.
కైక చేసిన తప్పుకు.. లక్ష్మణుడు ఐశారామాలని, భార్యని ఒదిలి అన్నా వదినలకు సేవ చేస్తానని అడవులకు వెళ్ళిపోయాడు. పెద్దన్న రాముడికి తన తల్లి వల్ల అన్యాయం జరిగిందని బాధపడ్డ భరతుడు రాజప్రాసాదాన్ని ఒదిలి పన్నెండేళ్ళు ఊరి బయట గుడిసె కట్టుకుని కటిక నేలన జీవిస్తూ రాజ్యపాలన చేసాడు. భరతుడికి అండగా శత్రుఘ్నుడు నిలబడి తమ్ముడి కర్తవ్యం నిర్వర్తించాడు..
కౌసల్యా తనయుడు రాముడు అడవులకు పోయిన బాధ ఒకటైతే.. తప్పుచేసిన కైకేయిది మరొక బాధ.. కానీ ఏ తప్పూ చేయని సుమిత్రా దేవి, అకారణంగా భర్తను కోల్పోయినది అయింది.. తన ఇద్దరు కొడుకులూ మిగతా ఇద్దరు అన్నల తలరాతలకు తోడుగా బలైపోయారు..
Ads
Most underrated lives in Ramayana are Sumithra and Shtrughna..
ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే.. మెగా కుటుంబం వేరు – మెగా అభిమానులు వేరు. అల్లు కుటుంబం వేరు – అల్లు అభిమానులు వేరంటూ సోషియల్ మీడియాలో మరో కొత్త వివాదం మొదలైంది. తమవాళ్ళ సినిమాలకు మాత్రమే పటాకులు కాల్చాలి, అభిషేకాలు చేయాలి పరాయోడిది అవసరం లేదంటూ ఎద్దేవా మొదలుపెట్టింది కాకిలోకం..
అభిమానులను కాపాడుకోడానికి ఆ రెండు కుటుంబాలూ విలువలను ఒదిలేసుకుంటున్నాయో లేక తమ విభేదాలను అభిమానులు పలుకుతున్నారని సాంత్వనం పొందుతున్నారో ఆ పెరుమాళ్ళకు ఎరుక..
ఈ చిందరవందర ప్రపంచం మధ్యలో చిరంజీవి భార్య సురేఖ గారు ఈ తరంలో సుమిత్రా దేవిలా కనిపించింది. పుట్టిల్లు, మెట్టినిల్లులు కలిసుండాలనుకుంటే మరిదిగారు – మేనల్లుడి నడుమ జరుగుతున్న పోరుతో ఎంత బాధపడుతుందో ఎవరికీ అర్ధం కావడం లేదు.
ఆ ఇరు కుటుంబాల అభిమానులు ఆమె మనస్సు ఎంత నొచ్చుకుంటోందో తెలుసుకోలేకపోతున్నారేమో అనిపిస్తోంది.
Troll pic is this…
Most underrated = ఎంతో విలువైనదైనా కూడా నిర్లక్ష్యానికి గురైనది.. లోకాం సమస్తాం సుఖినోభవంతు… – గోకవరపు నరేంద్ర
Share this Article