Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కోరికలే గుర్రాలైతే..? ఆశల రెక్కలు విరిగి ఎప్పుడో కూలబడతాయి…!!

November 12, 2024 by M S R

.

మంచం ఉన్నంతవరకే కాళ్ళు చాపుకొనవలయును . పులిని చూసి నక్క వాత పెట్టుకోకూడదు . దూరపు కొండలు నునుపు . అప్పు చేసి పప్పు కూడు తినకూడదు . పరుగెత్తి పాలు తాగేకన్నా నిలబడి నీళ్లు తాగటం మంచిది . Don’t bite more than what you can chew .

ఈ సూక్తుల సమాహారమే 1979 లో వచ్చిన ఈ కోరికలే గుర్రాలయితే సినిమా . ప్రేక్షకుల మెప్పు పొందింది . నిర్మాతకు లాభాలు వచ్చాయి . ఏక్టర్లందరికీ పేరు వచ్చింది . స్కిన్ ప్లే , మాటలు , దర్శకత్వం వహించిన దాసరి నారాయణరావుకు ప్రశంసలు లభించాయి . మూలకధ మాత్రం డి కామేశ్వరిది . టైటిల్సులో కూడా ఆమె పేరు వేసారు .

Ads

ఓ మధ్య తరగతి కుటుంబీకుడికి ఇద్దరు కొడుకులు , ఇద్దరు కుమార్తెలు . ఒక్క కూతురు మాత్రం బాధ్యతగా ఆలోచించేది . మిగిలిన ముగ్గురు వాళ్ళ గోల వాళ్ళది . ఇద్దరు కూతుళ్ళలో ఒక కూతురు ఎప్పుడూ ఊహల్లో విహరిస్తూ ఉంటుంది . ప్రపంచంలో అందరూ సుఖపడి పోతున్నారు ; తానొక్కదానికే ఏమీ లేదు అని నిత్యం , ప్రతి క్షణం విలపిస్తూ ఉంటుంది . Thomas Harris భాషలో I’m not ok ; All are ok batch .

ఇలాంటి బడాయి బసవయ్య , బసవమ్మ సినిమాలు మనకు కుప్పలకుప్పలు . ఆల్మోస్ట్ అన్నింటినీ జనం చూసారు . ఎంత మంది మారారో తెలియదు . సావాసగాళ్ళు అనే సినిమాకు కాస్త దగ్గరగా ఉంటుందీ సినిమా .

కుటుంబ పెద్దగా కాంతారావు , ఆయనతో పాటు ఇంట్లోని తిక్కోళ్ళని భరించే గృహిణిగా నిర్మలమ్మ , ఇద్దరు కూతుళ్ళుగా ప్రభ , ఫటాఫట్ జయలక్ష్మి , ఒక సుపుత్రుడిగా మోహన్ బాబు , మరో సుపుత్రుడి పేరు నాకు తెలియదు . ఆ ఇంటి రాంబంటుగా మురళీమోహన్ , అతని మిత్రుడిగా చంద్రమోహన్ నటించారు . ఇతర పాత్రల్లో రాజబాబు , కె విజయ , రమాప్రభ , జయమాలిని , రామ్మోహన్ ప్రభృతులు నటించారు .

నటనాపరంగా ముందు ఫటాఫట్నే చెప్పుకోవాలి . తర్వాత ప్రభ , మురళీమోహన్ , చంద్రమోహన్ , మోహన్ బాబు . చెప్పిచ్చుక్కొడతా ఊత పదం మోహన్ బాబుకి .

సత్యం సంగీత దర్శకత్వంలో పాటలన్నీ బాగుంటాయి . కోరికలే గుర్రాలయితే పాట ఈ సినిమాకు ఐకానిక్ సాంగ్ . సినిమాలో రెండు సార్లు వస్తుంది . ఒకసారి జయలక్ష్మి తన ఫ్రెండ్సుతో , మరోసారి చంద్రమోహన్ భార్యాబాధితుడు అయి పాడుతారు . ఆత్రేయ వ్రాస్తే బాలసుబ్రమణ్యం , సుశీలమ్మలు పాడారు .

ఈ సినిమాలో ఓ ప్రత్యేకమైన పాట ఉంది . లక్ష్మి నటించిన హిందీ బ్లాక్ బస్టర్ జూలీ సినిమాలోని జూలీ ఐ లవ్ యూ పాట ట్యూనుతో ఏమి వేషం ఏమి రూపం అని ఓ పాట ఉంది . మోహన్ బాబు , రమాప్రభల మీద ఉంటుంది . కొసరాజు వ్రాస్తే బాలసుబ్రమణ్యం , వసంతలు పాడారు .

మరో శ్రావ్యమైన పాట మనసే మన ఆకాశం మనమే రవిచంద్రులం . మురళీమోహన్ , ప్రభల మీద ఉంటుంది . సి నారాయణరెడ్డి వ్రాస్తే బాలసుబ్రమణ్యం , సుశీలమ్మలు పాడారు . ఇంకో పాట చంద్రమోహన్ , జయలక్ష్మిల మీద ఉంటుంది . సలాములేకుం రాణీ నీ గులాంనౌతాను . జయమాలిని మీద ఓ డాన్స్ పాట ఉంది కానీ జయమాలిని లెవెల్లో ఉండదు . దాసం గోపాలకృష్ణ వ్రాసారు . రేరే రేక్కాయలో అనే పాట . యస్ జానకి పాడింది .

దాసరి సినిమాల్లో ఏదో ఒక సందేశం డైరెక్టుగానో , ఇన్ డైరెక్టుగానో ఉంటుంది . సినిమా ఆఖర్లో తన వాయిస్ ఓవర్తో ప్రేక్షకులను బాదుతాడు . ఈ సినిమాలో కూడా ఆ బాదుడు ఉంది . ప్రతి ఒక్కరూ తప్పక చూడతగ్గ , చూడవలసిన సినిమా .

ముఖ్యంగా యువతీయువకులు , మధ్య వయస్కులు తప్పక చూడాలి . యూట్యూబులో ఉంది . చూసి ఉండకపోతే తప్పక చూడండి . మరోసారి చూసినా నష్టం ఏం లేదు . ఓ అలర్ట్ లాగా ఉంటుంది .
#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు ……….. ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • స్టార్ హీరో ఇమేజ్, డాన్సులు, ఫైట్లు, ఎలివేషన్లు ఉండగానే సరిపోదు..!!
  • కాంగ్రెస్‌తోపాటు బీజేపీ కూడా..! తెలంగాణకు కేసీయార్ జలద్రోహం- నిజాలు..!!
  • ‘ట్రంపరితనం’… ప్రపంచానికే వినాశకరం… ఏదో ముంచుకొస్తోంది…
  • వ్యాపిస్తున్న దుర్గంధం… తిట్ల పర్వంలో జాతీయ నేతలనూ వదలడం లేదు…
  • ఒకటి బాసట…! మరొకటి కబళింపు..! ఇదే అమెరికాకూ ఇండియాకూ తేడా..!!
  • శివశంకర ప్రసాద్ గారు… మీ ‘గెస్చర్’ మనసుని గెలుచుకుంది..!
  • సంక్రాంతి ఎప్పుడు..? ఎందుకు మీమాంస..? మళ్లీ సందిగ్ధత..!!
  • వాటిని గజల్స్ అంటారా..? నీ సారస్వత సేవ ఏమిటి శ్రీనివాసులూ…?
  • వెనెజులా..! ట్రంపుదే కాదు… మన చమురూ ఉంది అక్కడ… తవ్వాలి..!!
  • అవునూ, ఇంతకీ ఈ ‘తెలుగు గజల్ శ్రీనివాస్’ పాత కేసు ఏమైనట్టు..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions