Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మోడీషా మెడలే వంచాలనుకున్న కేసీయార్… సోయి తప్పిన బీజేపీ..!!

May 28, 2024 by M S R

సుస్పష్టంగా తేలిపోతోంది… తన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నించిందని ఓ పెద్ద కేసు బిల్డప్ చేయడానికి కేసీయార్ చేసిన ప్రహసనం, నాటకం చాలా క్లియర్‌గా తేటతెల్లం అవుతోంది… ఫోన్ ట్యాపింగ్ నిందితులు నోళ్లు విప్పేకొద్దీ కేసీయార్ ఆడించిన కుటిల నాటకాలన్నీ బట్టబయలవుతున్నాయి…

లిక్కర్ స్కాం బయటపడగానే కవిత అవినీతి యవ్వారాలన్నీ బయటపడ్డాక… ఇక ఇది మెడకు చుట్టుకోకతప్పదని కేసీయార్ గ్రహించాడు… కేటీయార్, కేసీయార్ సహా బీఆర్ఎస్ నాయకులెందరో ఎన్నో వ్యవహారాల్లో జాగ్రత్తగా చక్కబెట్టుకుంటున్నా సరే, కవిత నిర్లక్ష్యంతో అడ్డగోలుగా ఇరుక్కున్న తీరు మీద నిజానికి కేసీయార్‌కు పీకల్దాకా కోపముంది… కానీ బిడ్డ బిడ్డే కదా…

ఏకంగా బీజేపీ మోడీ, అమిత్ షాల మెడలు వంచాలనే ఓ వికృత క్రీడకు సాహసించాడు… రోహిత్‌రెడ్డి బీజేపీలోకి టచ్‌లోకి వెళ్తే… (అదీ డౌటే) మిగతా ముగ్గురిని కేసీయారే ఆ యవ్వారంలోకి ప్రవేశపెట్టి… గతంలో రేవంత్‌రెడ్డిని వోటుకునోటు కేసులో పక్కాగా ఇరికించినట్టే బీజేపీ ముఖ్యులను ఇరికించాలని ప్లాన్ చేశాడు… మాంచి కెమెరాలు గట్రా బిగించాడు…

Ads

రంగం సిద్ధం చేశాడు… ఏవో పిచ్చి వీడియోలు రికార్డయ్యాయి తప్ప వాటిల్లో పంచ్ లేదు… మొహం పాలిపోయింది… డ్రామా ఫెయిలైంది… ఐనాసరే, కేసు పెట్టాడు, ఏకంగా ప్రత్యేక పోలీసులను పంపించి బీజేపీ ముఖ్యుడు బీఎల్ సంతోష్‌ను, కేరళలో ఉన్న మరొకరిని అరెస్టు చేయడానికి ప్రత్యేక విమానాలు వెళ్లాయి… వర్కవుట్ కాలేదు, కేసు సీబీఐకి వెళ్లిపోయింది…

kcr

డ్రామా అట్టర్ ఫ్లాప్ అయ్యేసరికి ఆ వీడియోలతో రచ్చ చేద్దామని విఫల ప్రయత్నం చేశాడు, తన కాళ్ల దగ్గర పారాడే తెలుగు మీడియా తను చెప్పినట్టు రాసింది… అన్ని రాష్ట్రాల సీఎంలు, అన్ని హైకోర్టుల జడ్జిలు, అన్ని పార్టీల అధ్యక్షులు, ముఖ్యనేతలకు ఆ వీడియోలను పంపించాడు కేసీయార్… అందరూ చిరాకుగా మొహాలు పెట్టి చెత్తబుట్టలో పడేశారు… ఓహో, ఇదా కేసీయార్ పరిణతి, పరిపక్వత అనుకుని నవ్వుకున్నారు…

సరే, ఆయన చేసిన వాటిల్లో ఇలాంటివి బోలెడు… కానీ కేసీయార్ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు డబ్బులిచ్చాడనీ బీజేపీకి తెలుసు… కేసీయార్ క్రెడిబులిటీ ఏమిటో తెలుసు… ఏకంగా మోడీ, షా మెడలు వంచే దుస్సాహసమూ తెలుసు… ఐనాసరే, సిగ్గు లేదు ఆ పార్టీకి… అఫ్‌కోర్స్, రాజకీయాల్లో సిగ్గేమిటి, శరమేమిటి గానీ… కానీ ఎవరిని నమ్మాలో, ఎవరిని చేరదీయాలో, ఎవరిని దూరం ఉంచాలో తెలియకపోతే ఎలా..?

మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే బీజేపీ కేసీయార్ పట్ల సానుకూలంగానే ఉంది… పక్కా… రాష్ట్ర బీజేపీలో తను చెప్పిన మార్పులే చేసేందుకు కూడా దిగజారింది బీజేపీ… అందుకే జనం నమ్మకుండా కాంగ్రెస్ వైపు మళ్లారు… ఈ సిగ్గుమాలినతనానికి కారణం రాష్ట్ర బీజేపీ ముఖ్యులనే విమర్శ కూడా ఉంది… అసెంబ్లీ ఎన్నికల్లో జనం భారీగా ఛీకొట్టేసరికి, మెడలు వంచాలనుకున్న కేసీయారే కాళ్లబేరానికి వెళ్లాడు… పొత్తు ప్రయత్నాలు చేశాడు, రేవంత్ కసితో మీదపడతాడని గ్రహించి, కనీసం బీజేపీ సపోర్ట్ కావాలని కోరుకున్నాడు… అచ్చం, చంద్రబాబులాగే… ఆ గురువు శిష్యుడే కదా… ఆ గురువునే శంకరగిరిమాన్యాలు పట్టించినవాడు కదా…

kcr

నువ్వూ వద్దు, నీ పొత్తూ వద్దు అని కేసీయార్ పొత్తు ప్రతిపాదనల్ని తిరస్కరించింది బీజేపీ, ఎట్ లాస్ట్ కళ్లు తెరుచుకున్నట్టున్నాయి… ఇటు ఇండికూటమికీ అర్థమైంది కేసీయార్ అంటే ఏమిటో… దాంతో అక్షరాలా కేసీయార్ ఇప్పుడు ఒంటరివాడు…

చివరగా… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఎన్టీవీ చౌదరి తదితరులు, ప్రతిపక్ష నేతల ఫోన్లూ ట్యాపయ్యాయనేది చాలా చిన్న విషయం కేసీయార్ కోణంలో… సొంత అల్లుడు, వెంట తిరిగే సంతోష్ ఫోన్లే ట్యాప్ కాగా లేనిది… పత్రికలు, ప్రతిపక్షాలు ఎంత..? చివరకు తన నీడ మీద కూడా స్పెషల్ నిఘా పెట్టించుకునే కేసీయార్ ఎవడినీ వదిలిపెట్టలేదు… ఈ పెడధోరణులన్నింటికీ జనమే చెక్ పెట్టారు… అవునూ, తనెంత ప్రమాదకారో ఇప్పటికైనా నిజంగా బీజేపీకి అర్థమైందా అనేది సందేహమే…! దానికీ కారణాలు, తార్కాణాలు బోలెడు..!!

కుట్రలు, అబద్దాలు, అవినీతి, అక్రమాలు అన్నీ బయటపడి, చివరకు అరెస్టయినా సరే… అదే కవిత కోర్టుకు వెళ్తూ, జైలుకు వెళ్తా … తెలంగాణ తలవంచదు, జైతెలంగాణ అని నినదిస్తున్న తీరే నిజంగా తెలంగాణ తలవంచుకునే సిగ్గుచేటు… ఇదేదో తెలంగాణ పోరాటంలాగా ఆమె పోకడ… చేసిందేమీ రంగుసారా అక్రమ దందా… అదేదో తెలంగాణ సమాజం కోసమే చేసినట్టు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions