.
అవును, టీఆర్ఎస్ అనే పార్టీ మళ్లీ పుట్టింది… తండ్రి కేసీయార్ విసిరిపారేసిన ‘తెలంగాణ’ బిడ్డను… ఆయన వదిలేసిన బిడ్డ స్వయంగా అక్కున చేర్చుకుంది… తన కొత్త పార్టీ పేరు టీఆర్ఎస్ అని ప్రకటించింది అధికారికంగా… పార్టీ ఆవిర్భావం సందర్భంగా… అంటే తెలంగాణ రాష్ట్ర సేన… సింపుల్, గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి అని ఉండేది… ఇప్పుడు సమితి బదులు సేన… ఏళ్లపాటు తెలంగాణ ఉద్యమాన్ని మోసిన పేరు అది… ఈ బిడ్డ వశమైపోయింది… TRSa…
ఇది ఒకరకంగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యులకు… ప్రత్యేకించి అన్నకు, తండ్రికి, హరీష్ రావు అండ్ కో అందరికీ కవిత ఫస్ట్ మెయిన్ స్ట్రోక్… ఎందుకంటే, ఈరోజుకూ పల్లెల్లో టీఆర్ఎస్ అనే పేరే తెలుసు జనానికి… ఆ పేరు విశిష్టత కవితకు తెలుసు, అందుకే వదల్లేదు… బయటకు తెలిస్తే బీఆర్ఎస్ అడ్డంకులు క్రియేట్ చేస్తుందని తెలుసు కదా, అందుకని భలే గోప్యత మెయింటైన్ చేసింది… జాగృతి పార్టీ అని, టీపీఎస్ అనీ ఏవేవో పేర్లను ప్రచారంలో పెట్టడం బీఆర్ఎస్ ను మాయ చేయటమే… బీఆర్ఎస్ ఏమాత్రం ఊహించని స్ట్రోక్… ఎందుకంటే ఈమధ్యే కేటీఆర్ పాత పేరు పునరుద్ధరణ గురించి ఆలోచిస్తాం అని..!!
Ads
ఈ పేరు వినగానే బీఆర్ఎస్ కుళ్లు కౌంటర్లు స్టార్ట్ చేసింది… ఒరిజినల్ ఒరిజినలే అంటూ… తెలంగాణ రేవంత్ సేన అంటూ… నిజానికి మీ బ్రాండ్ ను మీరే కాలదన్నుకున్నారు… ఇక ఒరిజినల్ ఎక్కడుంది? ఇది మళ్లీ పుట్టిన టీఆర్ఎస్… దీని గురించి అపహాస్యం చేస్తే, ఉడుక్కుంటే అది మూర్ఖత్వమే అవుతుంది… స్వీయ అపహాస్యం…

గతంలో కవిత తండ్రిని టార్గెట్ చేసేది కాదు… ఇప్పుడు స్ట్రెయిట్ గా కొడుతోంది… తప్పుల కుటుంబ సభ్యురాలిగా సిగ్గు పడుతున్నాను అనే ఒప్పుకోలు ప్రకటన కేసీఆర్ పట్ల తీవ్ర అభిశంసన… అంతేకాదు, తను ఆత్మలేని మరబొమ్మ, పందికొక్కులు- తోడేళ్ల చెరలో ఉన్నాడు, అందుకే బయటికి రాడు… వంటి వ్యాఖ్యలు చెళ్లుచెళ్లున తగిలేవే…

తన పార్టీ ఎజెండా ఏదో పాంచజన్యం అని చెప్పింది… పార్టీ పొలిటికల్ లైన్ చెబితే సరిపోయేది… ఏదో చెప్పాలి కాబట్టి… కానీ బ్లూ తెలంగాణా పటంపై TRS అక్షరాలు పెట్టి తనది బహుజన ఎజెండాగా చెప్పుకోవటం తెలివైన పనే… ఇంకెంతగా తెలంగాణ రాజకీయాన్ని రక్తి కట్టిస్తుందో చూడాల్సిందే… మొత్తానికి రేవంత్ రెడ్డి హేపీ… అన్నీ మంచి శకునములే… ఆ వోట్లు చీలే సూచనలే…

ఈ పార్టీ పేరు చెల్లదు అని అప్పుడే బీఆర్ఎస్ ప్రచారం స్టార్ట్… అక్క అన్నీ చూసుకున్నాకే ప్రకటించింది… ఆమె కేసీఆర్ బిడ్డ… అన్నట్టు ఇప్పుడు ఆమె అక్క కాదట… అమ్మను అంటోంది… జయలలితలాగా… ఆ చీరకట్టు, ఆ లుక్కు కూడా అదే…

Telangana Rashtra Sena Association…
Share this Article