Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మంజువాణి ఇంటిలో మేజువాణీ… రాతిరంతా ఇక్కడే రాజధాని…

August 31, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ……. 29 కేంద్రాలలో వంద రోజులు ఆడిన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ 1986 మేలో వచ్చిన ఈ ఖైదీ రుద్రయ్య … ఏముంది ఈ సినిమాలో అంతగా ఆడటానికి !?

డబుల్ రెమ్యునరేషన్ ఇచ్చి బొంబాయి నుండి తీసుకుని రాబడిన అతిలోకసుందరి ఉంది . ఈ సినిమాలో ఆమెను కోదండరామిరెడ్డి అతిలోకసుందరిగానే చూపించాడు . శ్రీదేవి అందానికి దీటుగా కృష్ణ చాలా అందంగా ఉంటాడు ఈ సినిమాలో …

Ads

ఈ సినిమాలో కృష్ణకు మేకప్ మేన్ మాధవరావు . కృష్ణని అంత అందంగా చూపినందుకు నిర్మాత టి త్రివిక్రమరావు సినిమా అయ్యాక ఆ మేకప్ మేన్ మాధవరావుకి అదనంగా డబ్బు ఇచ్చారట . వీళ్ళిద్దరేనా ! శారద కూడా అందంగా కనిపిస్తుంది . సినిమా అంతా హుషారు హుషారుగా , అల్లరి అల్లరిగా , చిలిపి చిలిపిగా , కావలసినన్ని ఢిష్యూం ఢిష్యూంలు , అన్నింటినీ మించి చక్రవర్తి సంగీతంలో కుర్రాళ్ళకు ఊపిచ్చే పాటలు , ఇలా చాలా ఉన్నాయి .

29 సెంటర్లలో వంద రోజులు ఎందుకు ఆడదు ? మా నరసరావుపేటలో కృష్ణ చిత్రాలయలో వంద రోజులు ఆడింది . చాలా సినిమాల్లోలాగానే విలన్లు ఉంటారు . వారి దాష్టీకాలను ఎదిరించేందుకు హీరో ఉంటాడు . అతని వెంట జనం ఉంటారు . హీరో గారికి ఓ హీరోయిన్ జత అవుతుంది . అందరూ కలిసి విలన్లను మట్టుబెట్టి లోక రక్షణ చేస్తారు .

ఏ సినిమా అయినా ఇలాంటి కధల చుట్టే . దానినే ప్రెజెంట్ చేయటంలో రచయిత , దర్శకుడు , ఇతర సాంకేతిక నిపుణుల ప్రతిభ ఉంటుంది . ఈ సినిమా బేసిక్ లైన్ నిర్మాతదే అట . ఆయన ఇచ్చిన బేసిక్ లైన్ని సినిమా కధగా నేసారు పరుచూరి బ్రదర్స్ . బాగా నేసారు .

ఊర్వశి శారదకు తన ప్రతిభను చూపే విధంగా జడ్జి పాత్రను అమర్చారు . చాలా బాగా నటించింది . కోర్ట్ సీన్లు , దొంగ వ్యాపారాలను చేసే విలన్లను ప్రతిఘటించే సీన్లలో హీరో గారి డైలాగులు పరుచూరి బ్రదర్స్ చాలా పదునుగా వ్రాసారు . మధ్యమధ్యలో డ్రైవర్ రాముడు , లారీ డ్రైవర్ సినిమాలు గుర్తుకొస్తుంటాయి .

శ్రీదేవి చేతనే కాదు కృష్ణ చేత కూడా హుషారుగా స్టెప్పులు వేయించిన నృత్య దర్శకులు సలీం , తారలను అభినందించాలి . ఒక్క స్మిత పాట మినహాయించి అన్ని పాటలు కృష్ణ , శ్రీదేవిల మీదే . డబుల్ రెమ్యునరేషన్ని నిర్మాత బాగానే వాడుకున్నాడు . సీనియర్ నిర్మాత కదా !

మంజువాణి ఇంటిలో మేజువాణి బృంద నృత్యంలో కృష్ణ , శ్రీదేవి అదరగొట్టేసారు . కోదండరామిరెడ్డి చాలా అందంగా చిత్రీకరించారు . పూలెట్టి కొట్టమాక పురుషోత్తమా అంటూ సాగే సిల్క్ స్మిత క్లబ్ డాన్స్ బాగుంటుంది . మిగిలిన పాటలన్నీ డ్యూయెట్లే . రా గురూ రా గురూ , అత్తడి అత్తడి అమ్మాడి , నీకు చెక్కిలిగింతలు పెట్ట , శృంగార వీధిలో అంటూ సాగుతాయి . పాటలను అన్నింటినీ వేటూరి వారే వ్రాసారు .

ఇతర ప్రధాన పాత్రల్లో రావు గోపాలరావు , గిరిబాబు , నూతన్ ప్రసాద్ , సత్యనారాయణ , అల్లు రామలింగయ్య , గుమ్మడి , భీమరాజు , చలపతిరావు , అనూరాధ , వరలక్ష్మి , అరుణ్ కుమార్ , శ్రీలక్ష్మి , శ్రీధర్  ప్రభృతులు నటించారు . సత్యనారాయణ , శ్రీలక్ష్మిలకు సరయిన పాత్రలు దొరకలేదు ఈ సినిమాలో .

కృష్ణ బాలసుబ్రమణ్యం అలకలు కొనసాగుతూనే ఉండటం వలన కృష్ణ పాటలను రాజ సీతారామే పాడారు . బాగానే పాడారు . సుశీలమ్మ , జానకమ్మలు ఫిమేల్ వాయిసులు . 100% ఏక్షన్ , మాస్ , కమర్షియల్ ఎంటర్టైనర్ . కోదండరామిరెడ్డి కృష్ణ శ్రీదేవిల కాంబినేషన్లో వచ్చిన మరో మనీ స్పిన్నర్ . యూట్యూబులో ఉంది సినిమా . కృష్ణ , శ్రీదేవి ఆరాధకులు చూడవచ్చు . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగు_సినిమాలు #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దిల్ కా దడ్‌కన్ రకుల్‌కు ఏమైంది..? మెడపై ఆ ప్యాచ్ ఏమిటి..?
  • మై డియర్ ఆర్కే… సలహాలు తీసుకునే స్థితిలో వాళ్లున్నారా అసలు..?!
  • మోకాలిలో బుర్ర కాదు గానీ…. మోకాలి కింద మాత్రం గుండె ఉంటుంది..!!
  • అవును, ఈ దర్శకుడు ఓ సూపర్ హీరోయిన్‌తో ఓ ‘కొత్తలోక’ చూపిస్తున్నాడు…
  • మంజువాణి ఇంటిలో మేజువాణీ… రాతిరంతా ఇక్కడే రాజధాని…
  • జూదం, మద్యం… వీటికన్నా రీల్స్, షార్ట్స్ డేంజరస్… ఇక మీ ఇష్టం…
  • రాజకుటుంబం… బోల్డ్ పాత్రలు, వివాదాలు… ఈమె కథే కాస్త డిఫరెంటు…
  • బ్లాస్టింగ్ కుట్ర కాదు… అసలు కాళేశ్వరం కుట్ర ఏమిటో బ్లాస్టింగ్ నిజాలు…
  • మోహన్‌ లాల్‌లోని ఆ నిజనటుడికి ‘హృదయపూర్వ’క అభినందన..!!
  • తెలుగు ఇండియన్ ఐడల్…! ఈ బుగ్గలు పిండే టాస్కులేంటి థమన్..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions