కావచ్చుగాక… కీరవాణి సంగీతం, పాటలు ఆకట్టుకోకపోవచ్చుగాక… ఒరిజినల్ నవలను సినిమాగా దృశ్యబద్దం చేసే క్రమంలో దర్శకుడు పలుచోట్ల సినిమాటిక్ లిబర్జీలు తీసుకోవచ్చుగాక… అవి అక్కడక్కడా లాజిక్ రహితంగా ఉండి, నవ్వు పుట్టించవచ్చుగాక… సినిమా కోసమే సృష్టించిన హీరోయిన్ పాత్ర అనేకచోట్ల హీరోను డామినేట్ చేసి ఉండవచ్చుగాక… హీరో పక్కన హీరోయిన్ కాస్త ముదురు అనిపించవచ్చుగాక… వారి లవ్ స్టోరీ అసలు కథకు అడ్డం పడుతూ ఉండవచ్చుగాక… క్లైమాక్స్ ఇట్టే తేలిపోవచ్చుగాక… మరీ సెకండాఫ్ కథ నత్తనడకన సాగుతూ కాస్త విసుగు పుట్టించవచ్చుగాక… కామెడీ పెద్దగా వర్కవుట్ కాకపోవచ్చుగాక… కమర్షియల్ కోణంలో అంతగా ఆకట్టుకునే స్థాయిలో సినిమా రూపుదిద్దుకుని ఉండకపోవచ్చుగాక… కానీ..?
- అభినందించాల్సిన అంశాలూ ఉన్నయ్… ప్రకృతితో, పశువులతో అనుబంధం… ఓ పిరికి కథానాయకుడు కొండపొలం అనుభవాలతో ధైర్యాన్ని పుంజుకుని, జీవితంతో పోరాడే స్థాయికి ఎదగడం… తమ జీవాల్ని కాపాడుకునేందుకు పడే తపన… ప్రయత్నాలు… పరిపూర్ణంగా ఓ భిన్నమైన కథ… మన తెలుగు సినిమా ఫార్ములా పోకడలకు పూర్తి విరుద్ధమైన పోకడ… సన్నపురెడ్డి రాసిన ఈ కొండపొలం నవలను తన సినిమాకు ఎంచుకోవడం దర్శకుడి మంచి టేస్ట్…
- మెగా కుటుంబ హీరో… వర్తమాన పాపులర్, కమర్షియల్ సినిమాల రొటీన్ పోకడలకు భిన్నంగా… ఈ భిన్న కథాంశానికి అంగీకరించడం పట్ల హీరో వైష్ణవ్ తేజును అభినందించాలి… పైగా తనలో మంచి నటుడున్నాడు… కష్టపడుతున్నాడు… ఉప్పెనలోని ఆ ‘కటింగ్’ అంశాలకు అంగీకరించడమే ఓ విశేషం, అయితే ఈ రెండో సినిమా కూడా తన మొదటి సినిమా రీతిలోనే పూర్తి భిన్నంగా ఉంది… మెచ్చుకోవచ్చు… సీమ యాసను కూడా బాగానే ట్రై చేశాడు… (ఈ ఇద్దరు మెగా సోదరులు తమ పాత్రలు, కథల ఎంపికలో సరైన పంథాను అనుసరిస్తున్నారు…)
- ఎంతసేపూ రొటీన్ స్కిన్ షో బాపతు గ్లామర్ పాత్రలే చేసిన రకుల్ ఈ సినిమాలో కొత్తగా ఉంది, ప్రాధాన్యమున్న పాత్ర… సరిగ్గా వినియోగించుకుంది… కొత్త రకుల్ కనిపించింది… బాగుంది…
Ads
- రాయలసీమ అనగానే వేటకొడవళ్లు, ఎగిరే సుమోలు, లుంగీలు, అరుపులు, నరుక్కోవడాలు, పగలు కాదు… సీమలోనూ ఉండేది కూడా రక్తమాంసాలున్న మనుషులే… అవసరమైనప్పుడు తమ జీవాల కోసం కూడా ప్రాణాలివ్వడానికి సిద్ధపడే పెద్ద మనుసులు అని టాలీవుడ్‌కు ఇన్నాళ్లూ తెలియదు… పట్టలేదు… అందుకే ఈ సినిమా కథను మెచ్చుకోవాలి…
- అడవి అంటే… ఇప్పుడు జస్ట్, చెట్లు, పుట్టలు, పులులు, వాగులు, వంకలు మాత్రమే కాదు… స్మగ్లర్లు, ప్రమాదాలు కూడా…! అడవీ సవాళ్ల నడుమ తమ జీవాల్ని కాపాడుకోవడం, ఆ క్రమంలో హీరో తత్వంలో వచ్చే మార్పు, తెగింపు కథ మీద ప్రేమ పుట్టిస్తాయి… కాకపోతే దాన్ని అంతే సమర్థంగా జనానికి కనెక్టయ్యేలా కథనం లేకపోవడం ఓ లోపమే…
- ఎంతసేపూ తెలుగు సినిమా అనగానే పెద్ద కులాలు, పెద్ద భవంతులు, పెద్ద పెద్ద ధనిక కుటుంబాల నడుమ వైరాలు, లేకపోతే మాఫియాలు, గ్యాంగ్ వార్స్, పిచ్చి ఫైట్లేనా..? గొర్లు కాసేవాళ్లు, బర్లు కాసేవాళ్లు కూడా ఇప్పుడు హీరోలే… వాళ్ల బతుకు పోరాటాలు కూడా కథాంశాలే… అదీ నచ్చింది…
- కథానాయకుడు, మహానాయకుడితో గ్రాఫ్ ఘోరంగా దెబ్బతీసుకున్న క్రిష్ బండి మళ్లీ పట్టాలకెక్కింది… రావాలి, ఇలాంటి సినిమాలు రావాలి… తెలుగు సినిమా కథ ‘‘బతుకుబాట’’ పట్టాలి… లైఫ్ నిండాలి… ఇలాంటి సినిమాలే ఆ కొత్త బాటలు వేయాలి… ఆ సంకల్పాన్ని, ఆ ప్రయత్నాన్ని అభినందిద్దాం…!
Share this Article