నువ్వు గోకూ గోకకపో, నే గోకుతనే ఉంటా… అని కేసీయారే స్వయంగా చెప్పిండు కదా… ఊకుంటడా… కాబోయే ప్రధాని మాటతప్పితే ఏం మర్యాద ఉంటది… పైగా తన బిడ్డ మీదనే కేసు పెట్టి, ఊకూకే ఢిల్లీకి పిలిపిస్తుంటే, అసలే గోకుడు సరదా ఉన్న కేసీయార్‌కు మండదా..? ఏం మోడీకి సీబీఐ, ఈడీ, ఐటీ ఉంటే కేసీయార్‌కు పోలీసుల్లేరా..? సిట్లు లేవా..? సీఐడీ లేదా..?
అసలు బీజేపీ పెద్దలనే బజారుకు లాగాలని ఉబలాటపడ్డోడు, ఎమ్మెల్యేల కొనుగోళ్లు అంటూ గాయిగత్తర చేసి, బీజేపీ ప్రధాన కార్యదర్శి సంతోష్ పేరు కేసులో రాసేసిన కేసీయార్‌కు గీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో బండి సంజయ్‌ను లోపలేసుడు పెద్ద లెక్కనా ఏంది..? బాగా ఎగుర్తుంటడు కదా, అందుకనే బీజేపీలో ఎవరి జోలికీ పోడు కేసీయార్… అటు రాజాసింగ్, ఇటు బండి సంజయ్… మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే లోపలకు నెట్టిన, నేనిట్లాగే గోకుతా, మీకు చేతనైంది చేసుకొండి ఫొండి అంటున్నాడు కేసీయార్…
Ads
అబ్బే, ఈ కేసులో పెద్ద పంచ్ లేదు సార్, ఎవరో బండి సంజయ్‌కు ప్రశ్నపత్రం వాట్సపులో షేర్ చేస్తే ఇక బండికి లింకున్నట్టేనా..? అని అంటారా..? అదంతా కోర్టులో చెప్పుకొండి, మేం ఊర్లన్నీ తెగ తిప్పి, లాయర్లకూ జవాబులు చెప్పకుండా, హన్మకొండలో కోర్టులో ప్రవేశపెట్టామా లేదా..? బెయిల్ తెచ్చుకో, కావాలంటే కోర్టులో చెప్పుకో… మా సారు గోకుతా అన్నాడంటే ఇలాగే ఉంటది మల్ల…
మోడీకి, అమిత్ షాకు ఏమీ చేతనైత లేదు, చాలాసార్లు కేసీయార్ విసిరే అస్త్రాలకు తెల్లమొహాలు వేస్తున్నరు అంటారా..? వాళ్లంతే… ఎవరెంత గోకినా ఏమీ చేతకాదు… అసలు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు పెట్టినా కవితను అరెస్టు చేసేందుకు ఈరోజుకూ దడ, వణుకు… అసలు మమతనేం చేయగలిగారు..? రాబర్ట్ వాద్రాను ఏం చేయగలిగారు..? అఖిలేష్‌ను ఏం చేయగలిగారు..? ఇక ఒకటికి నాలుగు ఉల్టా అంటించే కేసీయార్‌ను ఏం చేయగలరు..?
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసును కూడా బీజేపీ మెడలో వేసిన్రు, కేటీయార్ స్టార్ట్ చేయంగనే ఇక మంత్రులందరూ అదే చెప్పడం మొదలు పెట్టిన్రు… ఇప్పుడు టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీని కూడా సంజయ్ మెడలో వేసేశారు… బీజేపీ వాళ్లు డిఫెన్సులో పడిపోతే, బీఆర్ఎస్ వాళ్లంతా బండి దొంగ, బండి దొంగ అని హైపిచ్ పాటలు మొదలుపెట్టిన్రు… రేప్పొద్దున తెలంగాణలో ఏం జరిగినా సరే, బండి సంజయ్ మాత్రమే ప్రథమ నిందితుడు అవుతాడు… అది పక్కా… కేసీయార్ గోకుడు తీవ్రత ఏంటో బీజేపీ హైకమాండ్‌కు తెలిసిరావాలి మల్ల…!!
Share this Article