Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

…. ఐనా మనిషి మారలేదు, ఆతని కాంక్ష తీరలేదు… అతనే ‘కింగ్ కోహ్లీ’…

April 25, 2026 by M S R

.

ఐనా మనిషి మారలేదు, ఆతని కాంక్ష తీరలేదు… తనివి తీరలేదే, మనసు నిండలేదే… ఇవి పాత తెలుగు సినిమా హిట్ పాటల్లో వాక్యాలు… కానీ నిన్న చిన్నస్వామి స్టేడియంలో కోహ్లీ బ్యాటింగ్ చూస్తుంటే, అతని రికార్డుల వేట చూస్తుంటే అచ్చంగా అవే మాటలు గుర్తొస్తాయి….”

.

Ads

నిన్నటి మ్యాచులో ఔటయ్యాక విరాట్ కోహ్లీ చాలా అసహనంగా కనిపించాడు… సాధారణంగా కోహ్లీ తక్కువ రన్స్‌కు ఔటయిన సందర్భాల్లో కూడా బ్యాట్‌ను పిచ్‌కేసి బాదడం, విసిరేయడం వంటి చేష్టలకు దిగడు… కానీ నిన్న ఎందుకో తీవ్ర అసంతృప్తిని ప్రదర్శించాడు… అలాగని రాంగ్ అంపైరింగ్ ఔటేమీ కాదు, బౌల్డ్…

బహుశా ఐపీఎల్ 9000 రన్స్ మార్క్ చేరుకుంటానని ఆశించాడు కావచ్చు… అలాగే సెంచరీ కూడా చేసేస్తానని అనుకుని ఉంటాడు కావచ్చు… 81 చేశాడు, మరో 11 చేసి ఉంటే 9 వేల రన్స్, ఐపీఎల్‌లో 9వ సెంచరీ చేరుకుని ఉండేవాడు… ఆ జోరు మీద కనిపించాడు కూడా… 184 స్ట్రయిక్ రేట్… తన నిరాశకు అర్థముంది… (నిజానికి తను చేసిన ఆ 81 పరుగులే జట్టును గెలిపించాయి)…

టెస్టులు, వన్డేలు, టీ20ల మాట అటుంచి… ఐపీఎల్‌లోనే 274 మ్యాచులు… 800 ఫోర్లు, 300 సిక్సులు… అసలు మామూలు ట్రాక్ రికార్డు కాదు ఇది… మొత్తం 9 వేల రన్స్‌లో (దాదాపు) 5 వేల పరుగులు కేవలం సిక్సులు, ఫోర్ల ద్వారా వచ్చినవే… బ్రిటన్‌‌లో ఉంటున్నాడు… (ఓవర్సీస్ క్రికెటర్).., పెద్దగా ప్రాక్టీస్ లేదు, దేశీ ట్రోఫీలు ఆడడు… ఐనాసరే, వైభవ్ సూర్యవంశీ (15 ఏళ్లు), ఆయుష్ మాత్రే (18 ఏళ్లు)  వంటి మరీ జెన్-జీ జూనియర్ల నుంచి… అజింక్య రహానే వంటి సీనియర్ మోస్ట్ ప్లేయర్ల దాకా… అందరితో పోటీపడుతూ… 328 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ ఇప్పుడు…

అలుపెరుగని పరుగుల వేట… ఔట్ స్టాండింగ్… ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌లో సీనియర్లు ధోనీ 44 ఏళ్లు, రోహిత్ శర్మ 38 ఏళ్లు… వాళ్లిద్దరూ గాయాలతో ఇక ఈ సీజన్‌కు దూరమైనట్టే… తరువాత ఏజ్‌పరంగా కోహ్లీ, రహానే 37 ఏళ్లతో సీనియర్లు… ఐనా స్టిల్ అదే జోష్… దశాబ్దాలుగా ఆడుతున్నా సరే… ఏమాత్రం జోరు తగ్గని అదే ఆట… (రహానే ఫామ్‌లో లేడు)… ఆల్రెడీ సంజూ శాంసన్ (2), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, డికాక్, సాయి సుదర్శన్ సెంచరీలు సాధించేశారు ఈ సీజన్‌లో…

తను సెంచరీకి దగ్గర దాకా వచ్చి, బాగా సెటిలై ఉన్న స్థితిలో ఔట్ కావడం… పైగా తనకు అచ్చొచ్చిన బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో వేలాది మంది సెంచరీ కోసం ఎదురుచూస్తున్నవేళ బౌల్డ్ అయిపోవడం… అదుగో అందుకని ఆ అసంతృప్తి బలంగా వ్యక్తమైంది తన నుంచి..! వ్యక్తిగత నిరాశే కాదు, తనను నమ్ముకున్న వేలాది మంది అభిమానులకు ఏదో ఇవ్వలేకపోయాననే ఒక ఎమోషనల్ రిగ్రెట్ కూడా… నిన్నటిదే ఈ గ్రౌండ్‌లో ఆర్సీబీకి ఈ సీజన్‌కు చివరి మ్యాచ్…

మొత్తం పరుగుల సంఖ్యలో ఎక్కువ, ఆరెంజ్ క్యాప్… కానీ సెంచరీ కావాలని కసి, ఆకలి… టెస్టులు, టీ20లకు దూరమైనా సరే… ఈరోజుకు తనలో తగ్గని ఆ జోష్ విశేషమే… అందుకే తను ఇండియన్ క్రికెట్‌లో… కాదు, కాదు, వరల్డ్ క్రికెట్‌లో ‘కింగ్ కోహ్లీ’..!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమో… ఎవరికి తెలుసు..? మనలో ఎన్ని బొద్దింకలు ఉన్నాయో…!
  • మంచు మేఘాలు తొలిగితేనే… కాంచనగంగ శిఖర దర్శనం… గొప్ప మూవీ…
  • Madhuvidhu … క్లీన్ ఫ్యామిలీ కామెడీ మూవీ..! మన జంధ్యాల గుర్తొస్తాడు..!
  • రియల్ సూపర్‌స్టార్ కృష్ణను సరిగ్గా ఆవిష్కరించిన కథనం ఇది..!!
  • ఆ బుడ్డోడు వైభవ్ మాత్రమే కాదు… ఈ గొప్పోడు కూడా గుర్తుకురావాలి…
  • దొందూ దొందే… నాగేశ్వర్- పవన్ కల్యాణ్… తెలంగాణకు అక్కర్లేని కేరక్టర్లు…
  • ఇక నీ కెరీర్ క్లోజ్ అన్నారందరూ… ఈమె అస్సలు లెక్కచేయలేదు…
  • ప్చ్, ఏం చేస్తాం..? జపానోడికి మన మామిడి తినే యోగం లేదు..!!
  • రేవంత్ సవాల్‌కు బీఆర్ఎస్ వద్ద జవాబు లేదు..! కిక్కుమనరు..!!
  • KCR పాలన బాపతు ఆ గ్లోబరీనా… కొత్త పేరుతో మళ్లీ పిల్లల జీవితాలతో ఆటలు..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions