Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గడీలోకి వెళ్తే మరో జీవన్‌రెడ్డి – కాషాయం ఇక రానివ్వదు – మరేమిటి..?!

July 2, 2026 by M S R

.

కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి… ఏమంటున్నాడు..? ‘సీఎం రేవంత్ ఒంటెద్దు పోకడలు, షో ఆఫ్ సర్కారు, సీనియర్లకు నో రెస్పెక్ట్, పార్టీలో కొత్తవారిదే హవా, యాదగిరిగుట్ట ట్రస్టు బోర్డు విషయం నాకు చెప్పలేదు, నేనూ యాదాద్రి జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేనే… ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు కనుమరుగు అవుతున్నారు’’

ఆశ్చర్యం ఏమిటంటే..? ఒరిజినల్ కాంగ్రెస్ అంటే ఎవరు..? తనయితే ఖచ్చితంగా కాదు, మధ్యలో కాషాయం కప్పుకుని, ఐదేళ్లు బీజేపీకి ఉద్దరించాడు… సో, తను కాంగ్రెస్‌కు కొత్తవాడు కాదు, సోకాల్డ్ సీనియర్ కాదు, ఒరిజినాలిటీ వర్తించదు… సో, సీనియర్లను నో రెస్పెక్ట్ అనేది తనకు సంబంధం లేదు…

Ads

కొత్తవారిదే హవా అంటున్నాడు… అది కాంగ్రెస్, వచ్చేవాళ్లు వచ్చెదరు, పోయేవాళ్లు పోయెదరు… అదొక అనేక ప్రవాహాల సంగమం… ఇప్పుడు కోమటిరెడ్డి బయటికి వెళ్లిపోతాను అని బెదిరించినా … ప్లీజ్, ఆగు అనేవాళ్లు ఉండరు… అది కాంగ్రెస్ సహజ లక్షణం… ఐనా, మంత్రి పదవి ఇవ్వకపోతే రాళ్లు రువ్వాలా..? ఇద్దరు అన్నదమ్ములకూ అమాత్య పదవులు కావాలా..? బోలెడు మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు కదా, వాళ్లకన్నా నువ్వేం మిన్న..? ఆల్రెడీ మీ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు కదా..!!

  • టు బి ఫ్రాంక్… ఇస్తే గిస్తే బీసీలు, ఎస్సీలు, ఎస్టీల నుంచి కమిటెడ్ నాయకులకు ఇస్తే పార్టీకి ఉపయోగం… సామాజిక న్యాయం కూడా… బీసీల్లో కూడా ఎంబీసీల నుంచి ఒకరికి చాన్స్ ఇస్తే ఇంకా బెటర్ కూడా…

నో, నో, నేనేమిటి, నా పదవుల మాటేమిటి, నేను తోపును, ఉండలేను అనుకుంటే ఏమవుతుంది? మరో జగిత్యాల జీవన్‌రెడ్డి అవుతాడు… వచ్చెయ్ అన్నా, నీకు పార్టీలో కీలక పదవి, అసలు పార్టీయే నీదనుకో, కుమ్మెయ్ అన్నాడు కదా కేసీయార్ ఓపిక  చేసుకుని, చేరిక సభకు వచ్చి… అయిపాయె, ఈరోజుకూ మళ్లీ జీవన్‌రెడ్డి పేరు వినిపించింది లేదు… వినిపించదు కూడా…

అది కేసీయార్ కుటుంబ పార్టీ… కేటీయార్, హరీష్ రావు తప్ప ఇంకెవరైనా సరే, అణిగిమణిగి దొర సేవలో తరించాల్సిందే… లేకపోతే బయటికి వెళ్లిపో… అంతే… నిజానికి రాజగోపాలరెడ్డికి అది బాగా తెలుసు… అందుకే బయటికి వెళ్లడు… చేరాలి అనుకుంటే బీఆర్ఎస్ ఘన స్వాగతం పలికి, నువ్వూ ఓ జీవన్‌రెడ్డివే ఫో అని వదిలేస్తుంది… బీజేపీ ఇక చాల్లే మహాప్రభో అని దండం పెడుతుంది…

మరీ కవిత పార్టీలోకి పోలేడు… సో, కాంగ్రెసే శరణ్యం… అందుకే నిత్య అసంతృప్తవాదిగా, ఎమోషనల్ బ్లాక్‌మెయిల్… సోదరుడితోనూ పడటం లేదు… ఇవన్నీ పక్కన పెడితే… యాదగిరిగుట్ట ట్రస్టు బోర్డు విషయానికి వద్దాం… రేవంత్ రెడ్డి చాలా తెలివిగా సభ్యుల్ని ఎంపిక చేశాడు… ఒక్క కొణిదెల సురేఖ నియామకం తప్ప…

స్థానిక రాజకీయాలు ట్రస్టు బోర్డులో చేరితే అదెంత పంకిలం అవుతుందో తెలుసు తనకు… అందుకే లోకల్ లీడర్లను పూర్తిగా మినహాయించాడు… థాంక్ గాడ్ అంటే, థాంక్ నర్సింహస్వామీ… ఇక ప్రతి ఎమ్మెల్యేను సంప్రదించి ట్రస్టు బోర్డు వేస్తే, అది ఓ డీసీసీ కార్యవర్గం అయి ఉండేది… పది మంది చేతులు పెడితే, నర్సింహస్వామిని అక్కడి నుంచి వెళ్లగొట్టేదాకా నిద్రపోరు… ఈ కోణంలో రేవంత్ రెడ్డి ఎంపికలు గుడ్, బెటర్…

ఎస్, కొణిదెల సురేఖ ఎంపిక బాగోలేదు… తన మరిది పచ్చి తెలంగాణ వ్యతిరేకి, పైగా బీజేపీ కూటమి భాగస్వామి, తన భర్త సమైక్యవాది, తెలంగాణ స్వరాష్ట్రానికి వ్యతిరేకంగా పార్లమెంటులోనే మాట్లాడి, చివరకు ఇదే యాదగిరిగుట్టకు ఒక్కసారి కూడా వెళ్లని వ్యక్తి… రూపాయి విదిల్చేవాడూ కాదు…

రాజగోపాలరెడ్డి దగ్గరకు వద్దాం… రేవంత్ రెడ్డిని గోకడానికి తన మీటింగులకు హాజరు కాడు, Who Cares? మొన్న కూడా రాలేదు… ప్రభుత్వ విధానాలు ఒక తీరు అయితే తన మునుగోడులో తన రాజ్యాంగం అంటాడు, లైక్ మద్యం షాపులపై తన ఆంక్షలు…

మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీద ఇష్టారాజ్యం విమర్శలు చేస్తుంటే, పార్టీకి నష్టం జరుగుతుంటే… పీసీసీ ఏం చేస్తున్నట్టు..? క్రమశిక్షణ కమిటీలు ఏం చేస్తున్నట్టు..? ఇదీ అసలైన విషాదం!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • AI పై సంచలనం… చూడబోతే కల్కి 2042…13 గంటల్లో 7 కోట్ల రీచ్ ట్వీట్ !!
  • ఇప్పటి ప్రపంచాన్ని ఏడు దశాబ్దాల క్రితమే ఊహించారు ఈ రచయితలు!
  • నోరా, నీది నోరేనా..? ఓ ఎయిర్‌లైన్స్ రుసరుస- 3 కోట్లకు కేసు !!
  • దొరహంకారం !! చావు డప్పుల బాటకు శుద్ధి !! ఇది మరింత అవమానకరం !!
  • శాసనసభకు స్పీకరే సుప్రీమ్ – చాలామందికి తెలియని ఓ ఇంట్రస్టింగ్ కేసు !!
  • నువ్వు చూడకపోవడమా..? ‘ఆమె’ కనిపించకపోవడమా..? ఏది బ్రహ్మచర్యం !!
  • బర్తరఫ్ వైపే ! లేటయినా గట్టిగానే కొట్టే ప్రొసీజరల్ అడుగులు !!
  • ముంతాజ్ పేరు మార్చుకుంది ! వైసీపీ ‘స్వరం’ మారింది ! అంతా మాయ !!
  • ఇదేమైనా అట్లాస్ సైకిలా..? 40 రోజులకు ఓ వార్‌షిప్ నిర్మించడానికి !!
  • ఖడే హనుమాన్ ! భారీ యంత్రాలెన్ని తెచ్చినా ఇంచ్ కదలని విగ్రహం !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions