.
అక్కు యాదవ్ : నాగపూర్ లోని కస్తూరిబా నగర్…. తొంభై శాతం పైగా దళిత కుటుంబాలే ఆ ఏరియాలో నివాసం….
అక్కు యాదవ్ అసలు పేరు భరత్ కాళీ చరణ్. ఆ ఏరియాలో అందరూ అక్కు అని పిలుస్తారు… పాడి ఆధారిత కుటుంబం, పశువులను మేపడం, వాటి పాలను విక్రయించడం, అదే ఆధారం ఆ కుటుంబానికి…
Ads
రోజూ కూలి పనులకు, పాచి పనులకు వెళ్ళే కుటుంబాలతో పోలిస్తే వీరి కుటుంబం కాస్త ఉన్నత వర్గానికి చెందినది మరియు పేరులో యాదవ్ కూడా ఉంది. అక్కడ ఉన్న అధిక సంఖ్య దళితులపై వీరి కుటుంబానికి సహజంగానే అధికారం చెలాయించే హక్కు వారికి వారు కల్పించుకున్నారు…
అక్కు యాదవ్ కు అయిదుగురు సోదరులు, ఆరుగురు అక్కలు….పెద్ద కుటుంబం. అక్కుకు అన్నల ప్రోత్సాహం కూడా ఉండేది తాను చేసే తప్పులకు… పదిహేను సంవత్సరాలు వచ్చాయో లేదో ఆ ఏరియాలో అల్లరి చిల్లరగా తిరగడం మొదలు పెట్టాడు…
జనాలను కొట్టడం, వారి కూలి డబ్బులను దౌర్జన్యoగా లాక్కోవడం, ఒంటరిగా దొరికిన ప్రేమికులపై దాడి చేయడం, ఆ అమ్మాయిలను ఇబ్బంది పెట్టడం… పద్దెనిమిది నిండే సరికల్లా తన స్వంత గ్యాంగ్ ఏర్పరుచుకున్నాడు….
దొంగతనాలు, బెదిరింపులు, సెటిల్మెంట్లు అతని నిత్య కార్యక్రమాలు….. ఆ వచ్చిన సంపాదన నుంచి కొంత వాటా పోలీస్ అధికారులకు ఇవ్వడం… నాగపూర్ నగరానికి చిన్న సైజ్ దాదాగా అవతరించాడు…. అడ్డా మాత్రం కస్తూర్బా నగర్…
దళిత కుటుంబాలపై ఇతడి దౌర్జన్యాలు ఒక స్థాయిలో ఉండేవి…. ఈ ఏరియాలో ఏమి చేయాలన్నా ఇతడి అంగీకారం ఉండాలి…. పిల్లలు స్కూల్ కు వెళ్ళాలి అన్నా ఇతడు అంగీకరిస్తేనే….
ఎందుకు మీ పిల్లలకు చదువు అని ఎంతో మంది పిల్లలను బడికి వెళ్ళకుండా అడ్డుపడే వాడు…. ఇతడి భయానికి చాలా మంది తమ పిల్లల చదువు మానిపించేసారు. ఇతడి మాటను పెడి చెవిన పెట్టి బడికి వెళుతున్న అయిదో తరగతి అమ్మాయిని మానభంగం చేస్తారు ఇతడు ఇతడి గ్యాంగ్…
ఇతడికి భయపడి ముప్ఫై కుటుంబాల వరకు ఆ ఏరియా వదిలి వెళ్లి పోయారు…. తమ పిల్లల్ని పక్క ఊరిలోని బంధువుల ఇళ్లకు పంపేసే వారు…. అమ్మాయి, అబ్బాయి తేడా లేకుండా…. ఇతడు ఏ ఇంటి తలుపు అయినా తడితే చాలు ఇంట్లో ఉన్న అమ్మాయి లేదా మహిళ ఇతడి పశు కామ వాంఛ తీర్చాల్సిందే….
ఒకరోజు ఉదయం నాలుగు గంటలకు ఒక ఇంటి తలుపు తట్టి భర్తను ఇంటి ఎదురుగా ఉన్న పబ్లిక్ టాయిలెట్ లో బంధించి, ఆ ఇంటి ఇల్లాలిని రైల్వే ట్రాక్ కు లాక్కొని వెళ్లి ఉదయం ఎనిమిది వరకు ఘోరంగా మానభంగం చేస్తాడు….
పురుడు కోసం పుట్టింటికి వచ్చిన ఏడు నెలల గర్భిణిని వీధిలోకి లాగి, పట్టపగలు ఇతను, ఇతడి నలుగురు అనుచరులు అందరూ చూస్తూ ఉండగానే అత్యాచారం చేస్తారు…. ఆ మహిళ అది అవమానంగా భావించి కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకుని ఆత్మహత్య చేసుకుంటుంది సంఘటన జరిగిన మూడు రోజులకు….
ఈ మహిళలు పోలీస్ స్టేషన్లకు వెళ్లినా లాభం శూన్యం…. స్టేషన్ మొత్తo ఆక్కు యాదవ్ వైపే…. పెళ్లి జరుగుతున్న స్థలానికి చేరుకొని, పెళ్లి తతంగం పూర్తి అయ్యే లోపు అక్కడే ఉండి, ఇక శోభనం నాతో అని ఆ వధువుపై పడి తన కామ వాంఛ తీర్చుకుoటాడు….
ఒకసారి ఒక మహిళ 1997 లో అక్కూ యాదవ్ అత్యాచారం చేశాడు తన మీద అని కేసు పెట్టడానికి వెళితే, ముండా, నువ్వు ఇష్టంగా అతడితో పడుకొని, డబ్బులు గుంజడానికి కేసు పెట్టడానికి వచ్చావా అంటూ అక్కడున్న ఆరుగురు పోలీసు కానిస్టేబుళ్ళు సామూహిక అత్యాచారం చేస్తారు….
అక్కు యాదవ్ పై పోలీసు రికార్డుల్లోకి ఎక్కినవి మూడు మర్డర్లు, ఎక్కనివి ఎన్నో…. ఆ మూడు లో ఒక బాధితురాలు మహిళ…. తన రౌడీ కార్యకలాపాలకు అడ్డు వస్తోంది, ఎదురు ప్రశ్నిస్తోంది అని ఆవిడను పాశవికంగా హత్య చేస్తాడు… తన అంగాంగాలను బహిరంగంగా కోసి, అక్కడి జనాలను భయబ్రాంతులకు గురి చేస్తాడు…
పోలీసులు అరెస్టు చేయడం, సాక్ష్యాధారాలు బలంగా లేవు అని కేసులు కొట్టివేయబడటం…. ఇతడికి భయపడి ఎవరూ కోర్టులో సాక్ష్యం కూడా చెప్పే వారు కాదు ఇతడికి వ్యతిరేకంగా….. మొత్తం పద్నాలుగు సార్లు అరెస్టు అయ్యాడు, అది కూడా ఇక పోలీసులు తప్పదు అనుకున్నప్పుడు….
ఇతడు ఆక్కడి జనాలకు ఆ రోజు పనులకు వెళ్ళాలి అంటే వెళ్ళాలి, ఇంట్లోనే ఉండాలి అంటే ఉండి పోవాలి…..
వీడు తాగి వీడి అనుచరులతో ఉన్నాడు అంటే వీధి తలుపులు తీయాలన్నా భయపడే వాళ్ళు…. బయట ఉన్న సామూహిక మూత్రశాలలకు వెళ్ళాలన్నా భయమే….. కొందరు అత్యవసర పరిస్థితుల్లో ఇంట్లో ఉన్న కుండల్లోనే మల మూత్ర విసర్జన చేసుకునే వాళ్ళు, వీడు వెళ్లిన తరువాత దూర ప్రదేశంలో పారబోసే వాళ్ళు….
