మీరు కొన్నాళ్లు ప్రభుత్వాధినేతగా ఉన్నారు… ప్రజలు ఇక చాలు, దిగిపొమ్మన్నారు… కొత్త ప్రభుత్వం కొలువు దీరింది… పాత ప్రభుత్వంలో కొన్ని అసంబద్ధ, ప్రజానష్టదాయక నిర్ణయాలు జరిగాయని భావించింది… ఓ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది… కమిషన్ మిమ్మల్ని కూడా ప్రశ్నించాలని మీకు నోటీసులు ఇచ్చింది, మీరేం చేయాలి..?
మీ నిర్ణయాలను జస్టిఫై చేసుకోవాలి… తప్పేమీ జరగలేదని వాదించాలి… ప్రజోపయోగ కోణంలో ఆయా నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో, ఏ పరిస్థితుల్లో ఆ నిర్ణయాలు అవసరమయ్యాయో చెప్పాలి… అవి కరెక్టా కాదా అనేది కమిషన్ తేల్చేస్తుంది… సాధారణంగా ఏ విచారణ కమిషన్ విషయంలోనైనా ఇదే జరుగుతుంది… కానీ విద్యుత్తు అంశాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణపై మాజీ ముఖ్యమంత్రి కేసీయార్ స్పందన భిన్నంగా ఉంది, అసాధారణంగా కూడా ఉంది…
అసలు నువ్వు విచారించడానికే అనర్హుడివి, నువ్వే ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలి అని కేసీయార్ అసాధారణ రీతిలో సమాధానం పంపించాడు… అదీ పబ్లిక్ డొమైన్‌లోకి రిలీజైంది… ఇది సమంజసమేనా, ధిక్కారమా, అసంబద్ధమా, అసాధారణమా ఇక్కడ చర్చించడం లేదు… ఒక మాజీ ముఖ్యమంత్రి అలా స్పందించడం ఒక వార్త… తను లేవనెత్తిన అంశాలు కొన్ని ఆసక్తికరం…
Ads
విచారణ కమిషన్ విలేకరుల సమావేశం పెట్టి ఏవేవో కామెంట్స్ పాస్ చేయడం కేసీయార్‌కు ఓ అవకాశాన్ని కలిగించినట్టుంది… దాంతో ఏకంగా కోర్టులో జడ్జిని నువ్వు నా కేసు విచారించడానికి పనికిరావు అని దబాయించడానికి దిగినట్టుగా ఉంది… నిజానికి విచారణ కమిషన్ చాలా అంశాల్ని, పాత నిర్ణయాల్ని, అందులోని సమంజసత్వాన్ని విచారిస్తోంది… కానీ కేసీయార్ కొన్ని అంశాలనే తీసుకుని, ఆల్రెడీ రెగ్యులేటరీ కమిషన్ల పబ్లిక్ హియరింగులు, లీగల్ ప్రొసీజర్ ద్వారా ఆమోదించిన నిర్ణయాలను ఈ విచారణ కమిషన్ విచారించడానికి వీల్లేదని అంటున్నాడు…
ఆ నిర్ణయాలపై విద్యుత్తు చట్టం ప్రకారం అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు వెళ్లాలి, లేదంటే సుప్రీంకోర్టులో చాలెంజ్ చేయాలి, అంతేతప్ప వేరే కమిషన్లు వేసి విచారించడానికి వీల్లేదు అనేది కేసీయార్ వాదన… కానీ దేశమంతా సూపర్ క్రిటికల్ పరిజ్ఞానం వైపు వెళ్తుంటే మనం సబ్ క్రిటికల్ వైపు ఎందుకెళ్లాం, భౌగోళికంగా ఆ ప్లాంటు స్థలం ఎంపిక, హడావుడి ఒప్పందాలు, అధిక రేట్లకు బయటి నుంచి కరెంటు కొనుగోళ్లు వంటి చాలా అంశాలు విచారణ కమిషన్ పరిధిలో ఉన్నట్టున్నాయి… ఛత్తీస్‌గఢ్ కరెంటు, పవర్ గ్రిడ్ కారిడార్ ఒప్పందాలు, ఇతరత్రా చాలా అంశాలపై కేసీయార్ తన వాదనను జనం ముందు పెట్టాడు ఇప్పుడు…
సరే, కేసీయార్ రాసిన 12 పేజీల లేఖలో ఏయే పరిస్థితుల్లో ఆ నిర్ణయాలు తీసుకోవలసి వచ్చిందో సవివరంగా చెప్పుకొచ్చాడు… ఆ అంశాల్లోని నిజాయితీ, సమర్థనల జోలికి కూడా ఇక్కడ వెళ్లడం లేదు… కానీ కేసీయార్ ఒకవేళ విచారణ కమిషన్ నోటీసుల మీదే, ఇదే వాదనతో హయ్యర్ లీగల్ ప్లాట్‌ఫామ్స్‌ను ఆశ్రయిస్తే బాగుండేదేమో… ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్తే అదే తేల్చేది కదా ఈ విచారణ కమిషన్ల చట్టబద్ధత ఏమిటో… సో, ఇప్పుడు కమిషన్ ఎలా రియాక్టవుతుందనేది మరింత ఆసక్తికరంగా మారింది…
Share this Article