Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కోవిషీల్డ్, కోవాక్సిన్… భయమొద్దు.,. ఇవీ వాటి తయారీలో తేడాలు…

May 2, 2024 by M S R

Jagan Rao….. వ్యాక్సిన్ పంచాయతీ మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. అసలు కొవీషీల్డ్ వ్యాక్సిన్ అయినా, కోవాక్సిన్ వ్యాక్సిన్ అయినా ఎలా తయారు చేశారు..?

నేను చికాగో యూనివర్శిటీ, అమెరికాలో Ph.D చేస్తున్నప్పుడు వైరాలజీ కోర్స్ ఒక సెమిస్టర్ చదవాలి. దానిలో భాగంగా 10 కంటే ఎక్కువే వ్యాక్సిన్స్ తయారు చేశాను. నేనే కాదు, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, వైరాలజీ మాస్టర్ స్టూడెంట్ ఎవరైనా 2 రోజుల్లో వ్యాక్సిన్ తయారు చేయవచ్చు.

మొదట కోవాక్సిన్ వ్యాక్సిన్ ఎలా తయారు చేశారు అనేది చూద్దాం. కరోనా వైరస్ ని తీసుకొని దాని మీద గట్టి బండరాయితో లేదా సుత్తితో కొట్టి చంపి దాన్ని మన శరీరంలో ప్రవేశపెడితే అదే కొవాక్సిన్. సుత్తితో కొట్టటానికి అది కనపడదు కాబట్టి కరోనావైరస్ తీసుకొని దాన్ని ఫార్మాల్డిహైడ్ అనే ద్రావణంలో ముంచుతారు (అందువల్ల అది ఇన్ యాక్టివ్ లేదా చచ్చిపోతుంది), అదే కోవాక్సిన్ .

Ads

చచ్చిపోయిన కరోనా వైరస్ నే మనం కోవాక్సిన్ అంటున్నాం. కోవాక్సిన్ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు మన శరీరం బతికి ఉన్న వైరస్ వచ్చింది అనుకొని యాంటీ బాడీస్ ఉత్పత్తి చేస్తుంది. భవిష్యత్ లో నిజమైన వైరస్ వచ్చినా వ్యాక్సిన్ తీసుకోవటం వలన మన శరీరంలో ఉత్పత్తి అయిన యాంటీ బాడీస్ వాటిని జుట్టుపట్టుకొని నేలకేసి కొట్టి చంపేస్తాయి.

ఇంకా కోవిషీల్డ్ విషయానికి వద్దాం. కరోనా వైరస్ ని తీసుకొని దానిలో హానికర జన్యుపదార్దాన్ని తీసివేసి సాధారణ జలుబుని కలిగించే అడినో వైరస్ యొక్క జన్యుపదార్దాన్ని కరోనా వైరస్ యొక్క జన్యుపదార్ధంకి బదులు ప్రవేశపెడతారు. దీన్ని రీకాంబినెంట్ టెక్నాలజీ అంటారు. ఆ విధంగా తయారు చేసిందే కోవీషీల్డ్ వ్యాక్సిన్.

కోవాక్సిన్ అయినా, కోవీ షీల్డ్ అయినా – వ్యాక్సిన్ తీసుకున్న మొదట 30 నిమిషాలు అబ్సర్వేషన్ లో పెడతారు. వ్యాక్సిన్ తో ప్రమాదం ఏమీ ఉండదు కానీ ఆ వ్యాక్సిన్ తో కలిపి ఇచ్చే కెమికల్స్ లేదా ద్రావణాలు కొందరికి పడవు, అందుకే అబ్సర్వేషన్ లో ఉంచి గమనించాలి.

వ్యాక్సిన్ అనే కాదు – ఇంజక్షన్ తీసుకున్నా, ట్యాబ్లెట్ అయినా 100 కి 100 శాతం అందరికీ పడవు వాటిల్లో ఉండే కొన్ని కెమికల్స్. ప్రతి దానిలో ఏ కెమికల్ వాడారు లేదా ఏ ద్రావణం వాడారు అనేది క్లియర్ గా ఉంటుంది. మొదట రెండు వారాలు లేదా మ్యాగ్జిమం 30 రోజుల్లోనే తెలుస్తుంది ఏవైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటే.

నేను కోవాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నప్పుడు రెండు మూడు రోజుల్లో ఎలర్జీలాగా వచ్చింది. రెండో డోసప్పుడు వెళ్ళి నర్స్ ని కర్టెయిన్ వేయమని చెప్పా. కర్టెయిన్ తీసుకొని వచ్చా, అంతే సర్టిఫీకేట్ వచ్చింది. అదేంటో మూడోసారి పోకపోయినా బూస్టర్ డోస్ తీసుకున్నట్లు నమోదు అయ్యింది.

ఏది ఏమైనా ఆల్ రడీ తీసుకున్న వ్యాక్సిన్ విషయం లో 100 కి 100 శాతం ఎవరూ ఇసుమంత కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆకుకూరలు మంచివే కానీ ప్రతి రోజూ తింటే యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. యాపిల్స్ మంచివే కానీ సర్జరీ అయినప్పుడు తింటే గ్యాస్ పెరుగుతుంది. పప్పు మంచిదే గాయం అయినప్పుడు తింటే చీము పెరుగుతుంది. వ్యాక్సిన్ అనే కాదు ప్రతి ఆహార పదార్ధంలో ఉండేది కెమికల్సే, కొన్ని కొందరికి పడతాయి, కొందరికి పడవు.

గమనిక: కోవిడ్ కి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న 10 వ్యాక్సిన్స్ లో నేను 5 వ్యాక్సిన్స్ డేటా మీద పని చేశా. ఇంకా 10 వేలకి పైగా క్లినికల్ ట్రయిల్స్ డేటా మీద పని చేశా. క్లినికల్స్ ట్రయిల్స్ జరిగినప్పుడు ఆ డేటా మా దగ్గరికి వస్తుంది. దాన్ని అనలైజ్ చేసి వాటిని ఆమోదించే ప్రభుత్వ ఏజన్సీలకి రిపోర్ట్స్ పంపటం నేను చేస్తున్న పని గత 16 యేండ్లుగా…….. – పూర్తి వ్యక్తిగత అభిప్రాయం

(కోవిషీల్డ్ కొన్ని సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ కొందరిలో ఉంటాయని అంగీకరించిన నేపథ్యంలో కోవాక్సిన్ కూడా ఓ ప్రకటన జారీ చేస్తూ… తమ వేక్సిన్‌తో అలాంటి ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవనీ, పూర్తి ప్రయోగ ఫలితాలు నిర్ధారించుకున్నతరువాతే రిలీజ్ చేశామని చెబుతోంది…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మేడారంపై ప్రభుత్వ వీడియో… అందులో కాపీ కంటెంటు… ఓ వివాదం..!!
  • జననాయగన్..! విజయ్ సినిమా సెన్సార్ సమస్యలకు రాజకీయ రంగు..!!
  • రాజా సాబ్‌కు మరో అప్రతిష్ట… నాచే నాచే ట్యూన్ పక్కా చోరీ అట..!!
  • నాటో భవిష్యత్తు అటో ఇటో..! ప్రపంచ రాజకీయాల్లో పెనుమార్పులు..!!
  • సంక్రాంతి కంబాలా పోటీలో మరో హీరో ‘మునిగిపోయాడు’… సెకండ్ వికెట్..!!
  • ఎనర్జీ డిప్లొమసీ..! ఇండియా మౌనం వెనుక ‘చమురు వ్యూహాలు’..!!
  • కొన్ని సినిమా ప్రయోగాల్ని రామోజీరావే చేయగలిగాడు… కానీ..?
  • అస్తవ్యస్తత..! సినిమాలపై తెలంగాణ ప్రభుత్వ విధానరాహిత్యం..!!
  • ఇక్కడ అత్యంత భారీ విగ్రహం… అక్కడ ఓ జ్ఞాపకం తెగనమ్మకం…
  • బెంగాల్ ‘శివగామి’ స్ట్రీట్ ఫైట్… ఆ ఆకుపచ్చ ఫైలులో అసలు మర్మమేంటి..!?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions