Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కేజీఎఫ్‌ సినిమా ప్రభావం… మైఖేల్‌కు ప్రేరణ, అనుకరణ, అనుసరణ…

February 3, 2023 by M S R

ఒక సినిమా భారీ హిట్టయిందంటే… తరువాత సినిమాలపై ఆ ప్రభావం ఉంటుంది… సహజం… మైఖేల్ సినిమా చూస్తే కేజీఎఫ్ అనేకసార్లు గుర్తొస్తుందీ అంటే ఆ సహజసూత్రమే… మైఖేల్ సినిమా నిర్మాతలకు ఓ పాన్ ఇండియా సినిమా కావాలి… అందుకని రిస్క్ దేనికి..? హిట్ ఫార్ములా, ప్రజెంట్ ట్రెండ్ అని ప్రూవ్ చేసుకున్న కేజీఎఫ్‌ను ఆదర్శంగా తీసుకుంటే సరి… ఇంకేముంది, దర్శకుడికి కూడా క్లారిటీ వచ్చింది…

ఇంతకుముందు ఈ గ్యాంగ్‌స్టర్లు, నడుమ ఇరికించబడిన తల్లి, చెల్లి సెంటిమెంట్ల కథల్ని చూసే సెక్షన్ల, ఇష్టపడే ప్రేక్షకులు వేరే ఉండేవారు… జానర్లు వేర్వేరుగా ఉండేవి… ఇప్పుడవన్నీ ఏమీ లేవు… కేజీఎఫ్, విక్రమ్, వాల్తేరు వీరయ్య… అందరూ అదే బాట… డిష్యూం డిష్యూం… తుపాకులు, గన్నులు, కాల్పులు, బుల్లెట్లతో సినిమా హోరెత్తిపోతోంది… మరి మైఖేల్ భిన్నంగా ఎలా ఉంటుంది..?

2010 నుంచి సందీప్ కిషన్ సినిమాలు చేస్తూనే ఉన్నాడు… హిట్టా, ఫ్లాపా జానేదేవ్… తనకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి… ఏటా రెండుమూడు సినిమాలు గ్యారంటీ… తను కష్టపడతాడు… కానీ ఈరోజుకూ ఇదుగో ఇదీ నా సినిమా అని చెప్పుకునే సినిమా లేదు… ఈ మైఖేల్ తాజా నిరాశ… ఐతేనేం, ఇంకా చేతిలో మూడు సినిమాలున్నాయి… అల్లాటప్పా బ్యానర్లు కాదు, కాస్త మేలిమిరకమే…

Ads

మైఖేల్ విషయానికి వస్తే ఇందులో విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, గౌతమ్ మేనన్ వంటి అతిరథులే ఉన్నారు… భారీగా ఖర్చు పెట్టారు కూడా… పాన్ ఇండియా సినిమా కదా ఇంతకింత వచ్చేస్తుందని నిర్మాతలు నమ్మారు… ఇప్పుడు అందరికీ ఓ ధీమా… థియేటర్ రన్, ఓటీటీ డబ్బు, ఓవర్‌సీస్ రైట్స్, శాటిలైట్ టీవీ డబ్బు… అంతా కలిపితే గట్టెక్కుతాం, హిట్టయితే ఇక డబ్బే డబ్బు… మైఖేల్ పోకడ కూడా అదే…

ఓ గ్యాంగ్‌స్టర్ (గౌతమ్ మేనన్) మీద దాడి జరుగుతుంటే పదేళ్ల పిల్లాడు మైఖేల్ (సందీప్ కిషన్) కాపాడతాడు… వాడిని తీసుకెళ్లి తన గ్యాంగులో చేర్చుకుని, అలాగే పెంచి పెద్ద చేస్తాడు సదరు గ్యాంగ్‌స్టర్… సాక్షాత్తూ కొడుకు (వరుణ్ సందేశ్) కూడా గ్యాంగ్ పనుల్లోనే ఉన్నా సరే, ఆ ఎక్కువ పనుల్ని సందీప్‌కే అప్పగిస్తుంటాడు గురు అలియాస్ సదరు గ్యాంగ్‌స్టర్… మళ్లీ గురునాథ్ మీద దాడి జరుగుతుంది, చేసింది ఢిల్లీలోని రత్నాకర్ (అనీష్ కురువిల్లా)… తనకు ఓ బిడ్డ తీర (దివ్యాంశ కౌశిక్…) వాళ్లిద్దరినీ ఖతం చేసే పనిని మైఖేల్‌కు అప్పగిస్తాడు గురు… చంపడానికి వెళ్లి ప్రేమలో పడిపోతాడు హీరో…

ఇదీ సినిమా కథ నేపథ్యం… ఈమధ్యకాలంలో సూపర్ హిట్టయిన గ్యాంగ్‌స్టర్ కథ అంటే కేజీఎఫ్… మైఖేల్ పోకడలో ఆ ప్రభావమే కనిపిస్తూ ఉంటుంది… ఎలివేషన్లు, ఎడిటింగ్ ప్యాటరన్ అవే… తల్లి సెంటిమెంట్, సముద్రం, చేతిలో ఓ బ్యాగు, సేమ్ బీజీఎం, వాయిస్ ఓవర్‌తో పాత్రల పరిచయం అన్నీ కేజీఎఫ్ స్టయిలే… మైఖేల్ ఢిల్లీ వెళ్లాక సీన్లు మరీ స్లోగా, నీరసంగా ఉండి, ఓపికను పరీక్షిస్తాయి… కేజీఎఫ్ సక్సెస్‌కు కారణం బలమైన స్క్రీన్ ప్లే… ఎక్కడా వేగం, బిగి సడలని కథనం… మైఖేల్‌లో అది లేదు…

కేజీఎఫ్‌లో హీరో లక్ష్యం ఏమిటో మొదటి నుంచీ ప్రేక్షకుడికి ఓ క్లారిటీ ఉంటుంది… కానీ ఈ మైఖేల్ లక్ష్యం ఏమిటో ప్రేక్షకుడికి ఓ పట్టాన అర్థం కాదు… ట్రీట్‌మెంటులో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే, బేసిక్‌గా కథ బాగుండాలి… మైఖేల్ కథలో ప్రేమ కథ ఇరకలేదు సరిగ్గా… ఆ కథలోనూ ఆత్మ లేదు… ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా సోసో… విజయ్ సేతుపతి వచ్చాక కథ కాస్త కదులుతూ ఉంటుంది… సరే, ఆ కథను అలా వదిలేస్తే సందీప్ తనకు చేతనైనంత తను నటించాడు… దడ దడ యాక్షన్ సీన్లు కూడా బాగానే చేశాడు…

సినిమాలో గౌతమ్ మేనన్ వోకే… వరుణ్ సందేశ్‌కు కొత్తతరహా పాత్ర… పర్లేదు… సినిమాకు కాస్త బలం వరలక్ష్మి, విజయ్ సేతుపతి… హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ పాత్ర పరిమితం… కాకపోతే చూడబుల్ ఫేస్… అనసూయ గురించి చెప్పడం వేస్ట్… అన్నట్టు ఇది వర్తమానంలోని కథ కాదు… ఎప్పుడో 1990 ప్రాంతంలోని కథ… కేజీఎఫ్‌ను అనుకరించే ప్రయత్నంలో బోలెడు షాట్లు లాజిక్ రహితంగా వచ్చి పడుతుంటాయి… మొత్తానికి విషయం ఏమిటయ్యా అంటే… అనుకరణ, అనుసరణ, ప్రేరణ… పేరేం పెట్టుకున్నా సరే, ఒరిజినల్‌కు చాలా దూరంలోనే ఉండిపోతుంది… మైఖేల్ సినిమాలాగే..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓ కోణంలో ట్రంపు సుంకదాడి ఇండియాకే మేలు… అదెలాగంటే..?!
  • లాయర్ గారూ… నేను ఓ హత్య చేస్తాను… ఆ కేసు నుంచి మీరే కాపాడాలి…
  • రేవంత్‌రెడ్డి అంటించాడు… బండి సంజయ్ పెట్రోల్ పోస్తున్నాడు…
  • అనువాద పాటలకు అర్థం…? సింపుల్..! ఏ అర్థమూ లేని పైత్యమే…!!
  • ఇస్కోన్ టేమ్పల ఎక్కడ…! వుడ్‌పాకేర్స్ పక్కనే…! తెలుగే… అర్థం కాలేదా..?!
  • నీ బిడ్డను ఇవ్వు… లేదంటే అప్పు అణా పైసలతోసహా వెంటనే తీర్చెయ్…
  • ఓ మరుపురాని ఫోటో… కుదిపేసే ఫోటో… ఆ సందర్భమేంటంటే…
  • ఇండియా..! మెడికల్ టూరిజానికి పే-ద్ద హబ్… నానాటికీ వృద్ధి..!
  • ‘‘నేను, రేవంత్, కవిత, ఆ జడ్జి… మొత్తం 6500 మందిమి నక్సలైట్లం…’’
  • ఐటీసీ స్కామ్..! షెల్ కంపెనీలతో దేశవ్యాప్తంగా విస్తరించిన నెట్‌వర్క్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions