.
కేసీయార్ అసెంబ్లీకి ఈసారైనా వస్తాడా…? మొన్నటి నుంచీ అన్నిరకాల మీడియా ఈ ప్రశ్న చుట్టూ దాదాపు లక్ష కథనాలు రాసి ఉంటుంది బహుశా… ఊదరగొట్టింది… పక్కా నిరర్థక చర్చ…
ఎందుకంటే..? ఓసారి ప్రమాణం చేయడానికి వచ్చాడు, ఎమ్మెల్యేగా కొనసాగాలీ అంటే తప్పదు గనుక… సుదీర్ఘకాలం అబ్సెంట్ ఉంటే పదవికి గండం కాబట్టి మరోసారి వచ్చాడు… తప్పదు గనుక…
Ads
మళ్లీ అలాంటి స్థితి వస్తేనే తను అసెంబ్లీకి వస్తాడు… అంతే… అది క్లియర్… అసలు తను ప్రజాజీవితంలోనే లేడు… రాజకీయ అజ్ఞాతంలో ఉన్నాడు… తనను ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని చెప్పిన తెలంగాణ ప్రజల తీర్పును పరిహసిస్తూ, పరాభవిస్తూ…
ఇప్పుడైతే అసలే రాడు… ఎందుకంటే… ఇప్పటి అసెంబ్లీ ఎజెండాలో ప్రధానమైంది కేసీయార్ తన జీవితంలోకెల్లా అమలుపరిచిన కాళేశ్వరం బ్లండర్స్ మీద… ప్లానింగ్, డిజైనింగ్ నుంచి ప్రాజెక్టు ప్రారంభం దాకా అన్నీ బ్లండర్సే… చివరకు దాని దుష్ఫలితం ఇప్పుడు ఆ మూడు బరాజులు పనికిరాకుండా మిగిలిపోవడం…
ఘోష్ కమిటీ రిపోర్టును అసెంబ్లీలో పెట్టి అధికారపక్షం తనపై చర్యలకు డిమాండ్ చేయబోతోంది… అన్ని విమర్శలూ తనమీదే కాన్సంట్రేట్ చేయబడి ఉంటాయి కాబట్టి… ఇంత బతుకూ బతికి చివరకు జూనియర్ ఎమ్మెల్యేల విమర్శలు, ఆరోపణలను తను అక్కడే ఉండి ఫేస్ చేయలేడు గనుక రాడు, సహజం…
తెలంగాణ ప్రాంత రాజకీయాల్లో ఎవరికీ దక్కని ఉత్కృష్ట గుర్తింపు తనది… పైగా ఇగోయిస్ట్… మరిక ఆ సిట్యుయేషన్‌ను ఎలా ఫేస్ చేస్తాడు… మామూలు రాజకీయ నాయకులకే విపరీతమైన స్వాభిమానం, అహం కనిపించే ఈ రోజుల్లో అంతటి కేసీయార్ దాన్ని తట్టుకోగలడా..? అందుకే రాడు… అసలు తను బయటికే రావడం లేదు కదా ఫమ్ హౌజు నుంచి…
తెలంగాణ జనం ఎన్ని కష్టాలకు గురవుతున్నా, ఎన్ని సమస్యలు ఎదురవుతున్నా… ప్రతిపక్ష నేతగా బాధ్యత ఉండీ తనకు పట్టడం లేదు… నన్ను ఓడించారు కదా, నేనెందుకు మీకు అండగా నిలబడాలి, అనుభవించండి అనే ఓ తరహా అనుచిత, వైపరీత్య రాజకీయ ధోరణి అది…
ఇక్కడ మరొకటీ చెప్పుకోవాలి… రేవంత్ కాళేశ్వరం ఇష్యూలో ఎందుకు స్పీడ్ యాక్షన్ తీసుకోవడం లేదనే కొందరి విమర్శ… తనను జైలులో వేసి, విపరీతంగా కక్షసాధించిన కేసీయార్ మీద రేవంత్ రెడ్డికి సహజంగానే ఆగ్రహం ఉంటుంది, ఉండాలి, ఎందుకంటే… కాళేశ్వరం బ్లండర్స్ ఓ కారణం, నువ్వు ఎంత తొక్కాలనుకున్నా నేను ఫీనిక్స్‌ను, పడిపోలేదు, ఎగిరి, ఎదిగి… నిన్ను వేలెత్తి చూపిస్తున్నా అని కేసీయార్‌కు చెప్పదలిచాడు కాబట్టి…
- అసెంబ్లీకి వస్తే తనను ర్యాగింగ్ చేస్తారని కేసీయార్ భయసందేహం… అందుకే రాడు, అది తెలిసి రేవంత్ రెడ్డి కేసీయార్, కేటీయార్, హరీష్‌లను రకరకాలుగా కాళేశ్వరం ఇష్యూను బేస్ చేసుకుని రకరకాల ర్యాగింగ్ మొదలు పెట్టాడు… వాళ్లను పరుగులు తీయిస్తున్నాడు… కిందామీదా పడేలా చేస్తున్నాడు… ఇదోరకం ర్యాగింగ్… చాన్నాళ్లుగా రగిలిపోతున్న రేవంత్ రెడ్డి పగ, ఆగ్రహం కేసీయార్ క్యాంపు ఆపసోపాలు చూస్తూ కాస్త చల్లబడుతున్నాయేమో..!!
నేను శిక్షించేది ఏముంది..? తనను తాను ఫామ్ హౌజులో బంధించుకున్నాడు… అప్పుడప్పుడూ వచ్చీపోయే విజిటర్స్, పోలీస్ కాపలా… జైలులో కూడా అంతే కదా అని వెక్కిరించాడు ఓసారి… ఇక అసెంబ్లీలో పెట్టి చర్చిస్తాడు… అందరితో యాక్షన్ డిమాండ్ చేయబడుతుంది… ఈ ఆట ఇప్పుడే షురువైనట్టుంది నిజానికి…
అసలు ఆ కమిషన్ ఏర్పాటుపైనే ఓదశలో వాదన కేసీయార్ అండ్ క్యాంప్… అది చెల్లుబాటు కాదని…! ఈరోజుకూ కాళేశ్వరం నభూతోనభవిష్యతి అని తన మీడియాలో పేజీల కొద్దీ, గంటలకొద్దీ చర్చలు, కథనాలు, ప్రసారాలు… ఇప్పుడు అసెంబ్లీలో ఘోష్ కమిషన్ రిపోర్టు ప్రవేశపెట్టకూడదని హౌజ్ మోషన్ దాఖలు తాజాగా…
అసెంబ్లీలో పీపీటీ ఇస్తానని హరీష్ వాదన… నిజాలు చెబుతానని భయపడుతున్నావా అంటాడు రేవంత్ రెడ్డిని..? ఆల్రెడీ తెలంగాణభవన్‌లో ఇచ్చాడు కదా, జనంలోకి వెళ్లింది కదా… భయపడటం ఏముంది..? పైగా ఇదే కాళేశ్వరం మీద నయా విశ్వేశ్వరయ్య గంటలకొద్దీ అసెంబ్లీలో ఆహాలు, ఓహోలు చెప్పాడు కదా కేసీయార్ పీపీటీ ఇస్తూ… అప్పుడు కాంగ్రెస్ అడిగితే నవ్వి ఎగతాళి చేసింది ఎవరు..?
నీ ఊరికి నా ఊరు ఎంత దూరమో, నా ఊరికి నీ ఊరూ అంతే దూరం ఉండాలి కదా హరీష్..? పోనీ, పీపీటీ ఇప్పుడు ఈ ఇష్యూలో ఏమవసరం..? ఆల్రెడీ కమిషన్ రిపోర్టు ఇచ్చేసింది… దాన్ని జనంలోకి తీసుకెళ్లి, యాక్షన్ ఇనీషియేట్ చేయడమే కదా… నిజానికి కాళేశ్వరం కథ ఇప్పటికింకా ప్రాథమిక దశలోనే కదా ఉన్నది..? పీపీటీతో ఏం ప్రయోజనం..? తన వాదనను అసెంబ్లీలో వినిపించినా రికార్డ్ అవుతుంది కదా…!!
Share this Article