బ్యూరోక్రాట్ల పాలనలో చిక్కిన తెలంగాణ..! చాలా పెద్ద మాట నిజానికి… కానీ జరుగుతున్నది అదే… నిర్ణయాలు తీసుకునేది కేసీయార్ లేదా ఉన్నతాధికారులు… అంతే… రాజకీయంగా నష్టం వాాటిల్లితేనే కేసీయార్ ఏదో ఓ దశలో కడిగేసుకుంటాడు… అనేక విషయాల్లో ఆయన యూటర్న్‌కు అదే కారణం… ఆ దిద్దుబాటను కూడా ఆయన అధికారగణం సరిగ్గా చేయనివ్వరు… ఆ తీరూ గమనించాం… తెలంగాణ ప్రయోజనాల కోసం ఉద్యమించిన అనేక నోళ్లు కూడా కిక్కుమనవు… ఒకటి ఆశ్చర్యం అనిపించేది ఏమిటంటే… తెలంగాణ పిల్లలకు మెడికల్ అడ్మిషన్లలో అన్యాయం జరుగుతున్నది దేవుడోయ్ అనే విమర్శలు వస్తుంటే… చక్కదిద్దాల్సింది పోయి.., తన శాఖలోనే అన్యాయం జరుగుతున్నా సరే, ఆరోగ్య మంత్రి ఈటల సైలెంటుగా వ్యవహరించడం..!
నిన్న మనం మెడికల్ అడ్మిషన్లకు సంబంధించి తెలంగాణ పిల్లలకు ఎలా అన్యాయం జరుగుతున్నదో… తెలంగాణ వచ్చాక కూడా తెలంగాణ విద్యార్థులే నష్టపోతూ, తెలంగాణ పిల్లలకు దక్కాల్సిన సీట్లలో ఆంధ్రా పిల్లలు ఎలా లబ్ధిపొందాారో చెప్పుకున్నాం కదా… డెక్కన్ క్రానికల్, వెలుగు దీన్ని వెలుగులోకి తీసుకొచ్చాయి… కొన్ని బీసీ సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి… ఆ వివాదం ఏమిటో తెలియాలంటే ఇదీ లింకు…
Ads
కేసీయార్ సారూ… తెలంగాణ రాష్ట్రమొచ్చినా ఈ సీట్ల నష్టం తప్పదా..?
…. దీనికి కాళోజీ ఆరోగ్య యూనివర్శిటీ వివరణ విచిత్రంగా ఉంది… మేం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం వెళ్తున్నాం అని…! మరి ఆంధ్రా ఆరోగ్య యూనివర్శిటీ చేస్తున్నది ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌కు విరుద్ధమా..? వాళ్లు చేసేది బ్లండరా..? ఒక్కసారి… ఈ ఆరోగ్య విద్య వ్యవహారాలు చూస్తున్న ప్రతి అధికారినీ పిలిచి… ఈటల సమక్షంలోనే… కేసీయార్ సీరియస్‌గా కొన్ని ప్రశ్నలు వేయాలి వీళ్లకు…
- మెడికల్ సీట్ల భర్తీ విషయంలో సుప్రీంకోర్టు గత గైడ్ లైన్స్ ఏమంటున్నాయి..? మనమేం చేస్తున్నాం..?
- ఆంధ్రా ఆరోగ్య యూనివర్శిటీ వాళ్ల పిల్లల కోసం అనుసరిస్తున్న పద్ధతిని మనమెందుకు పాటించలేకపోతున్నాం..?
- తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నతాధికారులు ఎందుకు సొంతంగా నిర్ణయాలు తీసేసుకుంటున్నారు..?
- తెలంగాణ పిల్లలకు లబ్ధి చేకూరే పక్షంలో… మనమూ ఆంధ్రా పద్ధతినే ఎందుకు అమలు చేసుకోకూడదు..?
- తెలంగాణ వచ్చినా, మన ప్రభుత్వం ఏర్పడినా… ఈరోజుకూ అడ్మిషన్లలో తెలంగాణకు అన్యాయం జరుగుతూనే ఉండాలా..?
- ఒకవేళ రూల్ పొజిషన్ ప్రకారం చేస్తున్నారు అనేది నిజమే అయినా సరే… తెలంగాణ పిల్లలకు మేలు చేకూర్చే పద్ధతి ఒకటి కనిపిస్తున్నప్పుడు, సాటి యూనివర్శిటీ అదే పనిచేస్తున్నప్పుడు… తెలంగాణ యూనివర్శిటీ ఎందుకు భిన్నంగా వెళ్తున్నట్టు..?
- రూల్ పొజిషన్ ఒప్పుకోదు అనేదే నిజమైతే… అది ప్రభుత్వానికి చెప్పాలి కదా… దాన్ని ఎలా మార్పించుకోవాలో కేసీయార్, అంటే ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పార్టీ చూసుకుంటుంది కదా…?
Share this Article