రాజకీయాల్లో ఇది జరగదు, జరగడం కష్టం అంటూ ఏమీ ఉండవు… లుప్తమైన రాజకీయ విలువల వాతావరణంలో ఏదైనా సాధ్యమే… ప్రజాప్రతినిధుల కొనుగోళ్లలో, ప్రలోభపెట్టడంలో, లాగేయడంలో అటు కేంద్రంలో బీజేపీ, ఇటు రాష్ట్రంలో కేసీయార్ కొత్త కొత్త బెంచ్ మార్క్స్ క్రియేట్ చేసి పెట్టారు… అన్ని రాష్ట్రాల్లోనూ అధికారం కోసం ఆడే నంబర్లాటలో అసలు పార్టీలు మారడం అనేదే పెద్ద విశేషం కాకుండా పోయింది…
ఓ వార్త కనిపించింది… రేవంత్ రెడ్డి సర్కారు తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి, బీఆర్ఎస్‌ను మరింత లోతుకు తొక్కేయడానికి వీలుగా… ఏకంగా బీఆర్ఎస్ఎల్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకునే టార్గెట్ ఫిక్స్ చేసుకుందని..! రేవంత్‌రెడ్డికి పలురకాలుగా ఇది అవసరం… ముఖ్యమైనవి 1) బీఆర్ఎస్‌ను ఇప్పట్లో కోలుకోకుండా తొక్కడం. 2) సీనియర్ల నుంచి తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం. 3) మెజారిటీ తక్కువ ఉంది కాబట్టి బీఆర్ఎస్ తన అపార ధనరాశులతో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులనే కొనకుండా అడ్డుపడటం. 4) అన్నింటికన్నా ముఖ్యం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ లాగేసుకోకుండా చూడటం… బీజేపీ బలపడొద్దు కాబట్టి…
Ads
ఇంతకుముందు కేసీయార్ నేర్పించిన పాఠమే కాబట్టి… ఇదంతా రాజకీయ శక్తుల పునరేకీకరణ అని ఆయన భాషలో ఆయనకే అప్పగిస్తే సరి… ఐతే మూడింట రెండొంతుల మందిని లాగితే తప్ప విలీనం జరగదు, ఫిరాయిపుల చట్టం నుంచి తప్పించుకోవడం కుదరదు… అందుకని 26 మందిని లాగాలి… ఇటు బీజేపీ నుంచి, అటు కాంగ్రెస్ నుంచి జరగబోయే దాడుల నుంచి పార్టీని రక్షించుకోగలం అనే ధీమాను కేటీయార్ ఇవ్వగలిగితే తప్ప ఎమ్మెల్యేల్ని జారిపోకుండా కాపాడుకోలేరు… ఆల్‌రెడీ 15 మంది వరకూ రేవంత్‌కు టచ్‌లోకి వచ్చారని ఓ టాక్… కావచ్చు, ఈరోజుల్లో నైతికత, నిబద్ధత, మన్నూమశానం ఏమున్నయ్..? సో, కాంగ్రెస్ ప్రయత్నాల్ని, బీఆర్ఎస్ ఆత్మరక్షణను వేచిచూడాల్సిందే… ఐతే…
నేను ఒంటరిగా ఉంటాను, మళ్లీ జనం ఆదరిస్తారు అనే బీఆర్ఎస్ ధీమా ఒక డొల్ల… ఏదో స్ట్రాటజీతో బీజేపీ కాస్త మౌనంగా ఉంటోంది… ఎన్నికల ముందు కూడా బీఆర్ఎస్‌తో లోపాయికారీ దోస్తానా ఉంది… కాకపోతే ఆ నాటకం ఎదురుతన్నింది… ఒకవేళ కేసీయార్, తన కుటుంబం గనుక ఓ నిర్ణయం తీసుకుంటే… బీజేపీ కూడా అధికారిక స్నేహానికి సై అంటే… వచ్చే లోకసభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీచేయవచ్చు లేదా లోపాయికారీ అవగాహనతో సహకరించుకోవచ్చు…
ఓ నమ్మదగిన సమాచారం ఏమిటంటే..? మైనారిటీ వోట్లు పోతాయనే సందేహంతో కేసీయార్ బీజేపీతో అధికారిక మైత్రికి ఒప్పుకోవడం లేదు… కానీ కేటీయార్, హరీష్ నుంచి ఒత్తిడి ఉంది… (ఆమధ్య రాధాకృష్ణ కూడా రాసినట్టు గుర్తు…) వాళ్లను కాదని కేసీయార్ అడుగు కూడా వేయలేడు… రాజకీయాలు క్రూరమైనవి… ఆ ఒత్తిడి పెరిగి, నమస్తే తెలంగాణ ప్లస్ తమకు వర్క్ చేస్తున్న సోషల్ మీడియా టీమ్స్ ద్వారా కేసీయార్ పలురకాల ఫ్లాస్ సర్వేలు చేయిస్తున్నాడు… బీజేపీతో కలిస్తే ఏమిటి…? ఒంటరి పోటీతో ఏమిటి..? బీఆర్ఎస్ మనుగడ ఎలా..? ఈ కోణాల్లో ఫ్లాష్ సర్వేలు సాగుతున్నయ్… సో, రెండుమూడు రోజుల్లో ఏదైనా విధాననిర్ణయం జరగవచ్చు… బీజేపీవైపు మొగ్గవచ్చు… కానీ మోడీ వోకే అంటాడా..?
ఎందుకు వోకే అనడు… అంతటి బీహారీ బేకార్ కేరక్టర్ నితిశ్‌నే అలుముకుంటున్నాడు… నానా బూతులూ తిట్టిన చంద్రబాబునే క్షమించడానికి రెడీ అవుతున్నాడు… కేసీయార్ ఎంత..? గాయిగత్తర పిచ్చి మాటలు అనివార్యంగా అనాల్సి వచ్చింది, ఏమీ అనుకోకు అంటాడు… మోడీ సరేనని కేసీయార్‌నూ అలుముకుంటాడు… జరగొద్దని ఏముంది..? ఆఫ్టరాల్, ఆల్ ఇన్ పాలిటిక్స్… ఎస్, ఎవరీ థింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ పాలిటిక్స్…!! సో, కేసీయార్ తుంటి మొత్తం అతుక్కున్నాక ఫస్ట్ కర్తవ్యం ఏమిటంటే..? శూర్పణఖ జన్మభూమి సందర్శన…!!
Share this Article