Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కొమ్మూరి యుగంధర్ – అప్పట్లో పాఠకుల్ని ఉర్రూతలూగించిన పేరు !!

October 26, 2026 by M S R

.

1983-84 ప్రాంతంలో పంజాబ్ తీవ్రవాదం నేపథ్యంలో అర్ధరాత్రి పిలుపు అనే నవల రాశాడు ప్రఖ్యాత తెలుగు డిటెక్టివ్ నవలా రచయిత కొమ్మూరి సాంబశివరావు… .ఇందులో భారత ప్రధాన మంత్రిని అతని అంగరక్షుకుడే చంపబోతే డిటెక్టివ్ యుగంధర్ అడ్డుపడి రక్షిస్తాడు… ఇది రాసిన మూడు నాలుగు నెలల్లో అప్పటి ప్రధాని ఇందిర జరిగింది.. కాకతాళీయం… కానీ..?

వర్తమాన రాజకీయ, సామాజిక ధోరణుల్లో ఏయే ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉందో ఊహించడం, ముందుచూపు కొమ్మూరి రచనల్లో ప్రధానంగా కనిపిస్తుంది… అది విశేషం… ఇప్పుడు ఎందుకు చెప్పుకోవడం అంటే..? ఈరోజు ఆయన శతజయంతి… ఒకప్పుడు తెలుగు పాఠకుల్ని ఉర్రూతలూగించిన డిటెక్టివ్ నవలారచనలో తను అగ్రగణ్యుడు కాబట్టి…

Ads

సాధారణంగా మధుబాబు రచనల్లో ఆంగ్ల నవలల పోకడలు, యాక్షన్ పార్ట్, మరీ తెలుగు సినిమా హీరోల పోకడలు ఉంటాయి… కానీ కొమ్మూరి రచనల్లో పరిశోధన, మైండ్ గేమ్ కనిపించేవి… కొమ్మూరి సాక్షాత్తూ చలం తమ్ముడి కొడుకు… చిన్న సైజులో 100 నుంచి 150 పేజీలు ఉండేవి తన పుస్తకాలు… నవలలు కాదు, నవలికలు!!

నవల టైటిలే వెరయిటీ… దాదాపు 90 నవలలు రాస్తే అందులో నెం. 111 లాంటి సీరియల్ నంబర్లతో వచ్చే నవలలు సుమారు 15కి పైగా ఉన్నాయి… తొలి తెలుగు హారర్ నవల తనదే… తొలి తెలుగు డిటెక్టివ్ నవల కూడా తనదే… తను బేసిక్‌గా ఓ జర్నలిస్టు… సొంతంగా రెండుమూడు పత్రికల్ని కూడా నడిపాడు… కానీ డిటెక్టివ్ నవల రచయితగానే ప్రసిద్ధుడు…

kommuri sambashivarao

అధికశాతం తన నవలల్లో కథానాయకుడు ప్రైవేటు డిటెక్టివ్… చెన్నై బేస్డ్… పేరు యుగంధర్… నేరపరిశోధనలో లాజిక్, ఓర్పు, ప్రొఫెషనలిజం, మైండ్ అప్లయ్ ఎలా ఉండాలో తన నవలలు చెప్పేవి… కొమ్మూరి నవల అనగానే వెంటనే డిటెక్టివ్ యుగంధర్, అతని సహాయకుడు రాజు, పోలీసు ఇన్ స్పెక్టరు స్వరాజ్య రావు, సార్జెంట్ శివం పాత్రలు గుర్తొస్తాయి…

ఆయన కొడుకు కోరిక మేరకు ఎమెస్కో పబ్లిషర్స్ కొమ్మూరి నవలల్ని దాదాపు 60 వరకూ రీప్రింట్ చేసి, ఓ మొత్తం ప్యాకేజీగా మార్కెట్‌లోకి విడుదల చేశారు… అవి కొమ్మూరిని తెలుగు కొత్త తరం పాఠకులకు పునఃపరిచయం చేశాయి… సాధారణంగా డిటెక్టివ్, నేరపరిశోధన రచనలు అనగానే హత్యలు, దోపిడీ కేసుల కథలే ఉండేవి… కానీ కొమ్మూరి రచనల్లో చైనా, పాకిస్థాన్ వంటి ఇండియా శతృదేశాల కుట్రలు కూడా చోటుచేసుకునేవి…

కొమ్మూరి హీరో యుగంధర్ అనగానే గుర్తొచ్చే రూపం తెలుగు విఖ్యాత నటుడు ఎస్వీ రంగారావు… ఆ రూపం, ఆ గాంభీర్యం, నిండైన విగ్రహం… నిజానికి యుగంధర్‌ను ఎస్వీ రంగారావును దృష్టిలో పెట్టుకునే క్రియేట్ చేశానని కొమ్మూరే చెప్పుకున్నాడు… ఎస్వీఆర్ తన అభిమాన నటుడు… అంతేకాదు, కొమ్మూరి రాసిన X 303Y అనే టైటిల్ తో వచ్చిన నవలలో ఎస్వీఆర్ ఓ కీలకమైన పాత్రలో క్లైమాక్స్ ట్విస్ట్ లో ఎంట్రీ ఇస్తాడు…

సినిమాల్లో గెస్ట్ రోల్ లో సర్పైజ్ ఇచ్చినట్లుగా ఎస్వీ ఎంట్రీ సర్పైజ్ ఉంటుంది… నిజానికి నవలల పరంగా ఓ కొత్త ప్రయోగం… నవల చదివిన వాళ్లంతా ఎస్వీ పాత్రకు ఆశ్చర్యపోతాం… ఎందుకంటే కథలో అదే మెయిన్ ట్విస్ట్… కొమ్మూరి రాసిన ఆ నవల ఆధారంగా ఓ సినిమా వచ్చి ఉంటే, అందులో ఎస్వీఆర్ నటించి ఉంటే బాగుండేది… అది నెరవేరలేదనే బాధ కొమ్మూరి మాటల్లోనూ ధ్వనించేది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కొమ్మూరి యుగంధర్ – అప్పట్లో పాఠకుల్ని ఉర్రూతలూగించిన పేరు !!
  • రేవంత్ ప్రయత్నాలకు ఫడ్నవీస్ పాజిటివ్- ఇక కిషన్ రెడ్డి ఏం చేస్తాడో ..!?
  • మొద రాత్రి! ఇది కేయాస్ నేరేటివ్… అంటే గందరగోళమే కథ ముడిసరుకు!!
  • నల జిలుకర మొగ్గ – కాలంతోపాటు మారితేనే ఏ కళకైనా మనుగడ !!
  • వడివేలు వంద కోట్ల భవనం.. కుటుంబం కోసమా? సంపదకు భద్రతా?!
  • గజబ్ రాత్ ! కథ గజబ్… కథనమే గజిబిజి… అనేక మలుపుల చిక్కుముడి !!
  • అల్లుడు అలిగాడు… రచ్చకెక్కిన రాధాకృష్ణ ఇంటి కలహాలు… కానీ..?
  • చిరంజీవిని వద్దన్నారు – ఓ కొత్త నటుడిని పట్టుకొచ్చారు… కానీ..?
  • పర్లేదు.., పండించండి – మత్తు కోసం అమ్మితే మాత్రం జైలే..!!
  • కాళేశ్వరం ఓ డిజాస్టర్ – ఓ బ్లండర్ … నిజం తేల్చేసిన నిపుణుడు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions