Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పూలదండలే కాదు… సినిమా సెలబ్రిటీలపై గుడ్లు, రాళ్లు, టమాటలు కూడా పడతయ్…

January 5, 2023 by M S R

రష్మిక తన బ్రేకప్ హీరో రక్షిత్ శెట్టి గ్యాంగును ఉద్దేశించి ఏదో ఒకటి గోకుతూనే ఉంటుంది… రక్షిత్ స్పందించడు గానీ కాంతార దర్శకుడు రిషబ్ శెట్టి మాత్రం పర్‌ఫెక్ట్ కౌంటర్లు ఇచ్చి రష్మికను ‘ఉల్టా గోకుతాడు’… నేను కాంతార చూడలేదు అని రష్మిక మొదట్లో స్పందించిన దగ్గర్నుంచీ ఈ వివాదం సాగుతూనే ఉంది… ఇదంతా తనకు తన జన్మభూమిలోనే బోలెడంత వ్యతిరేకతను సంపాదించి పెడుతోందనే నిజం కూడా ఆమెకు పగ్గాలు వేయడం లేదు…

ఈ గోకుడు వివరాలన్నీ మళ్లీ ఇక్కడ చర్చించడం అనవసరం గానీ… రష్మికకు హితబోధ చేస్తున్నట్టుగా హీరో కిచ్చా సుదీప చెప్పిన కొన్ని మాటలు మాత్రం బాగున్నయ్… నిజానికి రిషబ్ శెట్టికి కూడా అవి వర్తిస్తాయి… మీడియా ఏం చేస్తున్నదంటే వీలున్నంత వరకూ ఈ వివాదం చల్లారకుండా ప్రయత్నిస్తోంది… హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఎవరు దొరికినా మీడియా వేస్తున్న ప్రశ్న ఈ వివాదంపైనే… వాళ్లు ఏదో స్పందిస్తారు, దాంతో మరింత మసాలా… మీడియాకు, సోషల్ మీడియాకు కథ నడుస్తోంది బాగానే…

Rashmika Mandanna

Ads

రీసెంటుగా ఏదో ఇంటర్వ్యూలో హీరో కిచ్చా సుదీపను మీడియా ఇదే ప్రశ్న వేసింది… ‘అసలు ఏమిటి సార్, రిషబ్ వర్సెస్ రష్మిక రచ్చ… మీడియా వల్లే ఈ వివాదం పెరుగుతుందనే విమర్శ కూడా ఉంది… మీడియా దీన్ని చల్లారనివ్వడం లేదనేది నిజమేనా..? ఇదీ ప్రశ్న… దానికి సుదీప సమాధానమిస్తూ… ‘‘ఇది అదే, అది ఇదే… ఇంతకుమించి ఏముంటుంది..? మీరేమైనా ప్రపంచాన్ని మార్చగలరా..? ఇప్పుడు మీడియా విస్తృతి బాగా పెరిగిన మాట నిజం… ఒకప్పుడు రాజకుమార్ హయాం నడుస్తున్నప్పుడు దూరదర్శన్, రేడియో, పత్రికలు మాత్రమే వారధులు…

తరువాత న్యూస్ చానెళ్లు వచ్చాయి… ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయింది… కొన్నిసార్లు సోషల్ మీడియా ద్వారా కొన్ని తలనొప్పులు కూడా ఫేస్ చేయాల్సి వస్తోంది… నిజమే, కానీ మనమే జాగ్రత్తగా నియంత్రించుకోవాలి… ఈ ఇండస్ట్రీయే అంత… పూలదండలు మాత్రమే కాదు, గుడ్లు టమోటాలు రాళ్లు కూడా పడుతాయ్… అందుకే జనంలోకి ఏం వెళ్తోంది అనేది మనసులో పెట్టుకుని మాట్లాడాలి… సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి..’’

ఇవన్నీ చెబుతూనే రష్మికకు సర్టిఫికెట్ కూడా ఇచ్చాడు… ఇవన్నీ రష్మిక ఎదుర్కోగలదు… పాన్ ఇండియా స్టార్‌గా తను ఎదిగే క్రమంలో కొంత వ్యతిరేకత కూడా ఆమెకు ఎదురవుతుంది… లక్షల్లో ఫాలోయర్స్ కావాలనుకున్నప్పుడు ఇలాంటి చిక్కులు ఉంటయ్… ఐనా ఇవి తను తట్టుకోగలదు అంటున్నాడు… మొదటి నుంచీ సుదీప రష్మిక వెల్‌విషర్… రక్షిత్‌తో బ్రేకప్ సమయంలోనూ ట్రోలింగు, విమర్శలు ఆమెపై దాడి చేయకుండా అండగా ఉన్నాడు… ఇప్పుడు కూడా అంతే, ఇక ఆమెను వదిలేయండిర భయ్ అని చెబుతున్నాడు మీడియాకు, సోషల్ మీడియాకు…! అఫ్ కోర్స్, రిషబ్ గ్యాంగుకు కూడా..!! రేప్పొద్దున కన్నడ ఇండస్ట్రీ గనుక ఆమె సినిమాలపై బ్యాన్ అనే పక్షంలో ఫస్ట్ ఆమెకు అండగా వచ్చేది సుదీపనే..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పేరుకు గోల్డ్ ఫ్లేక్ కింగ్ … గణేష్ బీడీ పొగ… శ్రీశ్రీశ్రీ రాజావారి లంకచుట్ట పొగ…
  • ఇండియాలోకెల్లా హయ్యెస్ట్ పెయిడ్ ఫిమేల్ టీవీ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా..?!
  • వేములవాడ ఆవులు, కోడెల ఉసురు ఎవరికి తగలబోతోంది..?!
  • ఈవారం తెలుగు టీవీ వినోద చానెళ్ల స్థితిగతులు, రేటింగులు ఇవీ…
  • తెలుగు టీవీ న్యూస్ చానెళ్లలో ప్రస్తుతం ఎవరు ఏ ప్లేసులో..?!
  • బాలయ్య దంచూదంచూ అని దరువేశాడు గానీ… దంచికొట్టింది భానుమతే…
  • ఫాఫం అనసూయ..! కాస్త మారిందేమో అనుకున్నారా..? నో, నెవ్వర్..!!
  • ట్రంపుపై మస్క్ పేల్చిన చీకటి బాంబు… అమెరికాలో కలకలం… అసలు కథ ఇదీ…
  • దిక్కుమాలిన క్షుద్రానువాదాలు… దరిద్రపు పర్యవేక్షణ అంటే ఇదే…
  • సిల్క్ స్మిత హర్టయ్యింది… ఆ గ్రేట్ కొరియోగ్రాఫర్ కెరీర్ క్లోజయ్యింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions