.
మన సినిమాల్లో చూపించే గ్రాఫిక్స్ ఎంతనాసిరకమో హరిహరవీరమల్లు స్పష్టంగా చూపిస్తే… వందల కోట్ల వ్యయం చూపించేందంతా డొల్ల అని కల్కి, ఆదిపురుష్, బ్రహ్మాస్త్ర వంటి సినిమాల గ్రాఫిక్ వ్యయం చెబుతుంది… గ్రాఫిక్స్ ఖర్చు ఓ పేద్ద మాయాప్రపంచం… దాన్నలా కాసేపు వదిలేస్తే…
ఒక హనుమాన్ తక్కువ గ్రాఫిక్స్ ఖర్చు… మరీ కనీసస్థాయి… అంతెందుకు మహావతార్ నరసింహ పూర్తి స్థాయి యానిమేటెడ్ మూవీ అయినా ఖర్చు 15 కోట్లు మాత్రమే… 300 కోట్లకు మించి మింట్ చేసుకుంది… కారణం.., దిక్కుమాలిన గ్రాఫిక్స్ ఓవరాక్షన్ కాదు, సినిమాకు ప్రధానం కథ, ఎమోషన్, మంచి ప్రజెంటేషన్, ప్రేక్షకుడు కనెక్ట్ కావాలి… అవి లేకపోతే పెద్ద పెద్ద స్టార్ల సూపర్ హీరోయిజాలు చెల్లని నాణేలు మాత్రమే…
Ads
ఐనా ఎంతసేపూ సూపర్ సుప్రీమ్ హీరోలేనా..? మన కథల్లో హీరోయిన్లకు ఆ లెవల్, ఆ రేంజ్ ఉండవా..? ఎందుకు ఉండవ్…? కొత్తగా ఓ సినిమా వచ్చింది… లోక ఛాప్టర్ 1- చంద్ర దాని పేరు… తెలుగులో కొత్త లోక అని టైటిల్ పెట్టారు… 20, 25 కోట్లతో తీసేశాడు డోమినిక్ అరుణ్…
సోషల్ మీడియాలో ఓ మిత్రుడి అభిప్రాయం ఏమిటంటే..? ‘‘ఇందులో కల్యాణి ప్రియదర్శన్ మన తొలి ‘ఇండియన్ సూపర్ హీరోయిన్’ … హాలీవుడ్- మార్వెల్, DC COMICS- సూపర్ హీరోల సినిమాలకు భిన్నంగా ఇండియన్ Folklore నుంచి సూపర్ హీరోయిన్ని బిల్డ్ చేయడం జీనియస్ రైటింగ్ టచ్…
యాక్షన్ అడ్వెంచర్లతో పాటు కాస్త కామెడీ కూడా పండించగలగడం, టొవినో థామస్ కేమియోని అందుకోసం ప్రత్యేకంగా డిజైన్ చేయడం ఇంకో బ్రిలియంట్ రైటింగ్ స్ట్రోక్…
ఫైనల్ కేమియోలో మెరిసిన దుల్కర్ సల్మాన్ ఈ సినిమా నిర్మాత కూడా… ఏమాత్రం hype లేకుండా సినిమాని ఎందుకు రిలీజ్ చేసాడో తెలీదు గానీ, ‘లోకా’ కేవలం మౌత్ టాక్ తో వైల్డ్ ఫైర్ లాగా అంటుకుంది… నిజంగా దుల్కర్ సాహసి, ఎంచుకునే పాత్రలూ అంతే, వెరీ టాక్ట్‌ఫుల్ ఇన్వెస్టర్ కూడా…
మోహన్‌లాల్ హృదయపూర్వం సినిమాను మించిన కలెక్షన్లు వస్తున్నాయి ఈ కొత్త లోక సినిమాకు… తొలి రెండుమూడు రోజుల్లోనే 50 శాతం నిర్మాణవ్యయం రాబట్టింది సినిమా… ప్రస్తుత పాజిటివ్ టాక్‌తో భారీ లాభాలు తీసుకురాబోతోంది కూడా… అంతేకాదు, ఈ సీరీస్ ఇక కొనసాగించడానికి ఆర్థిక ధైర్యాన్ని కూడా ఇచ్చినట్టే…
కల్యాణి ప్రియదర్శన్ స్థాయి బాగా పెరిగినట్టే… నిజానికి తెలుగు ప్రేక్షకులకు ఆమె పరిచయమే… అక్కినేని అఖిల్‌తో హలో సినిమా (డెబ్యూ) చేసింది… చిత్రలహరి, రణరంగం కూడా… న్యూయార్క్‌లో ఆర్కిటెక్చర్ డిగ్రీ చేసిన ఆమెకు నటన అంటే ప్యాషన్… తండ్రి ప్రియదర్శన్ దర్శకుడు, తల్లి లిస్సీ నటి… పక్కా సినిమా కుటుంబం…
అందుకే ఆర్కిటెక్చర్ రంగాన్ని వదిలేసి, నటనలో శిక్షణ తీసుకుని… అసిస్టెంట్ ఆర్డ్ డైరెక్టర్‌గా, అసిస్టెంట్ ప్రాజెక్టు డిజైనర్‌గా… సినిమారంగంలోకి వచ్చేసి… ఇదుగో ఇప్పుడిలా సూపర్ హీరోయిన్ అయిపోయింది… బాగా చేసింది సినిమాలో…
ఐతే రొటీన్ జానపదాలకన్నా ఇది కాస్త డిఫరెంటు… కథానాయికకు అతీంద్రియ శక్తులు అలవడతాయి… మంచిని కాపాడుతూ, చెడును శిక్షిస్తూ కాలాలు మారుతున్నా, నాగరికతలు, ప్రపంచం మారుతున్నా ఆమె అలాగే ఉంటుంది…
అంత బలీయమైన శక్తికి ప్రతికూల శక్తిగా ఏదో ఆర్గాన్స్ మాఫియాను చూపించడం కాస్త వెలితి అనిపిస్తుంది… బలమైన దైవిక శక్తులకు అంతే బలమైన ప్రతికూల శక్తులతో పోరాటం ఉంటే కథ ఇంకా రక్తికట్టేదేమో… బట్ ఓవరాల్‌గా ఇప్పుడు ఈ సినిమా ఓ సంచలనం..!!
Share this Article