మొన్నామధ్య కేసీయార్ ఏమన్నాడు..? ‘‘దేశంలో టన్ను బొగ్గు 4 వేలకే దొరుకుతుంది… కానీ 25 నుంచి 30 వేల ధరతో బొగ్గు దిగుమతి చేసుకోవాలని మోడీ చెబుతున్నాడు… ఎందుకంటే మోడీకి ఓ షావుకారు దోస్త్ ఉన్నాడు… అతడే ఈ బొగ్గును దిగుమతి చేస్తుంటాడు… సో, మోడీ ప్రధానిగా కాదు, తన దోస్త్‌కు సేల్స్‌మ్యాన్‌గా పనిచేస్తున్నాడు… అందుకే మోడీని దోషి అంటున్నాం…’’
ఎస్, అయితే అంబానీ, లేదంటే ఆదానీ… కాదంటే మేఘా కృష్ణారెడ్డి… ఎవరు తక్కువ..? ఆదానీ అంటే మోడీ, మోడీ అంటే ఆదానీ… అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం… ఆదానీ కోసం మోడీ ఏం చేయమన్నా చేస్తాడు… అందుకే తన ఆర్థిక సామ్రాజ్యం విస్తరిస్తూ సేటు ప్రపంచంలోకెల్లా నాలుగో అత్యంత ధనికుడు అయిపోయాడు… అంబానీ సేటు పదో ప్లేసుకు పడిపోయాడు… త్వరలో ఆదానీ నంబర్ వన్ అవుతాడు… అది పక్కా…
మరి ఆదానీని పరోక్షంగా ప్రస్తావిస్తూ అన్నేసి మాటలన్నాడు కదా కేసీయార్… ఇప్పుడు ఆదానీని అదే బొగ్గు విషయంలో తను నిలువరించగలడా..? మోడీ ప్లస్ ఆదానీ కలిసి కేసీయార్‌ను ఓ చిక్కులో పడేశారు… విషయం ఏమిటంటే… ఒడిశాలో కొన్ని బొగ్గు బ్లాకుల్ని వేలం వేస్తే సింగరేణి కూడా పార్టిసిపేట్ చేసింది… నైని కోల్‌బ్లాక్ దక్కింది… ఇదంతా 2015లో… అన్నిరకాల అనుమతులతో అంతిమంగా మైనింగ్ లీజు మంజూరయ్యేసరికి 2020 సంవత్సరం వచ్చేసింది…
Ads
తను చేసే ప్రధాన పనే బొగ్గు తవ్వకం కదా… తన అనుభవం, తన నైపుణ్యం బొగ్గే కదా… (పవర్ జనరేషన్‌లోకి కూడా అడుగుపెట్టింది…) అయినా సరే ఏటా కోటి టన్నుల బొగ్గు తవ్వడానికి సింగరేణి టెండర్లు పిలిచింది… అయిదు కంపెనీలు టెండర్లు వేస్తే మూడు క్వాలిఫై అయ్యాయి… అందులో తక్కువగా కోట్ చేసింది ఆదానీ… ఈ టెండర్లలో గోల్‌మాల్ అని రాష్ట్ర కాంగ్రెస్ ఆరోపించినట్టుంది కూడా…
ఇప్పుడు ఏరకంగా చూసినా… మోడీ సహకారంతో బొగ్గు దందా సాగిస్తున్నాడనే ఆదానీకి కేసీయార్ స్వయంగా ఆ బ్లాక్ కట్టబెట్టక తప్పదా..? ఆదానీ బొగ్గు దందాకు తను కూడా సాయపడక తప్పదా..? ఇదీ ప్రశ్న… పోనీ, ఏదో టెక్నికల్ కారణం చూపించి, ఆదానీకి ఆ టెండర్‌ను కట్టబెట్టకుండా రిజెక్ట్ చేశాడనే అనుకుందాం… ఆదానీ ఊరుకోడు కదా… మోడీ ఊరుకోనివ్వడు కదా…
…. (file photo of 2014)….
అదే జరిగితే ఆదానీ కోర్టుకెక్కుతాడు… తనకు కేసీయార్ చేసిన నష్టం ఏమిటో వెల్లడిస్తాడు… మీడియాకు ఎక్కుతుంది… బీజేపీ రచ్చ చేస్తుంది… తను ఎవరినైతే ‘‘మోడీ షావుకారు దోస్త్’’ అని నిందిస్తున్నాడో అదే ఆదానీ వల్ల తను బదనాం అవుతాడు… ప్రొసీజర్ ప్రకారం ఆదానీకి అప్పగిస్తేనేమో తను కూడా బొగ్గు దోషులకు సాయం చేస్తున్నాడనే నింద తప్పదు… మరిప్పుడేం చేయుట…!! మోడీ, ఆదానీ తదుపరి పావు కదల్చడం కోసం వేచి ఉన్నారు…!! (ఏపీలో జగన్ అయితే ఆదానీతో తన గాఢమైన దోస్తీని దాచుకునే ప్రయత్నం కూడా చేయడు…)
Share this Article