ప్రపంచవ్యాప్తంగా యాక్టివేటైన ఖలిస్థానీ శక్తులు హిందుత్వంపై విషం చిమ్ముతున్నాయి… రైతుల్ని ముందుపెట్టి ఢిల్లీలో సాగించిన అరాచకాన్ని మనం కళ్లారా చూశాం కదా… గత ఏడాది సెప్టెంబరులో, కెనడాలో కూడా ఒక హిందూ ఆలయం మీద దాడి చేసి, ఆ గోడల మీద ఖలిస్థానీ నినాదాల్ని, హిందూ వ్యతిరేక వ్యాఖ్యన్ని రాశారు… తాజాగా ఆస్ట్రేలియా, మెల్‌బోర్న్‌లో స్వామినారాయణ మందిర్ మీద దాడి చేసి సేమ్ అవే నినాదాన్ని రాశారు… (కెనడాలో దాడికి గురైంది కూడా స్వామి నారాయణ మందిరమే…)
‘సంత్ భింద్రన్‌వాలే అమర్ రహే, మోడీ హిట్లర్, హిందుస్థాన్ ముర్దాబాద్’’ వంటివి పెయింట్ చేశారు… దీంతో ఆ ఏరియాలో నివసిస్తున్న హిందూ సమాజం ఉలిక్కిపడింది… స్వామి నారాయణ మందిరం యాజమాన్యం స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసింది… ‘‘అన్ని మతాల వారితోనూ శాంతిపూర్వక, సహనశీల సహజీవనాన్ని మేం కోరుకుంటాం… కానీ జరిగిన సంఘటన మమ్మల్ని షాక్‌కు గురిచేసింది… ఐనా మేం శాంతి, సహనాల కోసమే ప్రార్థిస్తున్నాం… అని ఓ ప్రకటన జారీ చేసింది…
Ads
నిజానికి కొన్నాళ్లుగా కెనడా, బ్రిటన్ స్థావరాలుగా చేసుకుని, ఖలిస్థానీ శక్తులు బలాన్ని పెంచుకుంటున్నాయి… యాక్టివిటీ బాగా పెరిగిపోయింది… పంజాబ్‌లో మళ్లీ దాని ప్రాబల్యం పెరిగిపోతోంది… ఢిల్లీలోని ఆప్ పార్టీ మద్దతు కూడా లభించడంతో రైతు వ్యతిరేక చట్టాల పేరిట అరాచకపు ప్రదర్శనల్ని, ఆందోళనల్ని, బజారులో అల్లర్లను ప్రేరేపించింది… ఏకంగా ఎర్రకోటపై జెండా ఎగరేశారు… పంజాబ్‌లో అధికారం రావడానికి ఆప్ పార్టీకి ఈ ఖలిస్థానీ శక్తుల మద్దతే కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు…
పంజాబ్‌లో ఏదో ప్రోగ్రాం కోసం వెళ్లిన మోడీని ఓ బ్రిడ్జి మీద దాదాపు నిర్బంధించిన సంఘటన దేశప్రజలను నివ్వెరపరిచింది… ఖలిస్థానీ శక్తుల ప్రథమ శత్రువు మోడీ… మెల్‌బోర్న్ గుడి గోడలపై కూడా మోడీ హిట్లర్ అని పెయింట్ చేశారు… గత సెప్టెంబరులో కెనడాలో ఖలిస్థానీయులు ఓ రెఫరెండమ్ కూడా నిర్వహించారు… ఇదంతా ఖలిస్థానీ అనుకూల ప్రచారం కోసం… హిందువుల్లో భయాన్ని క్రియేట్ చేయడం కోసం… ఎస్ఎఫ్‌జె, సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ ప్రధానంగా యాంటీ ఇండియా యాక్టివిటీ కొనసాగిస్తోంది… సహజంగానే పాకిస్థాన్ నుంచి సాయాన్ని పొందుతోంది…
గత సెప్టెంబరులో కెనడాలో ఖలిస్థాన్ కోరుతూ నిర్వహించిన రెఫరెండమ్‌లో 20 శాతం సిక్కులు పాల్గొన్నట్టు ఓ అంచనా… 2000 కార్లతో ఓ భారీ ర్యాలీ నిర్వహించారు… కెనడాలో పెద్ద ఎత్తున సిక్కు జనాభా నివసిస్తోంది… దాదాపు 8 లక్షల మంది… 2015లో ఏకంగా ఇరవై మంది ఎంపీలు కూడా ఎన్నికయ్యారు… వారిలో నలుగురు జస్టిన్ ట్రాడూ కేబినెట్లో కూడాా చేరారు… ఒంటారియోలో 2.8 శాతం, బ్రిటిష్ కొలంబియాలో 6.4 శాతం జనాభా సిక్కులే…
బ్రిటన్ తక్కువేమీ కాదు… 5.25 లక్షల మంది సిక్కులున్నారు అక్కడ… అమెరికాలో 4.7 లక్షలు, ఆస్ట్రేలియాలో 2.1 లక్షల మంది నివసిస్తున్నారు… దీంతో ఎస్ఎఫ్‌జే యాక్టివిటీకి బలమైన మద్దతు దొరుకుతోంది… ఖలిస్థానీ ప్రత్యేక దేశమే లక్ష్యంగా గతంలో విచ్చలవిడి మారణకాండ అమలుచేసిన ఖలిస్థానీ శక్తులు మరింత బలపడితే పంజాబ్ మళ్లీ అగ్నిగుండం కావడం తథ్యం…!!
Share this Article