Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆడాళ్లకే కాదండీ… మొగాళ్లకు మొనగాళ్లకూ ఉన్నాయి గాజులు…

August 1, 2024 by M S R

గురుశిష్యులు ఆదుర్తి-కృష్ణల కాంబినేషన్లో 1975 లో వచ్చిన ఈ గాజుల కిష్టయ్య సినిమా వంద రోజులు ఆడింది . ప్రముఖ నటి జరీనా వహాబ్ తెలుగులో నటించిన మొదటి సినిమా ఇది . హిందీలో అప్పట్లో ఆమె పాపులర్ హీరోయిన్ . ఈమధ్య అంటే 2010 లో వచ్చిన రక్తచరిత్రలో కూడా నటించింది .

ఆదుర్తి స్వంత సినిమా కూడా ఇది . ఆదుర్తి మార్కు సినిమా . ఎమోషన్స్ , సాంగ్స్ , నీట్ ప్రెజెంటేషన్ ఉంటాయి . పెళ్ళికి ముందే బిడ్డను ప్రసవిస్తే , ఆ బిడ్డను ఇంట్లోవాళ్ళు వదిలించుకుంటానికి ప్రయత్నిస్తారు . ప్రసవం చేయించిన స్త్రీ ఆ బిడ్డను కిష్టయ్యగా పెంచుకుంటుంది . ఆ కిష్టయ్య తన కొడుకే అని తెలవటం , మేనకోడల్ని ఇచ్చి పెళ్లి చేయటం టూకీగా కధ . మధ్యలో విలన్లు , కుట్రలు మామూలేగా ! కృష్ణ , చంద్రమోహన్లు చాలా చలాకీగా నటించారు . జరీనా వహాబ్ నటన కూడా హుషారుగా ఉంటుంది .

కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో పాటలు శ్రావ్యంగా ఉంటాయి . నవ్వులు రువ్వే పువ్వమ్మా నీ పువ్వులు నాకు ఇవ్వమ్మా సినిమాకు హైలైట్ పాట . మిగిలిన పాటలు ఇన్ని రోజులింత సొగసు ఏడ దాచుకున్నావు , వేసుకో ఈ గాజులు చూసుకో నీ సొగసులు , రేపు ఎంతో తీయనిది నేటికన్నా కమ్మనిది శ్రావ్యంగా ఉంటాయి .

Ads

ఇప్పటి తరం వాళ్ళు ఇంటింటికి తిరిగి గాజులను అమ్మేవాళ్ళను చూసి ఉండరు . బహుశా ఆ వ్యాపారం చేసేవాళ్ళు గ్రామాల్లో కూడా లేరేమో ఇప్పుడు ! మా చిన్నప్పుడు ఈ గాజులను అమ్మేవాళ్ళను ఎంతో గౌరవంగా చూసేవారు . గాజులంటే శుభానికి , సౌభాగ్యానికి ప్రతీకలు కావటం వలన వాటిని అమ్మేవారిని కూడా అలాగే గౌరవంగా చూసేవారు .

కాలక్రమంలో ఆ వృత్తి కనుమరుగై పోయింది . ఇప్పుడు మహిళలకు అవసరమైన గాజులు , బొట్లు , కాటుకలు , వగైరా అమ్మే ప్రత్యేక షాపులు కోకొల్లలు . మహిళాలోక్ , నారి వంటి పేర్లతో . ఇప్పుడు వన్ గ్రాం గోల్డ్ ఆభరణాలు , వెండి ఆభరణాల మీద గోల్డ్ కోటింగ్ , ఇమిటేషన్ జువలరీ వీర పాపులర్ అయ్యాయనుకోండి .

కృష్ణ , జరీనా వహాబ్ , చంద్రమోహన్ , అంజలీదేవి , నిర్మలమ్మ , గిరిబాబు , కాంతారావు , పుష్పకుమారి , శుభ , సాక్షి రంగారావు , సూరేకాంతం , ఛాయాదేవి , మాడా ప్రభృతులు నటించారు .

సినిమా యూట్యూబులో ఉంది . కృష్ణ అభిమానులు ఎవరయినా చూసి ఉండకపోతే తప్పక చూడండి . చూడబులే . It’s a feel good , musical cinema . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు ……… [ By దోగిపర్తి సుబ్రహ్మణ్యం ]

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒత్తులు లేని తెలుగు దస్తూరీ… ఒరిజినాలిటీకే భంగకరం…
  • పక్కా డబుల్ స్టాండర్డ్స్…! ఫోన్ ట్యాపింగు అరాచకానికి విఫల సమర్థన..!!
  • ట్రంప్ స్వయంగా అమెరికా డాలర్‌కు చేస్తున్న ద్రోహం… ఇదీ కథ…
  • విచిత్ర సోదరులు..! సినిమా ప్రయోగాలకు 2 పేర్లు… సింగీతం, కమల్‌హాసన్..!!
  • చీకటిలో…! అక్కినేని శోభిత చుట్టూ ఓ మల్లెపూల కిల్లర్ కథ…!!
  • బోర్డర్-2…. ఆత్మ తక్కువ – అరుపులు ఎక్కువ… ఐనా హిట్టే… ఎందుకు..?
  • ‘ఒరే అబ్బాయ్… కొడుక్కి తండ్రి పెట్టిన ఖర్చుకు రికవరీ ఏముంటుందిరా…’
  • కేవలం పోలీసులు విచారిస్తున్నారు సారూ… తీర్పు చెప్పడం లేదు…
  • ఆహా… ఏం ప్రేమ కథరా బాబూ..! శిక్షిస్తున్నామా..? దీవిస్తున్నామా..?
  • కొందరిని మరిచిపోలేం… తరచూ గుర్తొస్తుంటారు… కళ్లు చెమ్మగిల్లజేస్తూ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions