Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దేవిశ్రీ… పర్లేదు, తగ్గిపోతుంది… పైత్యానికి ఆయుర్వేదంలో మందులున్నాయి…

April 19, 2023 by M S R

కొట్టరా డప్పు కొట్టు… వన్ టూ త్రీ… అని మధ్య మధ్యలో అరుస్తూ…. చేతవెన్న ముద్ద చెంగల్వపూదండ… ఉప్పుకప్పురంబు నొక్కపోలికనుండు… వంటి పద్యాలు నాలుగు కలిపి కొట్టండి… ఏమో, ఆ పాట సూపర్ హిట్ కావచ్చు… చెప్పలేం… 82.50 కోట్లు ఖర్చు చేస్తే దానికీ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్ వచ్చే ఆస్కారం కూడా ఉంది… జోక్ అనిపిస్తోందా మీకు..? కాదండీ బాబూ…

సల్మాన్ ఖానుడు హిందీలో ఓ సినిమా తీస్తున్నాడు కదా… కిసీకాభాయ్ కిసీకాజాన్… వెంకీ కూడా నటిస్తున్నాడు… తనతో సల్మాన్ చేసిన లుంగీ డాన్స్ యూట్యూబులో చూస్తుంటే చాలామందికి వాంతులు కూడా అయ్యాయన్నారు మరి… ఆ డోస్ సరిపోనట్టుగా… సల్మానుడు ఇంకో పాటలో లుంగీని ఎత్తిపట్టి, హీరోయిన్, వ్యాంప్ కేరక్టర్లలాగే తొడల పైదాకా ఎక్స్‌పోజింగ్ చేస్తూ ఎగురుతున్నాడు… మరొకాయన తన పక్కన కనిపించాడు… వెంకీలాగే ఉన్నాడు… అవును, ఆ రానానాయుడే… ఈ పాట పేరు లెట్స్ డాన్స్ చోటుమోటు…

చెప్పుకోదగిన విశేషం ఏమిటంటే… ఇదీ కాలకేయ తరహా కిలికి భాష వంటిదే… హిందీ, ఇంగ్లిష్, తెలుగు కలిపి కొట్టిన కలగూరగంప… కొట్టరా డప్పు కొట్టు అనే పదాలు మాత్రమే అర్థమయ్యాయి… రెండోమూడో ఇంగ్లిష్ రైమ్స్ యాజ్ ఇట్ ఈజ్‌గా దింపేశారు… ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, మరో రెండు రైమ్స్ దంచి కొట్టారు…

Ads

lets dance

చెప్పనే లేదు కదూ… దీనికి సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్… ఈమధ్య తన పాట తనే పాడాలనీ, తన పాట తనే రాయాలనీ, తనే ఎగరాలనీ బాగా సోకు పెరిగింది కదా… ఆమధ్య ఏదో చిరంజీవి సినిమాలో పీకందుకో, డప్పందుకో అంటూ ఎగిరాడు, తనే రాశాడు గుర్తుంది కదా… ఇప్పుడు ఈ తెలుగిందీ పాటలో హుకింగ్ లైన్స్ తనే రాశాడని సదరు పాట యూట్యూబ్ వివరణ ఘోషిస్తోంది… అసలు ఆ పాటలో వేరే లిరిక్స్ ఏమున్నయ్ మరి..? ఆ హుకింగ్ లైన్స్ ప్లస్ ఇంగ్లిష్ రైమ్స్…

దీనికి మరో విశేషం ఉందండోయ్… దేవిశ్రీప్రసాద్ పైత్యం కొంత రాతలోనే కాదు… పాడాడు… పాటకు సల్మాన్ శృతి కలిపాడు… నడుమనడుమ ర్యాప్ పాడింది హానీసింగ్… దీంతో సాంగ్ కాస్తా బ్రేక్ ఫాస్ట్ కిచిడీలాగా తయారైంది… అంతకుముందు ఓ బతుకమ్మ పాటను పెట్టి, గొబ్బెమ్మలను పెట్టి, తలతిక్క స్టెప్పులు పెట్టి, దాన్నే బతుకమ్మ అనుకొమ్మన్నారు కదా… మనమూ చెప్పుకున్నాం కదా… ఆ వెకిలి లుంగీ డాన్స్‌కు ఇది మరో అదనపు లుంగీ డాన్స్… ఆ లుంగీకి మ్యాచింగ్ నల్లటి షూస్… నల్ల కళ్లద్దాలు… బ్రాండెడ్ షర్ట్… హబ్బ, ఏం వేషం వేయించారు దర్శకా… టేస్ట్ అద్దిరిపోయింది… జిలేబీ, మిర్చి బజ్జీ కలిపి తిన్నట్టు… ఓ వింత టేస్టురా భయ్ మీది…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వీడొక యాదవ సాంబుడు..! లాలూ చెప్పే డొల్ల కుటుంబ విలువలు..!!
  • ఆ చిన్నారులు… ప్రపంచ సుందరిని కలిసిన తరువాత… ఛ, దుర్విధి…
  • ప్రేమతిట్ల సీజన్… మీ దుంపల్‌తెగ… మీరెక్కడ తయారయ్యార్రా బాబూ…
  • ప్రపంచ సుందరికి అయోధ్య సందర్శన అభిలాష… ఓ నేపథ్యం…
  • అధికారంలో ఉంటేనే అవతరణ దినోత్సవాలా కేసీయార్ సాబ్..?!
  • పోలీసులది క్రౌర్యమే, తప్పే… మరి రౌడీ షీటర్లకు రాజకీయ ఓదార్పు..!?
  • ప్రపంచంలోకెల్లా ‘అత్యంత విలువైన’ కూరగాయ… జస్ట్, సొరకాయ..!
  • అన్ని సినిమాల్లోలాగే… పొలిటిషియన్సే విలన్లు… ఎదిరించేవాడే హీరో…
  • మాస్టర్లందరూ కలిసి వండిన ఓ మాస్టర్ పీస్.. ఇద్దరు..!
  • వ్యక్తిగా తనపై బోలెడు అభ్యంతరాలు… కానీ సంగీతంలో అల్టిమేట్ ఇసై జ్ఞాని…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions