తెలుగు తల్లిదండ్రుల్లోనే కాదు, చిరంజీవి- రాంచరణ్‌లు తెలిసిన సర్కిళ్లు, ఇండస్ట్రీ సర్కిళ్లలోనూ ఓ చర్చ… చిరంజీవి మనమరాలు, రాంచరణ్-ఉపాసనల బిడ్డ పేరుకు అర్థమేమిటి..? గూగుల్‌లో కూడా విపరీతంగా వెతుకుతున్నారు… లలిత సహస్ర నామాల నుంచి ఈ పేరు తీసుకున్నట్టు పాప తాత చెబుతున్నాడు…
the name signifies a transformative, purifying energy that brings about a spiritual awakening …. ఇదీ ఆ పేరుకు వాళ్లు చెప్పిన అర్థం… అర్థమయ్యీ కానట్టు గందరగోళంగా ఉన్నట్టుంది కదా… గూగుల్ అనువాద ప్రక్రియలో ఇది… ‘‘పేరు ఆధ్యాత్మిక మేల్కొలుపును తీసుకువచ్చే పరివర్తన, శుద్ధి చేసే శక్తిని సూచిస్తుంది’’…. అమ్మో, ఇది ఇంకా గందరగోళంలో ఉంది అంటారా..? సరే, అసలు అదేం పదమో తెలుసుకుందాం…
Ads
వాళ్ల నామకరణ పత్రంలో కూడా క్లిన్ కారా అని రాశారు… పిల్లల పేర్లంటే అందరికీ ఆసక్తి ఉంటుంది కదా… పైగా ఇదేదో ఎలిజబెత్, క్లియోపాత్ర టైపులో ఎవరైనా ఫేమస్ ఇంగ్లిష్ పేరేమో అనుకున్నారు చాలామంది… పేరుకు లలిత సహస్ర నామాల నుంచి తీసుకున్నట్టు చెబుతున్నారు అనే డౌటనుమానం కూడా ఉంది కొందరిలో…
నిజమే, వాళ్లు చెప్పినట్టు లలిత సహస్ర నామాల నుంచే తీసుకున్నారు ఈ పేరు… కానీ అమ్మవారికి బోలెడు లలితమైన పదాలు ఉన్నాయి కదా, పోయి పోయి ఎవరినీ నోరు తిరగని పేరు, ఇంగ్లిషు పేరును సూచించే పదాల్ని ఎందుకు ఎంచుకున్నారనేదేనా మీ డౌట్… అవునండీ, వాళ్ల బిడ్డ వాళ్లిష్టం… యూనిక్ నేమ్ కావాలి… ఎవరికీ పెట్టి ఉండకూడదు… అందుకని దీన్ని ఎంచుకుని ఉంటారు… లేదా అమ్మాయి జాతకం ప్రకారం క అక్షరంతో కావాలని వెతికి ఉంటారు…
నామకరణం మాత్రం సింపుల్‌గా బట్ట ఊయలలో వేసి నిర్వహించినట్టున్నారు… గుడ్… వెరయిటీ… ఇంతకీ ఆ పేరుకు అర్థమేమిటి..? పరమార్థమేమిటి స్వామీ అనడిగితే… సెలబ్రిటీ జ్యోతిష్కుడు వేణుస్వామి, ధర్మపురి జ్యోతిష్కుడు గొల్లపల్లి సంతోష్ కుమార్ శర్మ చెప్పిన వివరణ ఏమిటయ్యా అంటే… ‘‘అది క్లీన్ కాదు, రఫ్ కాదు, ఇంగ్లిష్ పేరు అంతకన్నా కాదు… క్లీన్ కార కాదు, కార-చుడువా కూడా కాదు… అది క్లీంకారా… తెలుగు, సంస్కృతం తెలియని వాళ్ళ నోళ్లలో పడి క్లీన్ కార, క్లీన్ కరో అయ్యింది… శ్రీం అంటే లక్ష్మి బీజం, హ్రీం అంటే శక్తి,/ మాయ బీజం, క్లీం అంటే కామ బీజం, ఐమ్ జ్ఞాన బీజం… మంచి పేరు, కాకపోతే క్లీంకారా అని ఉచ్ఛరిస్తేనే, రికార్డుల్లో అలా రాస్తేనే మంచిది’’ అని వివరించారు… అదండీ సంగతి…!!
Share this Article