Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇంట్రస్టింగ్… విరిగిపడిన రెండు ప్రతిభా కెరటాల పునః కలయిక…

February 12, 2024 by M S R

ఆసక్తికరమైన వార్తే… దర్శకుడు క్రిష్ అనుష్క శెట్టితో ఒక హీరోయిన్ సెంట్రిక్ సినిమా చేయబోతున్నాడు..! ఎదుగుతూ ఎదుగుతూ కెరీర్ బాగా ఉన్న దశలో ఇద్దరూ బోల్తా కొట్టినవాళ్లే… ఇద్దరూ ప్రతిభులే… కాకపోతే డెస్టినీ వాళ్ల పక్షాన లేదు… ఆ ఇద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారనేది అందుకే ఇంట్రస్టింగ్…

అనుష్క వయస్సు 42 ఏళ్లు… మంగళూరు, తుళు మహిళ… బెంగుళూరులోనే చదివిన ఈ యోగా ఇన్‌స్ట్రక్టర్ కన్నడ సినిమాలకన్నా తెలుగు, తమిళ సినిమాల్లోనే ప్రసిద్ధురాలు… కన్నడంలో ఒక్క సినిమా కూా చేయలేదు… 2005 నుంచీ ఫీల్డ్‌లో ఉంది, మలయాళంలో తాజాగా కథనార్ అని ఓ సినిమా చేస్తోంది… అంతే…

సింగం వరకూ ఇతర హీరోయిన్లలాగే గెంతులు, ఆరబోతలతో కెరీర్ సాగినా… అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి, భాగమతి వంటి కేరక్టర్ల తరువాత ఆమె పాత్రల లెవల్ పెరిగింది… ఏది పడితే అది అంగీకరించలేని సిట్యుయేషన్… ఆ స్థితిలో అనవసరంగా జీరో సైజ్ సినిమా చేసి తప్పు చేసింది… బరువు పెరిగిన ఈ యోగా ఇన్‌స్ట్రక్టర్‌ను వెండితెర అయిష్టపడింది…

Ads

బరువు తగ్గడానికి నానాపాట్లూ పడినా, ఆ పాత లావణ్యం మళ్లీ రాలేదు… మొన్నామధ్య పోలిశెట్టి సినిమాలో ఆమెను చూస్తే ఆశ్చర్యమేసింది… ఈ వయస్సులో… పైగా ఒకప్పటి తన ఇమేజ్ దృష్ట్యా ఇతర హీరోయిన్లలాగా రొటీన్ పిచ్చి పాత్రలు చేయలేదు… ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయరు… సో, వుమెన్ సెంట్రిక్ కథ అంగీకరించింది… సరైన నిర్ణయం, సరైన అవకాశం… సరైన మార్గం… గత్యంతరమూ లేదు…

క్రిష్… దాదాపు అనుష్క వయస్సే… 45 ఏళ్లు… ఆమెకన్నా లేటుగానే ఇండస్ట్రీకి వచ్చాడు… 2008లో గమ్యం నుంచీ ఓ భిన్నమైన, సెన్సిబుల్ దర్శకుడిగా పేరొచ్చింది… అవార్డులొచ్చినయ్… మంచి మంచి అవకాశాలొచ్చినయ్… 2017 గౌతమీపుత్ర శాతకర్ణి దాకా, చేసినవి కొన్ని సినిమాలే ఐనా దర్శకుడిగా మంచి పేరే దక్కింది… కానీ ఎన్టీయార్ బయోపిక్స్ కథానాయకుడు, మహానాయకుడు తీశాక అదృష్టం వెనక్కి తన్నింది…

దీనికితోడు మణికర్ణిక హిందీ సినిమా (ఝాన్సి రాణి స్టోరీ) విషయంలో జరిగిన గొడవ తనకు బాగా మైనస్ అయిపోయింది… కంగనా రనౌత్ తనను ఆ సెట్ల నుంచి, కాదు, బాలీవుడ్ నుంచే వెళ్లగొట్టింది… అనుకున్నట్టుగానే ఆ సినిమా తన దర్శకత్వంలోనే పూర్తయి ఉంటే, క్రిష్ బాలీవుడ్‌లో వెలిగేవాడేమో… తననూ డెస్టినీ వెక్కిరించింది… 2021లో కొండపొలం అనే ఓ చిన్న సినిమా తీసేదాకా క్రిష్ అసలు వార్తల్లో కూడా లేడు…

పవన్ కల్యాణ్‌లో హరిహర వీరమల్లుతో దాదాపు తన రీఎంట్రీ అనుకోవచ్చు… పెద్ద పాన్ ఇండియా సినిమా కదా… కానీ అది 2020 నుంచీ షూటింగ్ న-డు-స్తూ-నే ఉంది… దాని రిలీజ్ ఎప్పుడో ఎవరూ చెప్పలేని స్థితి… ఇప్పుడు అనుష్కతో హీరోయిన్ సెంట్రిక్ సినిమా తీస్తున్నాడు అనే వార్త అందుకే ఇంట్రస్టింగ్ అనిపించింది…

ఇద్దరూ ఒకే బాటలో ఉన్నారు… ఎగిరీ విరిగిపడ్డ కెరటాలే రెండూ… ఓ సెన్సిబుల్ మూవీ ఆశిద్దాం… నటనలో ఆమెకూ, దర్శకత్వంలో ఆయనకూ టన్నుల కొద్దీ మెరిట్ ఎలాగూ ఉంది కాబట్టి…! ఈ ఇద్దరూ కలిసి చేసిన వేదం అప్పట్లో ప్రశంసలు పొందిన సినిమా…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వేములవాడ ఆవులు, కోడెల ఉసురు ఎవరికి తగలబోతోంది..?!
  • ఈవారం తెలుగు టీవీ వినోద చానెళ్ల స్థితిగతులు, రేటింగులు ఇవీ…
  • తెలుగు టీవీ న్యూస్ చానెళ్లలో ప్రస్తుతం ఎవరు ఏ ప్లేసులో..?!
  • బాలయ్య దంచూదంచూ అని దరువేశాడు గానీ… దంచికొట్టింది భానుమతే…
  • ఫాఫం అనసూయ..! కాస్త మారిందేమో అనుకున్నారా..? నో, నెవ్వర్..!!
  • ట్రంపుపై మస్క్ పేల్చిన చీకటి బాంబు… అమెరికాలో కలకలం… అసలు కథ ఇదీ…
  • దిక్కుమాలిన క్షుద్రానువాదాలు… దరిద్రపు పర్యవేక్షణ అంటే ఇదే…
  • సిల్క్ స్మిత హర్టయ్యింది… ఆ గ్రేట్ కొరియోగ్రాఫర్ కెరీర్ క్లోజయ్యింది…
  • కథ కన్నీళ్లు పెట్టిస్తుంది… కానీ ఈ కథ ఎక్కడిది..? ఎవరిది..? ఆ కథేమిటి..?!
  • టెలిగ్రాఫ్ వ్యాఖ్య… జర్మనీలో ఇది మరో ఆపరేషన్ సిందూర్ అట…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions