సకల అరిష్టాలకూ మోడీ పాలనే కారణం, ఇక ఊరుకునేది లేదు, వెంటపడతా, మీ కథ చెబుతా,
ఇన్నిరోజులు ఏదో క్షమించేసినం, మీ మెడలు విరుస్తా,
కుక్కలు మొరిగినట్టు మాట్లాడితే సహించను, నలిసి పారేస్తా, బీకేర్‌ఫుల్…,
బండీ, కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచినవ్- నీకు ఇంగ్లిషో, హిందో వస్తదా, నీకేమైనా అర్థమైతదా, ఈ రాష్ట్రానికి నయాపైసా లాభం చేసినవా..?
2018లో 107 సీట్లలో డిపాజిట్లు కోల్పోయిన పార్టీ కూడా మాట్లాడితే ఎట్లా..?
దమ్ముందా, కమాన్, అరెస్టు చెయ్, ఇష్టమొచ్చినట్టు కూస్తే నాలుకలు కోస్తా, ఇక స్పేర్ చేసేది లేదు, కేసీయార్‌ను ముట్టుకుని చూడు, బతికి బట్టకడతవా..?
అటు చైనా వాడు దంచుతున్నాడు అరుణాచల్‌లో, ఊళ్లకు ఊళ్లు కడుతున్నడు, ఏం పీకిన్రు..?
రేపట్నుంచి దేశంలో అగ్గిపెడతా, పార్లమెంటు దద్దరిల్లిపోవాలె, సీఎం సహా మొత్తం ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీ ఛైర్మన్లు కలిసి ఢిల్లీల ధర్నా చేస్తాం
ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి, అడ్డం పొడవు మాట్లాడితే, పిచ్చి కూతలు కూస్తే చీల్చిచెండాడుతం,
తెలంగాణ రైతులు బాగుంటే కళ్లు మండుతున్నయా..?
ఓపికగా ఉన్నా ఇన్నిరోజులు, కేంద్రంతో కయ్యం ఎందుకు అనుకుని ఊరుకున్నా, ఇక ఊరుకోను…
పెట్రో ఉత్పత్తుల మీద పైసా వ్యాట్ పెంచలేదు, నేనెందుకు తగ్గించాలె, పెంచినోడు తగ్గించాలె
మొత్తం కేంద్రం విధిస్తున్న సర్ చార్జి, సెస్ రిమూవ్ చేయాలె
ఆయిల్ ధరలు 30 డాలర్లకు పడిపోయినప్పుడు కూడా అబద్ధాలు చెప్పిన్రు
సుంకం పెంచితే రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి వస్తదని ఆలోచించి, సెస్ పేరిట భయంకరంగా ధరలు పెంచేసిన్రు
రాష్ట్రాల నోళ్లు కొట్టి జనం మీద భారం వేయడం తప్పు కాదా..? అందుకే మొన్నటి ఉపఎన్నికల్లో కొట్టుడు కొట్టిన్రు… ఇప్పుడు 4 రాష్ట్రాల ఎన్నికల కోసం పిసరంత తగ్గించిన్రు…
కేంద్రంతో పోరడతా, ఇక ఆగదు, నిలదీస్తం, అందరినీ కలుపుకుని పోతా,
తెలంగాణ తెచ్చింది నేను, అట్ల వదిలేస్తనా ఏంది..?
మతోద్వేగాలు రెచ్చగొడుతూ, బోర్డర్లు చూపిస్తూ రాజకీయం చేస్తరా..?
ఉపఎన్నికలు వస్తుంటయ్ పోతుంటయ్, పట్టించుకోను
దళితబంధు పూర్తి స్థాయిలో అమలు చేస్తా
నువ్వు చెబుతున్న 60 లక్షల ఎకరాల్లో వరి వేస్తున్నట్టు లేదు అంటూ కేంద్ర మంత్రి కించపరుస్తూ మాట్లాడుతున్నడు, రా, శాటిలైట్ చిత్రాలు చూస్తవా, స్వయంగా చూస్తవా..?
కరెంటు తెచ్చిన, భూగర్భజలాలు పెంచిన, ప్రాజెక్టులన్నీ పూర్తి చేసిన, వరిని కేంద్రం కొనుగోలు చేయదు కాబట్టి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెబుతున్నం… —- :: కేసీయార్ ప్రెస్‌మీట్
Share this Article