అమ్మాయిలు వీధిలో ఇతడికి కళ్ళ బడితే అలా వీధిలోనే వారి శరీరాల్ని తడిమి, గిల్లి, గిచ్చి పశువానందం పొందే వాడు… ఏరియాలో శబ్దం రాకూడదు, నలుగురు గుమికూడి మాట్లాడకూడదు, ఏదైనా ఇంటికి వెళ్లి భోజనం వండమని హుకుం జారీ చేస్తాడు…. చచ్చీ చెడి వారు అన్నీ సిద్ధపరచాలి….
ఒక ఇంట్లోకి జొరబడి, ఆ ఇంట్లో ఉన్న అతడిని నగ్నంగా చేసి, అతడి ఒళ్ళు అంతా సిగరెట్లతో కాలుస్తాడు…. అతడి పిల్లలు చూస్తూ ఉండగానే అతడితో బలవంతంగా నగ్నంగా డ్యాన్స్ చేయిస్తాడు….
ఆ ఏరియా వాళ్ళపై అతడు చేయని దౌర్జన్యం, అరాచకం లేదు…. ఎవరైనా ఒకరిద్దరు తిరగబడితే వారి ఇంట్లో ఉన్న మహిళలను అత్యాచారం చేసే వాడు… చిన్నా, పెద్దా వయస్సు చూడకుండా….
ఒక్కోసారి వీడు వీడి గ్యాంగ్ ఏరియాలోని యుక్త వయస్సు అమ్మాయిలను గుoపుగా కూడగట్టి, పాడు పడ్డ బిల్డింగులు లేదా నిర్మాణంలో ఉన్న గృహాలకు తీసుకొని వెళ్ళి అఘాయిత్యానికి పాల్పడే వాళ్ళు…. అందరి నోళ్ళు మూయించడానికి ఆతడు ఎన్నుకున్న మార్గం అత్యాచారం….
Aug ఒకటి 2004 రాత్రి ఉషా నారాయనే అమ్మాయి ఎదురింటిలో ఉండే మహిళపై వీరి గ్యాంగ్ మొత్తo అత్యాచారo చేస్తారు…. ఉషా కాస్త చదువుకున్న అమ్మాయి, కాలేజీకి వెళుతూ పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ ఉంటుంది… ఈ అమ్మాయిని కూడా చాలాసార్లు వేధించాడు….
ఉషా ఆ ఎదురింటి మహిళకు ధైర్యం చెప్పి…. పోలీస్ స్టేషన్ కు తీసుకొని వెళుతుంది…. వారు కేసు తీసుకొనక పోగా, ఆక్కూ యాదవ్ కు ఉప్పు అందిస్తారు, ఫలానా అమ్మాయిలు నీ మీద ఫిర్యాదు చేయడానికి వచ్చారు అని….
అంతే, రాత్రి ఉషా ఇంటి మీదికి నలభై మంది అనుచరులతో వస్తాడు… తలుపు తెరువు, నీపై అత్యాచారం చాలా చిన్న విషయం, నిన్ను నగ్నంగా ఈ ఏరియా మొత్తం ఊరేగిస్తాను, తరువాత యాసిడ్ పొస్తాను నీ దేహంపై అని బాటిల్ చూపిస్తాడు కిట్కీలో నుంచి….
ఉషా ధైర్యంగా ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పైపు తీసి రా, నేను సిలిండర్ పేల్చేస్తాను అందరం తగలబడి పోదాం రా అంటూ బెదిరిస్తుంది….
ఆ అరుపులకు, ఉషా తిరగబడటాన్ని, అప్పటి వరకు గడియలు బిగించుకొని చూస్తున్న వాళ్ళు బయటికి వచ్చి అక్కూ యాదవ్ పై తిరగబడుతారు….
అక్కు యాదవ్ ఇంత మంది ఎదురు తిరగబడుతారు అని అసలు ఊహించక పోవడంతో తన గ్యాంగ్ తో పారిపోతాడు…. పదమూడు సంవత్సరాలు అతడి ఆగడాలను భరించిన తరువాత ఆ ఏరియా వారికి అతడి పై తిరగబడాలి ఆన్న ధైర్యం వస్తుంది….
మొత్తం ఆ ఏరియాలో నలభై మందిపై అత్యాచారం చేశాడు…. అందరూ గుంపు అవుతారు…. వీడిని ఇక భరించలేం….వీడి సంగతి తేల్చాలి ఆంటూ, మొత్తం ఏరియా జల్లెడ పడతారు…దొరికితే కదా, ఇతడి ఇంటిపై దాడి చేసి… ఇంటిని కూలుస్తారు….
విషయం చేయి దాటి పోయింది అని ఊహించిన అక్కూ యాదవ్, పోలీస్ స్టేషన్ కు వెళ్లి, ఒక పాత కేసులో స్వచ్ఛందంగా లొంగి పోతాడు…. బయట ఉంటే ప్రమాదo ఆ ఏరియా వారితో, పోలీస్ స్టేషన్ సురక్షితం, పరిస్థితులు కాస్త సద్దుమణిగాక బెయిల్ తీసుకొని బయటికి వద్దాం…. ఆ ఏరియా వారి సంగతి అప్పుడు తేలుద్దాం అని…..
ఆగస్టు పదమూడు కోర్టు హియరింగ్ కు తీసుకొని వస్తున్నారు అని తెలుస్తుంది ఆ ఏరియా వారికి, ఆ ఏరియా వాళ్ళు అందరూ, దాదాపు అయిదు వందల మంది చేతికి దొరికిన ఆయుధాలు చేత బట్టుకొని, కోర్టుకు చేరుకుంటారు….
కోర్టు హాలులో అక్కు యాదవ్ పై ముందుగా తెచ్చుకున్న కారం పొడితో అతడి కళ్ళపై జల్లుతారు….. తరువాత తెచ్చుకున్న కత్తులతో అతడిపై దాడి చేస్తారు…. మొత్తం డెబ్బై కత్తి పోట్లకు గురవుతాడు…. ఒక మహిళ అతడి పురుషాంగాన్ని కత్తితో కోసేస్తుంది…. దాదాపు ఎక్కువగా మహిళలే పాల్గొంటారు ఆ దాడిలో….
కేసు అవుతుంది… అయిదుగురు మహిళలను అరెస్టు చేస్తారు…. ఆ ఏరియా వాళ్ళందరూ ధర్నా చేస్తారు…. అయిదు మంది కాదు…. అయిదు వందల మంది కలిసి చేశాం ఈ హత్య… మమ్మల్ని అందరినీ అరెస్టు చేయండి ఆంటూ…. ఒక వారానికి కోర్టు బెయిలు మంజూరు చేస్తుంది ఆ అయిదుగురికి…
ఆ హత్య ఒక సంచలనం అప్పట్లో…… నిజనిర్ధారణ కమిటీలు ఆ ఏరియాలో ఉన్న వారిని విచారించి నివేదిక సమర్పిస్తాయి… అప్పటి వరకు అనుకున్నట్లు నలభై మంది పై కాదు….ఆ పదమూడు సంవత్సరాల్లో వంద మందికి పైగా మహిళలపై అత్యాచారాలు చేశాడు….
ఇంకా విస్తు పోయే విషయం ఏమంటే…. సో కాల్డ్ పై కులాలకు చెందిన ఒక మహిళ కూడా లేదు ఆ వంద మందిలో…. అందరూ దళితులే…. నిరుపేదలే…. 2014 లో అందరిపై కేసు కొట్టి వేయబడుతుంది…. ఇతడి దౌర్జన్యలను వివరిస్తూ చాలా సినిమాలు, డాక్యుమెంటరీ లు ఉన్నాయి …. (వాట్సప్‌లో కనిపించిన స్టోరీ ఇది…)
Share this Article