అసలు నమ్మబుద్ధి కాలేదు… మన దేశ పోలీసులేనా వీళ్లు..? అసలు ఇది జరిగిందా..? మన పోలీస్ వ్యవస్థలో దీన్ని ఊహించొచ్చా..? తప్పుడు కేసులు, అవినీతి, అక్రమాలు, అరాచకాలకు కేరాఫ్ అనే ఆరోపణలున్న మన పోలీసులు సారీ చెప్పారా..? అందుకే ఒకటికి రెండుసార్లు వార్త చదివి, అదీ సరిపోక కేరళ పోలీసుల ట్విట్టర్ ఖాతా చూస్తే తప్ప నమ్మకం కుదరలేదు… ఐనా ఇంకా ఆశ్చర్యమే…
విషయం ఏమిటంటే..? కేరళలో ఓ ఐదేళ్ల బాలిక శుక్రవారం సాయంత్రం నుంచీ కనిపించకుండా పోయింది… బీహార్ నుంచి పొట్ట చేత్తో పట్టుకుని కూలీ కోసం వలస వచ్చిన దంపతుల బిడ్డ ఆమె… కుటుంబ సభ్యులు వెతికీ వెతికీ ఆచూకీ దొరక్క, రోజులు బాగాలేవు, ఏమైందో ఏమిటోనని పోలీసులకు ఫిర్యాదు చేశారు…
సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి ఆ బీహార్‌కే చెందిన మరో కూలీని పోలీసులు అరెస్టు చేసి, తమదైన శైలిలో మర్యాద చేశారు… వాడు శనివారంనాడు నేరం అంగీకరించాడు… తను ఈ కూలీ దంపతులు నివసించే ఇంట్లోనే పైఅంతస్థులోని ఓ గదిలో ఉంటున్నాడు… ఆ చిన్నారిపై అత్యాచారం చేసి, గొంతు కోసి చంపాడు వాడు… కేరళ మార్కెట్ సమీపంలో గోనె సంచుల నడుమ పడేశాడు…
Ads
పోలీసుల వైఫల్యంపై ప్రతిపక్ష కాంగ్రెస్ విరుచుకుపడింది… అసెంబ్లీలోనూ చర్చ జరిగింది… వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోలేక లెఫ్ట్ ప్రభుత్వం తలదించుకుంది… ‘‘మేం రాత్రి 7:10 గంటలకు ఫిర్యాదు స్వీకరించాం, రాత్రి 8 గంటలకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది… మా బృందం వెంటనే సిసిటివి విజువల్స్ తనిఖీ చేసింది, ఆ చిన్నారి సదరు కూలీతో ఉన్నట్లు గుర్తించాం. మేం రాత్రి 9:30 గంటలకే అతన్ని పట్టుకున్నాం… మేం పట్టుకునే సమయానికి ఆ చిన్నారి వాడితో లేదు…’’ అని ఎర్నాకులం రూరల్ ఎస్పీ వివేక్ కుమార్ మీడియాకు తెలిపాడు…
https://twitter.com/TheKeralaPolice/status/1685238309721903104?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1685238309721903104%7Ctwgr%5E861e9463561e0582302ecf99ed0a8bc462fd4a6d%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.indiatoday.in%2Findia%2Fstory%2Fkerala-police-apology-tweet-five-year-old-rape-assault-body-dumped-sack-aluva-2413726-2023-07-30
అంతే తాము ఎంత వేగంగా కేసు పరిష్కరించామో చెప్పడానికి పోలీసులు విఫల ప్రయత్నం చేశారు… (నిజానికి వేగంగా స్పందించినట్టే లెక్క)… సోషల్ మీడియా, ప్రతిపక్షాల విమర్శలు వెల్లువెత్తడం వల్లో లేక నిజంగానే తమ చేతకానితనం పట్ల తమకే ఏవగింపు కలిగిందో గానీ… ట్విట్టర్‌లో ఓ ట్వీట్ పెట్టారు…
‘‘సారీ డాటర్, నిన్ను నీ తల్లిదండ్రులకు ప్రాణాలతో అప్పగించడంలో మేం విఫలమయ్యాం…’’ అని ఆ ట్వీట్ సారాంశం… ఆ ట్వీట్ కూడా వైరల్ అయిపోయింది… మొదటిసారి కేరళ పోలీసులు తమ చేతకానితనాన్ని అంగీకరించారనీ, అసలు పోలీసుల నుంచి ఈ తరహా ట్వీట్ అసాధారణం అని బోలెడు మంది అభిప్రాయపడ్డారు… (ఈ వార్త మన ఘనత వహించిన తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక్క ఆంధ్రప్రభలో మాత్రమే కనిపించింది…)
Share this Article