కొన్నిసార్లు అంతే… మామూలుగా చెబితే నమ్మం… కానీ అధికారిక గణాంకాల్లో చెబితే ఇక నమ్మక తప్పదు… అలాంటి నమ్మలేని నిజమే ఇది… నిన్నటి పాకిస్థాన్- ఇండియా టీ20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచులో విరాట్ కోహ్లీ చేసిన పరుగుల తీరు, వాటి ప్రాధాన్యం, ప్రత్యేకించి ఆ చివరి ఓవర్ మీద ఈరోజుకూ ప్రపంచ క్రికెట్‌లో చర్చలు సాగుతూనే ఉన్నయ్…
పాకిస్థాన్‌తో ఆట అంటే ఇండియన్ క్రికెట్ ప్రేమికులకు ఓ ఆట కాదు… ఓ ఉద్వేగం… చాన్నాళ్లుగా క్రికెట్ మ్యాచులు చూడటం మానేసినవాళ్లు సైతం నిన్న టీవీల ఎదుట కూర్చున్నారు… ఓ దశలో ఇండియా ఓడిపోయే స్థితి కనిపించినా సరే, పలుసార్లు ఇండియాతో గెలుపు దోబూచులాడినా సరే, కోహ్లీ ఆటను చూస్తూ కూర్చున్నారు… పాత కోహ్లీని చూడటం ఆనందం కదా… ఆటలో గెలుస్తామా ఓడిపోతామా అనేది వేరే సంగతి…
మరి దీపావళి షాపింగ్ సంగతేమిటి అంటారా..? సాధారణంగా దేశమంతటా దీపావళికి షాపింగ్ ఎక్కువ… వెండి, బంగారంతోపాటు వాహనాలు, ఇంట్లోకి కొత్త వస్తువులు, స్వీట్లు, చివరకు ప్రమిదల వరకూ… ఆన్‌లైన్ షాపింగ్ టర్నోవర్ కూడా చాలా ఎక్కువ… అయితే పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆరంభమై, ఆ జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పెద్దగా ప్రేక్షకులు పట్టించుకోలేదు… అప్పటిదాకా జోరుగా సాగుతున్న షాపింగ్ తగ్గింది, కానీ ఎప్పుడైతే ఇండియా బ్యాటింగ్ స్టార్టయిందో కథ మారిపోయింది…
Ads
పైన చార్టు చూశారు కదా… యెల్లో కలర్‌లో కనిపిస్తున్నది సాధారణంగా షాపింగ్ సాగుతున్న తీరు… యూపీఐ లావాదేవీలు… ఆన్‌లైన్ చెల్లింపులు… ఎప్పుడైతే మ్యాచ్ స్టార్టయి పాకిస్థాన్ బ్యాటింగ్ స్టార్టయిందో ఇక షాపింగు ఆపేశారు జనం… ఇక ఇండియా బ్యాటింగ్ మొదలై, కోహ్లీ బ్యాట్ ఝలిపించడం మొదలు పెట్టాడో ఇక యూపీఐ లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి…
మ్యాచ్ అయిపోయిన మరుక్షణం మళ్లీ యధావిధిగా షాపింగు జరిగిన తీరును కూడా ఈ చార్టులో చూడొచ్చు… మరి క్రికెటా మజాకా..? పైగా కోహ్లీ ఫామ్‌లోకి రావడం, అందులోనూ పాకిస్థాన్ మీద గెలవడం… దీపావళి ఒకరోజు ముందే జరుపుకుంది ఇండియా… అంతే మరి, ఆ ఉద్వేగానికి వివరణలు, విశ్లేషణలు ఉండవ్…
Share this Article