.
మామూలుగా సినిమా ఇండస్ట్రీలో పనిచేసే ఓ కుటుంబం నుంచి పిల్లలు కూడా, చిన్నప్పటి నుంచీ అదే వాతావరణంలో పెరిగీ పెరిగీ, వాళ్లూ ఇండస్ట్రీలో అవకాశాలు, ఉపాధి వెతుక్కోవడం పరిపాటి… అందరూ అని కాదు, చాలామంది… కానీ తమ కుటుంబానికి అలవాటైన ఆ రంగుల ప్రపంచపు, భ్రమల రంగాన్ని వదిలేసి, కొత్త దారుల్లో వెళ్లేవాళ్లను చూస్తే ముచ్చటేస్తుంది…
సత్యశ్రీ తెలుసు కదా… జబర్దస్త్, అదిరింది కామెడీ షోలలో చేసేది… చమ్మక్ చంద్రకు జోడిగా స్కిట్లు చేసేది… కొన్ని సినిమాల్లో కూడా చేసింది… నా పెట్టే తాళం తెరిచి అనే ఓ రోత పాటతో వివాదానికి, విమర్శలకు కూడా గురైంది… ఈమె తల్లి కూడా కేరక్టర్ ఆర్టిస్ట్… తండ్రి గురించి తెలియదు…
Ads
ఇప్పుడు సత్యశ్రీ తన సోషల్ మీడియా ఖాతాలో తన సోదరి గురించి ఆసక్తికరమైన సమాచారం, ఫోటోలు పంచుకుంది… విషయం ఏమిటంటే..? ఆమె సోదరి పేరు కీర్తిశ్రీ… ఆమె ఈ రంగంలోకి రాలేదు… దూరంగానే ఉంది… చదువుకుంది… నటి కాదు, ఆమె ఒక ఏవియానిక్స్ (ఏరోస్పేస్) ఇంజనీర్…

నిన్న ప్రైవేటు రంగంలో నింగికెగిసిన స్కైరూట్ ఏరోస్పేస్ వాళ్ల విక్రమ్-1 రాకెట్ ప్రాజెక్టు గురించి చెప్పుకున్నాం కదా… ఆ ప్రాజెక్టులో కీర్తిశ్రీ కూడా పనిచేసింది… ఈ రాకెట్‌కు సంబంధించిన ‘ఎలక్ట్రికల్ ఇంటిగ్రేషన్ & టెస్ట్ ఇంజనీర్’గా ఆమె పనిచేసింది…

ఈ విషయాన్ని నటి సత్యశ్రీ స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పంచుకుంటూ, తన చెల్లిని చూసి ఎంతగానో గర్వపడుతున్నట్లు ఎమోషనల్ పోస్ట్ పెట్టింది… గుడ్… విభిన్నరంగం, తలెగరేసే ప్రొఫెషన్… ఈ భ్రమల ప్రపంచం నుంచి దూరంగా, మంచి రంగం ఎంచుకున్నందుకు, విజయాలు సాధిస్తున్నందుకు అభినందనలు కీర్తిశ్రీ..!
ఈ ప్రాజెక్టు విజయంలో ప్రధాన భూమిక నిర్వహించిన సీఈవో చందన పవన్ కుమార్, సీవోవో నాగభరత్ డాకా ఏపీకి చెందిన వారే… ప్రాజెక్టులో చాలామంది తెలుగువాళ్లున్నారు !!
Share this Article