Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తను బాగా వేధించిన ఆ ఇంజినీరే… కేసీయార్‌ను ఇరకాటంలో పడేశాడు…

June 19, 2024 by M S R

విద్యుత్తు ప్లాంట్లు, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, విద్యుత్తు కొనుగోళ్లు, విద్యుత్తు కారిడార్ తదితర చాలా అంశాలపై కేసీయార్ ప్రభుత్వ నిర్ణయాలు, తద్వారా తెలంగాణపై పడిన అధిక భారం, నష్టాలపై జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ విచారణ చేపట్టింది తెలుసు కదా… కేసీయార్‌కు ఓ నోటీసు ఇస్తే ఆయన అసాధారణ రీతిలో ఎదురుదాడికి దిగిన సంగతీ తెలుసు కదా…

విచారణ కమిషన్లకు సంబంధించి ఇదొక అనూహ్య పరిణామం… అసలు నీ విచారణ పరిధికే చట్టపరంగా చెల్లుబాటు లేదు, నువ్వే దిగిపో అని రిప్లయ్ లేఖలో సవాల్ చేయడం నిజంగా ఓ సాహసమే… కేసీయార్ చట్టపరమైన ప్లస్సులు, మైనస్సులు తెలుసుకోకుండా ఈ లేఖ రాసి ఉంటాడని ఎవరూ అనుకోరు… కాకపోతే తన నిర్ణయాలకు సమర్థించుకోవడం వేరు, ఏకంగా విచారణ జరిపే కమిషన్ నుంచే జస్టిస్ నర్సింహారెడ్డిని తప్పుకోవాలని డిమాండ్ చేయడం వేరు… పరోక్షంగా రాజకీయ ఉద్దేశాలు ఆపాదించడం వేరు…

ఏమన్నాడు..? ఛత్తీస్‌గఢ్ విద్యుత్తు కొనుగోలు ఒప్పందాన్ని రెగ్యులేటరీ కమిషన్ వోకే చేసింది… ఇక అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో గానీ, సుప్రీంలో గానీ సవాల్ చేయాల్సిందే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్‌కు చట్టబద్థత లేదనేది కేసీయార్ వాదన సారాంశం… కానీ విద్యుత్తు ఇంజినీర్ రఘు అసలు ఆ విద్యుత్తు కొనుగోలు ఒప్పందమే ఫైనల్ కాలేదనీ, రెగ్యులేటరీ కమిషన్ సూచించిన సవరణల్ని కేసీయార్ ప్రభుత్వం పట్టించుకోలేదనే చేదునిజాన్ని బయటపెట్టడంతో కేసీయార్ వాదన వీగిపోయి, తను ఇప్పుడు డిఫెన్సులో పడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి…

Ads

power

ఇదే రఘును కేసీయార్ ప్రభుత్వం అష్టకష్టాలు పెట్టింది… కోదండరాంనూ వేధించింది… ఇప్పుడు ఆ ఇద్దరూ కలిసి విచారణ కమిషన్ ఎదుట పకడ్బందీగా లీగల్, టెక్నికల్ వాదనలు ప్రజెంట్ చేశారు.,. ఇప్పుడిక కేసీయార్ వాదన వీగిపోవడంతో విచారణ కమిషన్ తదుపరి చర్య ఎలా ఉండబోతోంది..? ఏం చేయగలదు..? అనే అంశాలు చర్చనీయాంశమయ్యాయి… ఆసక్తికరంగా మారాయి కూడా… (ఇదే రఘు కాలేశ్వరం ప్రాజెక్టు లోపాలు, నష్టాలు, ప్రమాదాల గురించి మొదటి నుంచీ కొట్లాడుతున్నాడు, అందుకే కేసీయార్ కంట్లో నలుసయ్యాడు…)

power

మళ్లీ నోటీసు ఇస్తుందా..? ప్రత్యక్షంగా హాజరు కావాలని పిలుస్తుందా..? ఒకవేళ దానికీ కేసీయార్ నో అంటే… కమిషన్ వెలువరించబోయే తీర్పు ఏమిటి..? ఏ సీరియస్ చర్యను తీసుకోగలదు..? ఇవీ ఇంట్రస్టింగ్ ప్రశ్నలే… వేచిచూడాల్సిందే తప్ప కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంటుంది అని ఊహాగానాలు చేయలేం… నిజంగానే రఘు కేసీయార్‌ను తీవ్ర ఇరకాటంలో పడేసినట్టే…

power

సరళమైన భాషలో చెప్పుకోవాలంటే… 1) ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కుదిరిన కొనుగోలు ఒప్పందానికి తుది అనుమతుల్లేవు… 2) ఆ కరెంటు కూడా సరిగ్గా రాలేదు, ఆ లోటు భర్తీ కోసం బయట కొనుగోళ్లు చేశారు, అదీ నష్టం… 3) ఆ కరెంటు తెచ్చుకోవడానికి కారిడార్ బుక్ చేసుకున్నాం, రద్దు చేసుకున్నాం, పరిహారం చెల్లించాల్సి ఉంది… అదీ నష్టమే… 4) కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పవర్ ప్లాంటు నిర్మిస్తున్నాం… దానివల్ల కూడా నష్టమే… 5) భద్రాద్రి భౌగోళిక స్థలం ఎంపిక కూడా తప్పే… పోలవరం పూర్తయితే మునిగిపోతుంది… కరెంటు లైన్లు మునుగుతాయి…

power plant

6) త్వరగా పూర్తి కావల్సిన ప్లాంటు నిర్మాణంలో అసాధారణ జాప్యం జరిగింది… 7) యాదాద్రి భౌగోళిక స్థలం ఎంపిక కూడా తప్పే… పిట్ హెడ్ ప్లాంటు నిర్మించాల్సింది, గనులకు 280 కిలోమీటర్ల దూరంలో కట్టాలనే నిర్ణయంతో బొగ్గు రవాణా వ్యయం తడిసి మోపెడు కానుంది… 8) అసలు బిడ్డింగ్ ప్రక్రియను ఆశ్రయించకుండా నేరుగా ఒప్పందాలు చేసుకోవడం కూడా తప్పే…

ఈ నిర్ణయాల్లో కొన్ని రెగ్యులేటరీ కమిషన్ పరిధిలోకి రావు, సో, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనుమతించిన అంశాల పరిధిలోకి జస్టిస్ నర్సింహారెడ్డి విచారణ కమిషన్ అడుగుపెట్టలేదనే కేసీయార్ వాదన సరైంది కాదు… అందుకే కేసీయార్ రాసిన లేఖ తన మెడకే చుట్టుకోబోతున్నదా అనేది అసలు ప్రశ్న…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘అనగనగా..’ ఓ సుమంతుడు… మరొక్కసారి అదే ఫెయిల్యూర్ అడుగు…
  • సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి అత్యంత కీలకమైన రాజ్యాంగ ప్రశ్నలు..!
  • అది సరే గానీ… మరి రేవంత్ రెడ్డి ఏమైపోతాడో చెప్పలేదేమిటి..?
  • ఫాఫం, తెలంగాణ వాళ్లు ఎవరూ దొరకడం లేదా సారూ..!!
  • దిక్కుమాలిన, తలకుమాసిన మర్యాద… వీటినే బానిస ధోరణులు అంటారు…
  • ఏ కులమైతేనేం… బలుపు చూపే కులంపై తిరగబడేవాడే,.. కర్ణన్…
  • సినిమా టైటిల్‌లో మొనగాడు ఉంటే చాలు… మనోళ్లకు ఖుషీ…
  • అంతే… ఆ స్పీచ్ తరువాత కాంగీ, సీపీఎం మొహాలు మాడిపోయాయ్…
  • యుద్ధంకన్నా క్లిష్టం… సింధు జలాల వాటాలు… దిక్కుతోచని పాకిస్థాన్…
  • వావ్ మద్రాస్..! అప్పట్లోనే ఆంధ్రాలీడర్లు ఇంకాస్త గట్టిగా పట్టుపట్టి ఉంటే..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions