ఒక ఖలిస్థానీ నేతను అదుపులోకి తీసుకున్నందుకు వేలాది మంది సిక్కులు పంజాబ్‌లో ఓ పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారు… పోలీసులు, ఆప్ ప్రభుత్వం భయపడిపోయి సదరు నేతను విడిచిపెట్టేశారు… అసలు ఆప్ గెలిచిందే ఖలిస్థానీ మద్దతుదారుల వల్ల..! ఆ నేత పేరు లవ్ ప్రీత్ తుపాన్… తను అమృత్ పాల్ అనే లీడర్‌కు ఫాలోయర్… ఏడాది క్రితం వరకూ ఈ అమృత్ పాల్ ఎవరో ఎవరికీ తెలియదు… ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారిపోయాడు…
యాక్టర్ దీప్ సిద్ధూ మరణం తరువాత ఆయన సంస్థను ఈ అమృత్ పాల్ దాదాపు హైజాక్ చేశాడు… ఖచ్చితంగా ఖలిస్థానీవాదం బాగా పెరిగిపోయింది… కానీ ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ తదితర దేశాల్లో ఉండి వేర్పాటువాద నాయకులు పంజాబ్‌లో ఆపరేట్ చేస్తున్నారు… కానీ అమృత్ పాల్ పంజాబ్‌లోనే ఉండి యాక్టివిటీస్ రన్ చేస్తున్నాడు…
Ads
తను పాకిస్తాన్ ఐఎస్ఐ ఎజెండాను అమలు చేస్తున్నట్టు సిక్కు మేధావులే వాపోతున్నారు… రాను రాను ఖలిస్థానీ శక్తులు ఇంకా బలం పుంజుకుని, పాత రోజులు రాబోతున్నాయని ‘ముచ్చట’ పలుసార్లు పరిణామాల్ని విశ్లేషించింది… ఈమధ్య కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియాల్లో హిందూ గుళ్ల మీద సిక్కు వేర్పాటువాద నినాదాలు రాశారు… ప్రధాని మోడీయే టార్గెట్… కెనడా అయితే మరీ ఖలిస్థానీవాదానికి అడ్డాగా మారింది… ఖలిస్థాన్ మీద రెఫరెండమ్ అనీ, అభిప్రాయ సేకరణ అనీ సిక్కు ప్రజల్లోకి చొచ్చుకుపోవడం మొదలుపెట్టారు… కెనడాలో సిక్కుల జనాభా ఎక్కువ… ఎంపీలు కూడా ఉన్నారు…
మీకు గుర్తుందా..? కేంద్ర మంత్రి హరిసిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా చేసింది… అకాలీదళ్ ఎన్డీయే నుంచి బయటికి వచ్చింది… చాపకింద నీరులా పంజాబ్ అంతటా ఖలిస్థానీ శక్తులు బలం పుంజుకున్నాయి… రైతు చట్టాలను సాకుగా చూపి ఢిల్లీ చుట్టూ బైఠాయించారు… దాని వెను ఖలిస్థానీ శక్తులు ఉన్నాయని అంటే చాలామంది యాంటీమోడీ గుడ్డివాళ్లకు జీర్ణం కాలేదు… తప్పుడు ప్రచారంగా ఎదురుదాడికి దిగారు… ఎర్రకోట మీద వాళ్ల జెండా ఎగరేశారు… వీథుల్లో వీరంగం వేశారు…
వాళ్లకు ఆప్ సపోర్టు… వాళ్లు పంజాబ్‌లో ఆప్‌కు సపోర్టు… వెరసి ఎన్నికల్లో భారీ విజయం… ఎప్పుడైతే రైతు చట్టాలపై మోడీ జాతికి క్షమాపణ చెప్పి, వాటిని వాపస్ తీసుకున్నట్టు ప్రకటించాడో అది ఖలిస్థానీ శక్తులకు తొలి బహిరంగ విజయం… ఎన్నికల్లో ఆప్ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయడం వాళ్ల రెండో విజయం… ఇక అక్కడ ఆప్ ప్రభుత్వమే కావడంతో ఖలిస్థానీవాదానికి పంజాబ్‌లో తిరుగులేకుండా పోయింది… భింద్రన్‌వాలే పీరియడ్ గుర్తుందా..? రోజూ క్రికెట్ స్కోర్‌లాగా హిందువుల హత్యల సంఖ్య పత్రికల్లో వచ్చేది… మళ్లీ ఆ రోజులు గనుక వస్తే అది చాలా దుష్పరిణామాలకు దారితీస్తుంది…
మోడీ ఎక్కడ, ఎన్ని విజయాలు సాధించినా సరే, పెరుగుతున్న ఖలిస్థానీవాదాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాని అయోమయ స్థితిలో పడిపోయాడు… తను ఆమధ్య పంజాబ్‌లో ఏదో ప్రోగ్రాం కోసం వెళ్తే… ఓ ఇరుకు రోడ్డు బ్రిడ్జిపై తన కాన్వాయ్‌ను నిర్బంధించిన తీరు ఆందోళనకరం… స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉండే ప్రధానినే చాలాసేపు రోడ్డు మీదే ఉండేలా చేశారు… ఎన్నెన్నో ఉదాహరణలు… మరి ఖలిస్థానీవాదానికి విరుగుడు ఏమిటి..?!
(మరో విషయం అప్రస్తుతమేమీ కాదు.., ఢిల్లీ ఆందోళనల కారణంగా మృతులంటూ కొన్ని పేర్లు ప్రచారంలోకి తీసుకొస్తే పంజాబ్ ప్రభుత్వమే పట్టించుకోలేదు… కానీ కేసీయార్ తెలంగాణ ఖజానా నుంచి ఆ రైతు కుటుంబాలకు పరిహారం అంటూ చెక్కులు ఇచ్చి వచ్చాడు… పొలిటికల్ ఫాయిదాలను పక్కనబెట్టి ఆలోచించండి… ఎవరికి పాలుపోస్తున్నాం సార్ మనం..?)
Share this Article