……. ఔనా..? గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు అన్నిరకాలుగా సాయం చేసిన కేసీయార్ రుణం గ్రేటర్ ఎన్నికల్లో తీర్చుకున్నాడా జగన్..? జగన్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్‌లో నిర్ణయాత్మకశక్తిగా ఉందా.,.? జగన్ పార్టీ వోట్లన్నీ కారు గుర్తుకు పడటం వల్లే టీఆర్ఎస్ ఈమాత్రం చావుతప్పి కన్నులొట్టబోయినట్టుగా నిలబడగలిగిందా..? జగన్ వోట్లు సమయానికి ఆదుకోకపోతే కేసీయార్ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేదా..? జగన్ పార్టీ బీజేపీని దెబ్బతీసిందా..? గ్రేటర్లో బీజేపీ ఆశల్ని జగన్ నిలువునా ముంచేశాడా..?
హహహ… తెలుగుదేశం వాయిస్‌గా భావించబడే ఆంధ్రజ్యోతి ఇస్తున్న తెలివైన సర్టిఫికెట్టు ఇదే… చతుర్ ఖబర్… అంటే తెలివైన వార్త… మైండ్ గేమ్… బీజేపీకి జగన్‌కూ నడుమ పుల్లలు పెట్టాలనుకునే వార్త… చూశావుటోయ్ మోడీ, నువ్వు బాగా వెనకేసుకొస్తున్నావు కదా జగన్‌ను, తనే నిన్ను దెబ్బతీశాడు… ఇంకా జగన్‌ను నమ్ముతావా..? ఈ జగన్, ఈ కేసీయార్, ఈ ఒవైసీ… ఈ ముగ్గురూ నీకు ఎప్పుడైనా థ్రెట్టే సుమా… ఇకనైనా జాగ్రత్తపడు అని చెబుతున్నట్టుగా రాయబడిన వార్త…
ఎస్, ఆంధ్రా వోటర్లు కేసీయార్ అండగా ఉండటం వల్లే టీఆర్ఎస్ ఈమాత్రం నిలబడగలిగిందనే విశ్లేషణ కొంతవరకూ కరెక్టే అనుకుందాం… కానీ వాటిల్లో కేవలం జగన్ వోట్లేనా కేసీయార్‌కు అండగా నిలబడింది..? మరి టీడీపీ వోట్లు ఎటు పోయినట్టు..? కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేరలింగంపల్లి తదితర ప్రాంతాల్లో టీడీపీ సంప్రదాయిక వోట్లు బలంగా ఉన్నా, అవెందుకు టీడీపీకి పడలేదు..? తెలుగుదేశం అభ్యర్థులు రంగంలో ఉన్నా సరే, ఆ పార్టీ సానుభూతిపరులు ఎందుకు వోట్లు వేయలేదు..? అవి కూడా టీఆర్ఎస్కే పడ్డాయని లెక్క వేసుకోవాల్సిందేగా…
Ads
సరే.., జగన్, కేసీయార్ జాన్ జిగ్రీ… తెరవెనుక, తెరముందు వాళ్లది దోస్తీనే… అందుకని జగన్ పార్టీ కేసీయార్ పార్టీని సపోర్ట్ చేసిందీ అనుకుందాం… మోడీకి ద్రోహం చేశాడనే అనుకుందాం… మరి టీడీపీ వోటర్లు చేసింది ఏమిటి..? తమ వెల్విషర్ పార్టీని కూడా వదిలేసి కారును సపోర్ట్ చేశారు కదా… పోనీ, ఎల్బీనగర్ ఏరియా మొత్తం బీజేపీ స్వీప్ చేసింది కదా… దాన్నెలా విశ్లేషించాలి..? అక్కడ సెటిలర్స్ వోట్లు లేవా..? ఉన్నాయి కదా… అంటే జగన్ ఫ్యాన్స్ తెలివిగా కొన్ని ఏరియాల్లో కారును, ఇంకొన్ని ఏరియాల్లో కమలాన్ని సపోర్ట్ చేశారు అనుకోవాలా..?
సో, ఈ విశ్లేషణలన్నీ స్థూలంగా వాళ్లు అటు, వీళ్లు ఇటు అంటూ చెప్పడమే గానీ… వాస్తవమైన బలమైన కారణాల్ని ప్రొజెక్ట్ చేసేవి కావు… కాకపోతే మీడియా మాయ… సెటిలర్స్ తమకు ఇష్టం వచ్చిన వారికి వోట్లు వేసుకున్నారు… సెటిలర్స్ అంటే ఆంధ్రా కమ్మ, రెడ్డి, కాపు మాత్రమే కాదు కదా… సెంట్రల్, ఓల్డ్ సిటీలు తప్ప ప్రతి ఏరియాలోనూ వాళ్ల వోట్లున్నయ్… అన్ని కులాలకు చెందిన ఆంధ్రావాళ్లున్నారు… వాళ్ల వోట్లు పడనిదే బీజేపీకి ఇన్ని సీట్లు, ఇన్ని వోట్లు వచ్చాయా..?! కాకపోతే అమరావతిపై బీజేపీ అనాసక్త ధోరణి కారణంగా కమ్మ వోటర్లు కొంతమేరకు బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్కు వోట్లు వేసి ఉంటారేమో… అవీ పెద్ద సంఖ్యలో ఉండకపోవచ్చు… అందుకని ఇలాంటి స్ట్రాటజిక్ వార్తలు రాయగానే జగన్, మోడీ ఏమీ కొట్టుకోరు గానీ… వాళ్ల లెక్కలు వాళ్లకు ఉన్నయ్ గానీ… ఇలా పుల్లలు పెట్టడం వృథా ప్రయాసే…!!
Share this Article