువ్వు…
  • 186 అమెరికన్ బ్యాంకులు దివాలా దిశలో… అగ్రరాజ్యంలో ఆర్థిక సంక్షోభం…
  • థూమీబచె… ఎంతకు తెగించార్రా… ఇది ఉగాది స్పెషల్ షో అట..!!
  • కన్నతల్లికి మళ్లీ కల్యాణం… పెళ్లీడుకొచ్చిన కొడుకులే ఈ పెళ్లికి పెద్దలు…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions