దర్శకుడు రాంగోపాలవర్మ తాజా వివాదం మీద లేవనెత్తిన పాయింటే విలువైంది… (ఇదే ఆర్జీవీ కొండా మురళి బయోపిక్‌కు దర్శకుడు కూడా..) నిజానికి కొండా సురేఖ సమంతను నీచంగా చిత్రించలేదు… ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేయకుండా ఉండాలంటే సమంతను తన దగ్గరకు పంపాలని కేటీయార్ కోరితే… వెళ్లాలని నాగార్జున, చైతన్య ఆమెపై ఒత్తిడి చేశారనేది సురేఖ విమర్శ… (
https://x.com/RGVzoomin/status/1841718729731887575
దానికి అంగీకరించలేదని సమంతను పంపించేసి, విడాకులు ఇచ్చారని కదా ఆమె చెప్పింది..? ఇక్కడ సమంత తన కేరక్టర్ కాపాడుకున్నట్టే కదా… మరిక సమంతను తిట్టిందేముంది..? భర్త, మామ ఆదేశాల్ని పాటించకుండా ఆ ఒత్తిడిని తట్టుకుని, నిలబడిందని పరోక్షంగా అభినందించింది… అందుకే సమంత కూడా రాజకీయాల్లోకి తనను లాగొద్దని, తన విడాకులు పరస్పర అంగీకారంతో జరిగినవేననీ సురేఖకు బదులిచ్చింది…
Ads
ఆమె వాడిన భాష, వ్యక్తీకరణ సూపర్‌గా ఉన్నాయి… సురేఖ కూడా సమంతకు సారీ చెప్పింది, ఇక వదిలేయండని టీపీసీసీ అధ్యక్షుడు జనానికి చెప్పాడు… కానీ అలా వదిలేసేంత చిన్న ఇష్యూ అయితే కాదు… అందుకే కేటీయార్ లీగల్ నోటీస్ ఇచ్చాడు… తననే కదా సురేఖ కాముకుడిగా చిత్రించింది.! కేటీయార్ రియాక్షన్‌లో అర్థముంది… అలాగే నాగార్జున కోర్టులో కేసు పెట్టాడు… తనకు కోపం రావడంలో కూడా అర్థముంది…
https://www.facebook.com/photo?fbid=10222490413208124&set=a.1605353352753
ఇంటి మహిళను ఎవరో పంపించమని అడిగితే నాగార్జున, చైతన్య సమంతను వెళ్లాలని ఒత్తిడి చేశారనే ఆరోపణతో నిజానికి సురేఖ ప్రత్యక్షంగా నాగార్జున, చైతన్యలను నీచులుగా చిత్రించింది… అందుకే అక్కినేని అమల సహా అక్కినేని కుటుంబం మొత్తం సురేఖ మీద ట్వీట్లతో విరుచుకుపడ్డారు… న్యాయమే…
మరోవైపు రఘునందన్ కూడా సురేఖను, తనను కలిపి నీచంగా ట్రోలింగ్ చేస్తున్నారని ఆరోపిస్తూ.., కేటీయార్, హరీష్‌రావులే కారణమంటూ సైబర్ క్రైమ్‌లో కేసు పెట్టాడు… సో, టీపీసీసీ అధ్యక్షుడు వదిలేయమని చెప్పగానే వదిలిపోయే చిన్న ఇష్యూ కాదు, పైగా సురేఖ సమంతకు సారీ చెప్పింది గానీ, నిజంగా సారీ చెప్పాల్సిన నాగార్జున, చైతన్యలకు చెప్పలేదు… సరే, కేటీయార్ మీద ఉద్దేశపూర్వకంగానే కామెంట్స్ చేసింది కాబట్టి తనకు సారీ చెప్పలేదు, పైగా నిన్ను విడిచిపెట్టను, జిల్లాల్లో తిరగలేవు అని పొలిటికల్ భాషలోనే మళ్లీ వ్యాఖ్యలు చేసింది…
సినిమా ప్రముఖులు కూడా అక్కినేని కుటుంబం మీద సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండించారు… కొన్నాళ్లు ఈ దుమారం ఉంటుంది… ఇదేసమయంలో మళ్లీ ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు మీద అందరి దృష్టీ పడింది… కీలక నిందితుడిని ఇంకా అరెస్టు చేయలేదు… కోర్టుకు పోలీసులు ఛార్జిషీటు సమర్పించేటప్పుడు అందులో ఏయే అంశాల్ని ఏకరువు పెడతారో చూడాలిక… ఏ సెక్షన్లు పెడతారు, కేసు సివియారిటీని ఎలా వెల్లడిస్తారనేవి ఆసక్తికరం…
అప్పట్లో కేంద్రం ఈ ఫోన్ ట్యాపింగ్ యవ్వారంపై సీరియస్‌గా ఉందని వార్తలొచ్చాయి… అంతే, మళ్లీ కేంద్రం ఏమీ పట్టించుకోలేదు… తాజాగా కేటీయార్ క్యాంపు సోకాల్డ్ ట్రోలింగు ఆరోపణలపై ఎదురుదాడి స్టార్ట్ చేసింది… సురేఖ, రఘునందన్ పదే పదే చూపిస్తున్న ఆ పోస్టుల్లో అభ్యంతకరమైన భాష లేదనీ, మార్ఫింగ్ చేయలేదనీ, అందులో కించపరిచే అంశాలేమున్నాయని వెబ్ ప్రచారంలోకి తీసుకొస్తున్నారు…
బీజేపీ రఘునందన్ కాంగ్రెస్ మంత్రి సురేఖకు నూలు దండను వేస్తున్న ఫోటో పెట్టి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ (అది ఆ చెక్కుల పంపిణీ ప్రోగ్రామ్ కావచ్చు బహుశా) అని రాయడం అంటేనే… ఆ పోస్టు వెనుక దురుద్దేశం, దురర్థం, వ్యంగ్యం, వెటకారం తెలుస్తూనే ఉన్నాయి…
(ఈ ఫోటో ఎవరినీ ఉద్దేశించి కాదు, సోషల్ బురదకు ఓ ఇండికేటివ్ పిక్, అంతే…)
ప్రస్తుతం ప్రతి నాయకుడు సోషల్ మీడియా టీమ్స్ మెయింటెయిన్ చేస్తున్నాడు… ప్రత్యర్థి నాయకులపై ట్రోలింగ్ కూడా చేయిస్తున్నారు… పార్టీలు సపరేటుగా సోషల్ టీమ్స్, సోషల్ ప్రచారాల కోసం కోట్లకుకోట్లు వెచ్చిస్తున్నాయి… ఫేక్ ఖాతాలతో ట్రోలింగులు చేయిస్తున్నారు… ఫేక్ ఫోటోలు, మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు, మీమ్స్‌తో… ఇదంతా పెద్ద దందా అయిపోయి, సమాజంలోకి మురికి, కాలుష్యం పంపింగ్ చేయబడుతోంది…
దీనికి అడ్డుకట్ట ఎలా..? ఇదీ పెద్ద ప్రశ్న… అప్పట్లో ఏపీలో జడ్జిలను కించపరిచే పోస్టులు పెట్టారని వైసీపీ క్యాంపు సోషల్ యాక్టివిస్టులపై సీబీఐ కేసు పెట్టింది… ఇప్పటికీ అదెటూ తేలలేదు… కొండా సురేఖ వెగటు వ్యాఖ్యలతో మళ్లీ సోషల్ మురికి, రాజకీయ నాయకుల భాష చర్చనీయాంశాలు అవుతున్నాయి..!!
Share this Article