.
ఇటీవల మీడియా మొత్తం కవర్ చేసింది కదా… హిందువులు తప్పనిసరిగా ఒక్కసారైనా దర్శించాలని కోరుకునే కేదారనాథ్‌కు ప్రభుత్వం రోప్ వే నిర్మించబోతున్నది అని…
అదేకాదు, మరో రోప్ వే కూడా ప్రభుత్వం సంకల్పించింది… అది హేమకుండ్ సాహెబ్… ‘పర్వతమాల’ ప్రాజెక్టు కింద నిర్మించే ఈ రెండు రోప్‌వేల గురించి కాస్త వివరంగా చెప్పుకుందాం…
Ads
కేదారనాథ్ గురించి తెలిసిందే కదా… చార్ ధామ్ క్షేత్రాల్లో ఇదీ ప్రముఖమైన శైవక్షేత్రం… పంచ కేదార్లలో ఒకటి… సోన ప్రయాగ నుంచి కిలోమీటర్ల కొద్దీ ట్రెక్కింగ్ చేయాలి… లేదా హెలికాప్టర్, డోలీ, పితూ, గుర్రాలు… వికలాంగులు, వృద్ధులు, మహిళలు, అనారోగ్య పీడితులకు దాదాపు అసాధ్యం నడకమార్గం…
పైగా ఎప్పటికప్పుడు మారిపోయే వాతావరణం, భారీ వర్షాలు, మంచు, కొండచరియలు కూలడం, దారులు మూసుకుపోవడం వంటివి సరేసరి… అందుకని సోనప్రయాగ నుంచి కేదారనాథ్ వరకు 12.9 కిలోమీటర్ల రోప్ వే కడతారు…
దీనివల్ల ప్రయాసతో 8 గంటలపాటు సాగే ప్రయాణసమయం కాస్తా అరగంటకు కుదించుకోగలం… సాఫీగా, వేగంగా, భద్రంగా… 4080 కోట్ల అంచనా వ్యయం… నాలుగైదేళ్ల గడువు… దీన్ని ఆదానీ ఎంటర్‌ప్రైజెస్ నిర్మించబోతోంది… పీపీపీ పద్ధతిలోనే… DBFOT … అంటే డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ మోడ్… గంటకు 1800 మందిని గుడి వద్దకు చేర్చగలదు…
మరో రోప్ వే ఎక్కడికీ అంటే… గోవింద ఘాట్ నుంచి హేమకుండ్ సాహెబ్ వరకు… ఈ హేమకుండ్ సిక్కుల పవిత్రస్థలి… ఇది 10వ సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ ధ్యానం చేసిన స్థలం… సిక్కుల పవిత్రమైన స్థలాల్లో ఒకటి…
సేమ్, కేదారనాథ్‌లాగే శీతాకాలం మూసేస్తారు… హర్యానా, పంజాబ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల నుంచే గాకుండా దేశవిదేశాల నుంచి కూడా సిక్కులు దీన్ని సందర్శిస్తారు… ఇదీ అచ్చం కేదారనాథ్‌లాగే చాలా క్లిష్టమైన ప్రయాణం… గుర్రాలు, డోలీలు తప్పవు… అననుకూల వాతావరణ పరిస్థితులు కూడా వస్తుంటాయి…
గోవిందఘాట్ నుంచి హేమకుండ్ సాహెబ్ వరకెు 12.4 కిలోమీటర్ల రోప్ వే కడతారు… నిర్మాణ ఏజెన్సీ మీద క్లారిటీ రాలేదు… కానీ అంచనా వ్యయం మాత్రం 2730 కోట్లు… దీన్ని కూడా DBFOT పద్ధతిలోనే నిర్మిస్తారు… ట్రెక్కింగ్ రూట్లో 10 గంటల వరకూ సమయం పడుతుంది… కానీ రోప్ వే ద్వారా అరగంట, ముప్పావుగంటలో వెళ్లిపోవచ్చు…
గంటకు 1100 మందిని తీసుకుపోగలదు… నిర్మాణానికి ఐదారు సంవత్సరాలు పడుతుందని అంచనా… అది పూర్తయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులు సులభంగా ఈ పవిత్రస్థలిని చేరే అవకాశం కలుగుతుంది…
దీనివల్ల ఆధ్యాత్మిక యాత్రలు కాస్తా పర్యాటక యాత్రలు అవుతాయనే విమర్శలు ఉన్నా… హిందూ, సిక్కు భక్తుల భద్రమైన ప్రయాణం కోసం… రోడ్ల విస్తరణ, కొత్త బ్రిడ్జిలు వంటి అవసరం లేకుండానే… ఈ రోప్ వేలు ఉపయోగపడతాయనేది ప్రభుత్వ భావన… ఇది ధార్మిక పర్యాటకం… అనగా టెంపుల్ టూరిజం, స్పిరిట్యుయల్ టూరిజం…
Share this Article