God’s Own Country – Kerala! Wow! How is it possible that Kerala became God’s Own Country? Well it’s a small speck of land in Southern part of India ruled by bunch of atheists who called it ‘God’s Own Country ‘…
******
కొంచెం దయతలచి స్పెషల్ ప్యాకేజీ కింద ఒక్కసారికి బెయిల్ ఔట్ ప్యాకేజీ ఇవ్వండి కేరళకు… :: సుప్రీం కోర్టు!
******
సదరు సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది కానీ ఆదేశాలు ఇవ్వలేదు అని గమనించండి! ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి నిధులు ఇవ్వడం లేదు అంటూ దుష్ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు అభ్యర్థనను ఆదేశాలు జారీ చేసింది అంటూ ప్రచారం చేస్తున్నారు లెఫ్ట్ లిబరల్స్!
Ads
*******
2023 డిసెంబర్ నెలలో కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే నిధులు విడుదల చేయాలని ఆదేశాలు ఇవ్వమంటూ! కపిల్ సిబాల్ కేరళ ప్రభుత్వం తరుపున వాదిస్తూ.. కేంద్రం కేరళ ప్రభుత్వనికి 19,000 వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉందని, కాబట్టి కోర్టు వారు విచారించి వెంటనే స్పందించి ఆదేశాలు ఇవ్వమని కోరినా కోర్టు మార్చి నెల 13 వ తేదీన విచారిస్తామని వాయిదా వేసింది!
*********
కానీ కేరళ ప్రభుత్వ ఆర్థిక స్థితి దయనీయంగా ఉందనీ వెంటనే స్పందించి ఆదేశాలు ఇవ్వాలని కోరడంతో మార్చి 11న విచారణ మొదలుపెట్టింది సుప్రీం కోర్టు! కేంద్ర ప్రభుత్వం తరపున సొలసిటర్ జనరల్ శ్రీమతి R. వెంకట రమణి మరియు అదనపు సొలిసిటర్ జనరల్ శ్రీ వేంకట రామన్ వాదించారు. కేరళ ప్రభుత్వము చెల్లింపులు చేయలేని స్థితిలో ఉందనీ, కాబట్టి కేరళ విషయంలో ప్రత్యేక ప్యాకేజీ కింద, అదీ ఈ ఒక్కసారికి బెయిల్ ఔట్ చేయమని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్ మరియు జస్టీస్ K. విశ్వనాథ్ లతో కూడిన బెంచ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది!
********
సొలిసిటర్ జనరల్: కేరళ విషయంలో ప్రత్యేక కేసుగా పరిగణించి నిధులు విడుదల చేయలేము. మేము ఇవ్వాలనుకుంటున్న దానికి 5 రెట్లు ఎక్కువ అడుగుతున్నారు! ప్రత్యేక ప్యాకేజీ అంటూ ఏ రాష్ట్రానికీ ఇవ్వడం లేదని ఇప్పటికే స్పష్టంగా చెప్పాం, మీరు కోరినట్లుగా కేరళకి ఇస్తే మిగతా రాష్ట్రాలకి మేము సమాధానం చెప్పాల్సి వస్తుంది.
కేరళ బడ్జెట్ కి చెందిన రాబడి, ఖర్చుల విషయంలో గత 5 సంవత్సరాలుగా అంచనాలకి అనుగుణంగా ఉండడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరిస్తూ వస్తున్నది. కానీ ఈ విషయంలో కేరళ ప్రభుత్వము నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రిజర్వ్ బ్యాంక్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న 5 రాష్ట్రాల జాబితాలో చేర్చింది. కోర్టు అనుమతి ఇస్తే కేంద్రం ఇచ్చిన నిధుల లెక్కలు ముందు ఉంచుతాము!
********
సుప్రీం న్యాయమూర్తి శ్రీ సూర్యకాంత్ : ఈ ఒక్క సారికి ప్రత్యేక ప్యాకేజీ కింద కేరళ అప్పు తీసుకోవడానికి అనుమతి ఇవ్వండి మార్చి 31 లోపు.
అయితే కఠినమయిన నియమ నిబంధనలు విధించండి! ఇప్పుడు తీసుకునే అప్పు పరిమితిని వచ్చే రెండేళ్ల ఆర్థిక సంవత్సరాలలో వర్తించే పరిమితిని తగ్గించండి, అంటే వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాలలో ఎంత అప్పు తీసుకోవచ్చు అనే పరిమితిని తగ్గించండి, తద్వారా ఇప్పుడు తీసుకోబోయే అప్పు వల్ల ఏర్పడే లోటు భర్తీ చేయవచ్చు!
కపిల్ సిబాల్: మాకు సమ్మతమే!
అయితే కేరళ ఆర్థిక శాఖ అధికారులు, కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు కూర్చొని చర్చించి ఒక నిర్ణయానికి రండి కేసుని మార్చి 13 వ తేదీన విచారిస్తాం!
*******
మార్చి 13 అంటే ఈ రోజు:
అదనపు సొలిసిటర్ జనరల్ : కేరళ ప్రభుత్వము 5 వేల కోట్ల రూపాయలు ఋణం తీసుకోవడానికి అనుమతి ఇస్తాము.
కపిల్ సిబాల్: ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకి 5వేల కోట్లు సరిపోవు. కనీసం 10 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. ప్రస్తుత సంక్షోభం నుండి గట్టెక్కడానికి.
కేంద్ర ఆర్థిక శాఖ 5 వేల కోట్ల రూపాయలు ఋణం తీసుకోవడానికి అనుమతి ఇస్తున్నది అంటే రాష్ట్రాల ఆర్థిక స్వతంత్ర వ్యవస్థని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 136 ఇస్తున్న హక్కులని కాలరాసే అధికారం కోర్టు ఇస్తున్నట్లుగా భావిస్తున్నాము.
ముందు 10 వేల కోట్ల రూపాయలు ఋణం తీసుకోవడానికి అనుమతి ఇవ్వమని ఆదేశాలు ఇవ్వండి.
తదుపరి వాదనల కోసం మార్చి 21 కి కేసు వాయిదా ఇవ్వండి!
సుప్రీం కోర్టు: అంటే మీరు మధ్యంతర తీర్పు ఇవ్వమని కోరుతున్నారా?
కపిల్ సిబాల్: మధ్యంతర ఉత్తర్వులు అడగట్లేదు. కేరళ రాష్ట్ర అవసరాల కోసం అప్పు తీసుకోవడానికి పరిమితి, అనుమతి అవసరం లేదు. ఇది రాజ్యాంగం రాష్ట్రాలకి ఇస్తున్న హక్కు. ప్రస్తుతం కేంద్రం అనుమతి ఇస్తున్న అప్పు 5 వేల కోట్ల రూపాయలు కాగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి మరో 3 వేల కోట్ల రూపాయల అప్పు తీసుకోవడానికి మాత్రమే అనుమతి ఇస్తున్నది అదీ కండీషన్లు పెడుతూ… ఇది మాకు సమ్మతం కాదు. తీసుకున్న అప్పుకి నిధులు ఎలా ఖర్చు పెట్టిందీ వివరాలు ఇస్తేనే తరువాత అప్పుకి అనుమతి ఇస్తాము అనే కండీషన్ మాకు సమ్మతం కాదు! కేరళ రాష్ట్ర అవసరాల కోసం అప్పు చేసి దానికి రసీదులు ఇవ్వాలి అనే నిబంధన పెట్టడం ద్వారా రాష్ట్రాలను తన చెప్పు చేతులలోకి తీసుకొని కట్టడి చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నది’ అంటూ కపిల్ సిబాల్ వాదించాడు.
********
కేరళ రాష్ట్ర ఆర్థిక స్థితి దాని మీద కేంద్ర ఆర్థిక శాఖ స్పందన, సుప్రీం కోర్టు కలుగచేసుకున్న తీరు, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ఖర్చు చేసిన వాటికి రిసీప్ట్స్ ఇవ్వమని అడిగినందుకే కదా చంద్రబాబు కేంద్రం మీద దుమ్మెత్తి పోసింది? మార్చి 21 న కపిల్ సిబాల్ రాజ్యాంగం రాష్ట్రాలకి ఇస్తున్న హక్కులు, వాటి పరిధులు ఏమిటో సుప్రీం కోర్టులో వాదిస్తాడు. దానికి కేంద్రం కౌంటర్ ఇస్తుంది.
ఈ రెండు విషయాల మీద ఆధారపడి సుప్రీం కోర్టు తీర్పు ఇస్తుంది. ఆ తీర్పు కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అమలులో ఉన్న ఉచిత పథకాల మీద ప్రభావం చూపుతుంది! అలవికాని ఉచిత హామీలు ఇచ్చి ఎన్నికలలో గెలిచి వాటిని అమలు చేయలేక కేంద్రం మీద దుమ్మెత్తి పోసి, ఆపై ఢిల్లీలో ధర్నాలు, దీక్షలు చేయడం అలవాటుగా మారిన నేపథ్యంలో కేరళ Vs కేంద్ర ఆర్థిక శాఖ కేసులో సుప్రీం కోర్టు ఇవ్వబోయే తీర్పు చాలా ముఖ్యమైనది. మనం తెలుసుకోవాలి!
Share this Article