ముందుగా ఓ పేద్ద డిస్‌క్లయిమర్… ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కావాలనేమీ లేదు… అలాగని పూర్తిగా తోసిపుచ్చలేం కూడా… అవి ఓవరాల్‌గా ఓ మూడ్ పట్టిస్తాయి… ఒడిశాకు సంబంధించి ఇండియాటుడే మై యాక్సిస్ సర్వే అబద్ధం కావాలనే కోరుకుంటున్నా… ఎందుకంటే, ప్రస్తుత భారత దేశ రాజకీయాల్లో నవీన్ పట్నాయక్ వంటి రాజకీయ వేత్తలు అరుదు… టవరింగ్ పర్సనాలిటీ… ఆ కారణాలు , విశ్లేషణల జోలికి వెళ్లడం లేదిక్కడ…
2019లో అసెంబ్లీ ఎన్నికల్లో 112 బీజేడీ గెలిస్తే కేవలం 23 సీట్లతో బీజేపీ చతికిలపడింది… నిజానికి చాలా హోప్స్ ఉండేది బీజేపీకి… (కాంగ్రెస్ కేవలం 9)… అదే ఎంపీ ఎన్నికల్లో బీజేడీ 12 సీట్లు, బీజేపీ 8 సీట్లు… కాంగ్రెస్ ఒకటి… సో, ఒడిశాలో కాంగ్రెస్ ఉనికి నామమాత్రం… ఎంపీ సీట్లలో బీజేపీకి కాస్త మంచి ఫలితాలే వచ్చినా, అసెంబ్లీకి వచ్చేసరికి నవీన్ పట్నాయక్ నాయకత్వమే కోరుకున్నారు జనం…
ఈసారి ఇండియాటుడే సర్వే చాలా విభ్రాంతికర ఫలితాల్ని చూపిస్తోంది… మొత్తం 21 సీట్లకు గాను 18 నుంచి 20 బీజేపీకి, వస్తే గిస్తే రెండు సీట్లు బీజేడీకి… మహా అయితే ఒక సీటు కాంగ్రెస్‌కు అట… 50 శాతం వోట్లు ఎంపీ సీట్లకు సంబంధించి బీజేపీకి పడ్డాయట… ఇంత హఠాత్తుగా నవీన్ పట్నాయక్ మీద ఒడిశా జనానికి అంత విరక్తి ఎందుకొచ్చింది… ఓ చిక్కు ప్రశ్న…
Ads
సరే, ఎంపీ సీట్లు కాబట్టి బీజేపీ, మోడీ నాయకత్వం కావాలని కోరుకున్నారు, కానీ అసెంబ్లీకి వచ్చేసరికి ఎప్పటిలాగే నవీన్ నాయకత్వమే కోరుకుంటారు అనుకుంటే… అదింకా గందరగోళం దృశ్యాన్ని ప్రొజెక్ట్ చేస్తోంది… ఒక్కసారి ఈ చార్ట్ కూడా చూడండి…
సరిగ్గా సేమ్… బీజేపీకి 62 నుంచి 80 అట… బీజేడీకి కూడా 62 నుంచి 80 అట… అంటే జబర్దస్త్ కీన్ ఫైట్ అన్నమాట… అంటే ఎవరైనా ప్రభుత్వం ఫామ్ చేయొచ్చన్నమాట… కాంగ్రెస్‌ను వదిలేసేయండి… 147 మొత్తం సీట్లు, అంటే మ్యాజిక్ ఫిగర్ 74… ఆ నంబర్ ఎవరికైనా రావొచ్చునన్నమాట… ఇంట్రస్టింగు…
ఇదీ ఏపీ రిజల్ట్ మిస్టరీలాగే మారిపోయింది… నిజానికి ఎప్పుడూ బీజేపీకి కొరకరాని కొయ్యగా ఉన్న బెంగాల్, ఒడిశా, ఏపీ, తమిళనాడు, కేరళ, తెలంగాణల్లో… ఈసారి బీజేపీ బాగా పుంజుకుంది, అందరూ అంగీకరించాల్సిందే… ఏపీలో టీడీపీ కూటమితో కలవడం వల్ల కొంత… (అఫ్ కోర్స్, ఏపీలో కారణాంతరాల వల్ల 25 సీట్లూ బీజేపీవే…) తెలంగాణలో సొంతంగా కొంత ఎదిగింది… తమిళనాడులో వోట్ షేర్ ఖచ్చితంగా పెరుగుతుంది… ఒడిశా, బెంగాల్‌లలో సీట్లు పెరగడం ఖాయం… ఇంట్రస్టింగ్… (తూర్పు తీరం)…
ఒకవేళ ఒడిశాలో నవీన్ పట్నాయక్‌కు ఆ మ్యాజిక్ ఫిగర్ రాకపోతే ఇక నవీన్ పట్నాయక్… కాదు, కాదు, బిజూ వారసత్వ పరంపరకు ముగింపు పలికినట్టే… ఇన్నాళ్లూ బిజూా, తన కొడుకు పట్ల ఆదరణ చూపిన (వాళ్ల పాలన తీరుతో)… ఒడిశా ప్రజలు ఇక చాలు అని చెబుతున్నట్టే… పైగా నవీన్ పట్నాయక్ ఆరోగ్యం బాగా క్షీణిస్తోంది…
తను రాజకీయ వారసుడిగా చెబుతున్న తమిళ పాండ్యన్ నాయకత్వాన్ని (తను ఓ మాజీ బ్యూరోక్రాట్)… ఒడిశా ప్రజలు తిరస్కరించినట్టే లెక్క… ఆల్రెడీ ఒడిశా పాలనయంత్రాంగం బ్యూరోక్రాట్ల గుప్పిట్లోకి వెళ్లిందని చెబుతున్నారు… ఇక్కడ కాంగ్రెస్ నామమాత్రమే కాబట్టి… రాబోయే రోజుల్లో ఇదీ ఇతర నార్తరన్ స్టేట్స్‌లాగే బీజేపీ అడ్డా అయిపోతుందన్నమాట…!!
Share this Article