ఏడు నెలల క్రితం వీడియో ఇది… వరంగల్ అర్బన్ ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కాంప్లెక్స్ ప్రారంభం సందర్భంగా మాట్లాడుతూ కేసీయార్ తనకు కరోనా వచ్చినప్పుడు ఏం జరిగిందో చాలా విషయాల్ని షేర్ చేసుకున్నాడు… తను ఏం గోళీలు వాడానో కూడా చెప్పాడు… నిజానికి అవి అప్పటికన్నా ఇప్పటికీ బాగా యాప్ట్ అనిపిస్తున్నయ్… నిజం… కేసీయార్ అప్పట్లో చెప్పిన ఆ ప్రతి మాటా ఇప్పుడు బహుళ ప్రచారంలోకి రావాలి… ప్రత్యేకించి మీడియా మీద కేసీయార్ కరోనాకు సంబంధించిన విసిరిన విసుర్లు ఇప్పుడే అవసరం అనిపిస్తోంది… ఓసారి ప్రెస్‌మీట్ పెట్టేసి, ఇవే విషయాల్ని మరోసారి దంచి కొడితే బెటర్ అని కూడా అనిపిస్తోంది… ఎందుకంటే..?
కేసీయార్ తన ప్రసంగంలో మీడియా జ్ఞానుల అతి ప్రచారం వల్ల జరుగుతున్న నష్టాల గురించే కాదు… తప్పుడు వైద్యం వల్ల దుష్ఫలితాల గురించీ చెప్పాడు… ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే… నిజానికి కేసీయార్ ఈ ప్రసంగం చేసినప్పుడు డెల్టా సీజన్ నడుస్తోంది… అప్పుడు సంక్రమించిన కరోనా ప్రాణాంతకంగానే ఉండేది… వేల కుటుంబాలు చికిత్స వ్యయంతో కూడా చితికిపోయాయి… బెడ్ల కొరత, ఆక్సిజెన్ కొరత, మందుల కొరత దేశవ్యాప్తంగా కలవరాన్ని కలిగిస్తున్న పరిస్థితులు… అప్పుడు కూడా మీడియా భయానక పాత్రే పోషించింది… కానీ ఇప్పుడు..?
Ads
ఇది ఒమిక్రాన్ సీజన్… కరోనా వైరస్ సాత్వికరూపం ఇది… డెల్టా కాలం నాటి కలవరం ఇప్పుడు లేదు… వేక్సినేషన్ చాలావరకు జరిగింది… పైగా ఒకసారి ఒమిక్రాన్ వచ్చిపోతేనే ప్రజలకు నేచురల్ వేక్సినేషన్ జరిగినట్టుగా ఉంటుందనీ చాలామంది డాక్టర్లు చెబుతున్నారు… చాలా దేశాల్లో కరోనా సంబంధ అంక్షల్ని తీసేశారు… కేసుల సంఖ్య పెరుగుతుంది, సహజం… వ్యాప్తిలో వేగం… కానీ వ్యాధిలో తీవ్రత ఉండదు… కరోనా ఇప్పుడు గొంతు దిగడం లేదు… 90 శాతం ఆ ఒమిక్రాన్ కేసులే… అసలు చాలామందికి కరోనా సోకుతోంది, లక్షణాలు ఉండటం లేదు, సోకిన సోయి రోగికీ ఉండదు… ఒకవేళ తెలిసినా సరే, ప్రభుత్వం ఇచ్చిన హోం ఐసోలేషన్ కిట్ సరిపోతుంది…
అంతెందుకు, ప్రజలే మామూలు వైరల్ ఫీవర్‌కు తెచ్చుకున్నట్టే, మందుల షాపుకి వెళ్లి నాలుగు యాంటీ బయాటిక్స్, ఆరు డోలో గోళీలు తెచ్చేసుకుని, రెండుమూడు రోజుల్లో కరోనాను దులిపేస్తున్నారు… కొందరైతే మందులు కూడా వాడటం లేదు… ఎటొచ్చీ కాస్త మంచి ఫుడ్ తీసుకోవాలని మాత్రం డాక్టర్ల ప్రధాన సలహా… ఐనా సరే, మీడియా ఇంకాా పవర్‌ఫుల్ భూతద్దాల్లో చూపిస్తోంది కరోనాను… నిజానికి కరోనాకన్నా కరోనా అంటే కలిగే భయమే ఎక్కువ ప్రమాదకరం…
కేసీయార్ ఈ భయానికి సంబంధించిన ఒకటీరెండు విషయాలు చెబుతూ… భయం ఎలా ప్రాణాంతకమో ఓ పిట్టకథ చెప్పాడు… ఎస్, ఇప్పుడు ఇదే ప్రచారంలోకి రావాలి… మీడియా అజ్ఞానంతో, స్వార్థంతో సృష్టించే భయానక వాతావరణాన్ని బ్రేక్ చేయాలి… మళ్లీ థర్డ్ వేవ్, కమ్యూనిటీ వ్యాప్తి వంటి భయాల్ని వ్యాప్తిలోకి తీసుకొస్తున్న నేపథ్యంలో ఆ భయాన్ని జనావరణం నుంచి పారద్రోలాలంటే కేసీయార్‌లాగా ఓ హోదాలో ఉన్నవాళ్ల మాటలే ఉపయోగపడతయ్… కరోనాను గెలిచేది ధైర్యంతోనే… కరోనాను గెలవాల్సింది కూడా చైతన్య, భరోసా ప్రచారాలతోనే…!!
Share this Article