డౌటేమీ లేదు… కొన్నాళ్లుగా ఇండియన్ సినిమాలో ట్రెండ్ ఫాంటసీ, ఫిక్షన్, అదీ మైథాలజీకి లింక్ చేసి ఓ కథ చెప్పడం… లేదా ఇతిహాసాల్లోని కొన్ని పార్టులను తమకిష్టమొచ్చినట్టు రాసుకుని తెరకెక్కించడం..! మరీ దరిద్రంగా ప్రజెంట్ చేస్తే, ఆదిపురుష్‌లాగా ఫ్లాపవుతాయి, తప్ప ఏమాత్రం జాగ్రత్తగా తీసినా సూపర్ హిట్టే…
ఆమధ్య కార్తికేయ అందుకే హిట్టు… నార్త ఇండియన్స్ బాగా కనెక్టయ్యారు… వసూళ్లు కురిపించారు… అంతెందుకు, హనుమాన్ చిత్రం కూడా అంతే కదా… పాన్ ఇండియా హిట్… ఇక రీసెంటుగా కల్కి రికార్డుల హోరు, దాని రేంజ్ చెప్పనక్కర్లేదు… కల్కి అవతారానికీ, అశ్వత్థామకూ, మహాభారతానికీ, భవిష్యత్తు ప్రపంచానికీ లింకులు పెట్టి రాసుకున్న ఓ ఫాంటసీ కథ…
అందరూ సైన్స్ ఫిక్షన్ అని రాస్తున్నారు గానీ, కాదు… జస్ట్, ఫిక్షన్… కాకపోతే మైథాలజీకి లింక్ చేయడంతో అది ప్రేక్షకుడిని కనెక్టవుతోంది… ఊరికే టైమ్ ట్రావెల్ చేయిస్తే ప్రేక్షకులు ఆ ప్రయాణాన్ని ఇష్టపడేవారో లేదో తెలియదు… రాబోయే మంచు కన్నప్ప కూడా ఓ పాత భక్తి కథే… కాకపోతే అసలు కథేమిటో, వీళ్లు తీస్తున్నదేమిటో ఎవరికీ అర్థం కావడం లేదు… అదేదో కొత్త బాహుబలి టైపులో ఉంది ట్రెయిలర్, సరే ఆ సినిమా కథ వేరు…
Ads
ఇప్పుడు కూర్మనాయకి అనే సినిమా వస్తోంది… కొత్తగా పెళ్లి కూతురు అవుతున్న వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్ర… మరో ప్రధాన పాత్రలో సాయికుమార్ అట… (ఈమధ్య శివన్న అలియాస్ శివాజీ అనే బిగ్‌బాస్ ఫేమ్ నటుడు కూడా షూటింగులో చేరినట్టు వార్తలొచ్చాయి…) మిగతా నటీనటులు ఎవరో, కథేమిటో తెలియదు గానీ… వరలక్ష్మి గ్లింప్స్ మాత్రం అదిరిపోయింది… నీళ్లలో యోగముద్రలో కూర్చుని ఉంది, ఓ తాబేలు… ఆమెనే ఓ కూర్మావతారంలా చూపించబోతున్నారా..?
విష్ణు అవతారాల్లోని కూర్మావతారం ఆధారంగా కథ రాసుకున్నట్టు చెబుతున్నారు కానీ… కూర్మనాయకి, వరలక్ష్మి గ్లింప్స్ చూస్తుంటే విష్ణువు మోహిని అవతారం ఎత్తినట్టు… ఆడ తాబేలు అవతారం ఏదో కొత్తగా రాసుకున్నారేమో… సరే, ఏదో ఫిక్షన్… ఆ కథకు విష్ణు అవతారాన్ని కూడా లింక్ చేస్తారన్నమాట… పర్లేదు, ట్రెండ్ ప్రకారం వెళ్తున్నారు… ఎవరో స్టార్ హీరో కూడా వస్తాడట…
ఏదో గెస్టు పాత్రగా ఎవరైనా వస్తారో ఏమో గానీ… పాన్ ఇండియా రేంజ్ అని ప్రచారం జరుగుతోంది… ఆ బ్యానర్, ఆ నిర్మాతల ఆర్థిక స్థాయి ఏమిటో పెద్దగా తెలియదు, దర్శకుడు కడియాల హర్షకు తొలి సినిమా అట… అంత పెద్ద పేరున్న టీం కాకపోయినా పాన్ ఇండియా ఆశలతో మూవ్ కావడానికి ఆ కథ మీద నమ్మకమే కారణం కావచ్చు… కానీ ఎందుకో లేడీ కూర్మావతారం అంటేనే… అనగా కూర్మనాయకి అంటేనే అదోలా ఉంది చదవడానికి, వినడానికి..!! ఎలా జస్టిఫై చేస్తారో చూడాల్సిందే..!!
Share this Article