.
ఈమధ్య కామాఖ్య, ఆది శక్తిపీఠాల గురించి ‘ముచ్చటిం’చుకున్నాం కదా… ఓ మిత్రుడు అడిగాడు… ఒడిశాలోని గంజాం, తారాతరిణి శక్తిపీఠం ఆలయ వాస్తు, నిర్వహణ పెద్ద ఆసక్తికరంగా ఉండవు కదా అని… కానీ వాటికన్నా ఎందుకో గుడి ప్రాశస్త్యమే ముఖ్యం అనిపిస్తుంది… పైగా నవీన్ పట్నాయక్ సీఎంగా ఉన్నప్పుడు, మూడేళ్ల క్రితం దాని రూపురేఖలు కూడా మార్చి కొత్త కళను తీసుకొచ్చాడు…
అప్పట్లో మన యాదగిరిగుట్ట పునర్నిర్మాణంతో పోలుస్తూ ‘ముచ్చట’ పబ్లిష్ చేసిన ఓ స్టోరీ ఇది…
Ads
సంకల్పం ఉండగానే సరిపోదు… శ్రద్ధ ఉండాలి… సరైన ఆచరణ ఉండాలి… పర్యవేక్షణ ఉండాలి… అన్నింటికీ మించి ఓ ఆత్మసంతృప్తి ఉండాలి… యాదగిరిగుట్ట పేరు మార్చారు… పేదల దేవుడిని పెద్దల దేవుడిని చేసేశారు… పార్కింగ్ ఫీజు దోపిడీ వార్తలు చదివాం కదా… వందల కోట్లు ఖర్చు పెట్టారు… మధ్యలో కేసీయార్ స్తుతిస్థంభాల కథలూ విన్నాం…
పార్టీ, ప్రభుత్వ ప్రచార యుక్తులూ చదివాం… చివరకు పూర్తి చేశాం అనిపించారు… ఒక పార్టీ కార్యక్రమంలాగా మళ్లీ తలుపులు తెరిచారు… కానీ ఇప్పటికీ అది అసంపూర్ణమే… చినుకు కురిస్తే చాలు గుడిలోకి నీళ్లు చేరే నాసిరకం నిర్మాణం… యావత్ తెలంగాణ సమాజం బిత్తరపోయింది… అంతటి ఉగ్ర నర్సింహస్వామి కూడా మోసపోయాడు…
దీనివల్ల పుణ్యమే వచ్చిందో, పాలకుడికి ఎనలేని పాపఫలితమో సమకూరిందో చెప్పుకోనక్కర్లేదు కానీ… ఒక విషయం చెప్పుకోవాలి… మే 18… (2022)… ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తారాతరిణి గుడిని పునఃప్రారంభించాడు…
కేవలం 100 కోట్లతో గుడి రూపురేఖలు మార్పించాడు… గంజాం జిల్లాలోని ఆ గుడికి వెళ్లి మనస్పూర్తిగా దండం పెట్టాడు… బాధ్యతలు తీసుకున్న ప్రతి ఒక్కరినీ ప్రశంసించాడు… అంతేకాదు… కటక్‌లోని చండీ మందిర్ పునర్నిర్మాణం కోసం 70 కోట్లు మంజూరు చేశాడు…
(గుడి పునర్నిర్మాణానికి ముందు, తరువాత)
యాదాద్రి పేరు పెట్టడంతో మొదలైంది… పెద్ద ఎత్తున ప్రచారం… అనేకసార్లు సీఎం స్వయంగా వెళ్లాడు… పర్యవేక్షించాడు… ప్రతిసారీ ఏవో తప్పులు గుర్తించాడు, మార్పులు సూచించాడు… ఏం కడుతున్నారో, ఏం కూలగొడుతున్నారో ఎవరికీ తెలియని ఓ బ్రహ్మరహస్యం… చివరకు కొత్త పేరు పెట్టి అంతులేని పాపాన్ని మూటగట్టుకున్న చినజియ్యరుడు కూడా దానికి దూరమైపోయాడు… పాపం, ఊరకే పోదు… ఇద్దరూ ఒకరికొకరు దూరమైపోయారు… ఖర్చు వందల కోట్లు…

అన్నింటికీ మించి… ఒక్కసారి గుడి దగ్గరకు వెళ్తే నిలబడటానికి చోటు ఉండదు… పైకి వాహనం తీసుకెళ్తే 500 పార్కింగ్ ఫీజు… చివరకు గుడిని ఎలా మార్చారో, ఏం చేశారో… వారానికి ఓ కథనం అన్ని పత్రికల్లోనూ కనిపించేది… ఆహా, ఓహో… అద్భుతం, పరమాద్భుతం అంటూ…
ఈ దేశంలో వేల మంది పాలకులు వేలాది గుళ్లను కట్టారు… వందల ఏళ్లయినా చెక్కుచెదరలేదు… చిన్న రాయి కూడా అటూఇటూ కదలనంత పకడ్బందీ నిర్మాణాలు… అనేక విశేషాలు… ఆధ్యాత్మిక, ఆర్కిటెక్చర్ అద్భుతాలు… కానీ చినుకుపడితే చాలు కురిసేలా గుడిని ఇలా కొత్తగా కట్టిన ఘనత ఈ గొప్ప పాలకులదే…

ఇదీ కొత్తగా ఒడిశా ప్రభుత్వం డెవలప్ చేయబోయే చండీ మందిర్ చిత్రం… ప్రభుత్వం 5టీ ప్రాజెక్టు పేరిట అయిదు గుళ్ల పునర్నిర్మాణం చేపట్టింది… అందులో ఇదీ ఒకటి…
Share this Article