Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సాహసించడంలో కృష్ణ పొట్టేలే… అనుకున్నాక ఇక ఢీ కొట్టడమే…

July 10, 2024 by M S R

సాహసించటంలో కృష్ణ పొట్టేలే . అనుకున్నాక ఢీ కొట్టడమే . ముందుకు సాగిపోవటమే . రాజకుమారి దొరికినా , దొరక్కపోయినా ఢింభకుడు సాహసం చేయటమే . విజయనిర్మల దర్శకత్వంలో 1974 లో వచ్చిన ఈ దేవదాసు ప్రహసనం తెలియని తెలుగు వాడు ఉండడు .

భారతదేశంలో శరత్ వ్రాసిన ఈ దేవదాసు నవల తీయబడినన్ని భాషల్లో ఏ నవలా తీయబడలేదు నాకు తెలిసినంతవరకు . మొదటిసారిగా 1929 లో మూకీగా కలకత్తాలో తీయబడింది . ఆ తర్వాత 1935 లో టాకీగా తీయబడిన ఈ నవల 2002 వరకు బెంగాలీ , హిందీ , తెలుగు , తమిళం , అస్సామీస్ , మళయాళం , ఉర్దూ భాషల్లో తీయబడింది .

కృష్ణ సినిమాకు పోటీగా ANR , సావిత్రిలు నటించిన దేవదాసు రీ రిలీజ్ చేస్తే వంద రోజులు ఆడింది . సైగల్ , దిలీప్ కుమార్ అంతటి మహా నటులు కూడా అక్కినేనిలాగా నటించలేకపోయారు . కొన్ని పాత్రలు కొంత మంది కోసమే పుడతాయేమో ! దేవదాసు , సావిత్రి పాత్రలు నాగేశ్వరరావు , సావిత్రిల కోసమే పుట్టాయేమో ! అక్కినేని నటించిన దేవదాసు తెలుగు , తమిళ భాషల్లో వచ్చింది .

Ads

CNN-IBN భారతదేశపు 100 గొప్ప చిత్రాలలో ఒకటిగా అక్కినేని దేవదాసుని ఎంపిక చేసారు . మొన్న ఆదివారమే టివిలో వచ్చింది . అంతటి విషాదపు సినిమాని , అంత పిరికి హీరోని , అంత మొండి హీరోయిన్ని ఇంకా ఇంకా ఇంకా చూస్తూనే ఉన్నాం . మామూలు మేజిక్ కాదు .

అక్కినేని దేవదాసు ఎంత గొప్ప సినిమా అయినా , కృష్ణ దేవదాసుని పూర్తిగా తీసేయలేము . కృష్ణ , విజయనిర్మల తాము టేకప్ చేసిన బృహత్ కార్యక్రమాన్ని చాలా సిన్సియర్ గా పూర్తి చేసారు . అందుకు వారు ఇరువురూ అభినందనీయులే . రమేష్ నాయుడు సంగీత దర్శకత్వం లోని పాటలు కూడా శ్రావ్యంగా ఉండటమే కాకుండా , పాపులర్ కూడా అయ్యాయి .

కృష్ణ దేవదాసు లోని పాటలు రాగానే మనకు అక్కినేని దేవదాసు పాటలు నోటికి వచ్చేస్తుంటాయి . ఎలా అంటే : గాడంగా ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకోలేక మరో అమ్మాయిని కట్టుకున్నాక , ప్రతీ ఫ్రేములో పెళ్ళాంలో మిస్సయిన ప్రియురాలే కనపడుతూ ఉంటుంది . అలా . ఈ సినిమా కూడా అంతే .

కృష్ణ రంగుల్లో తీయకుండా బ్లాక్ & వైట్లో తీసి ఉంటే బాగుండేదేమో అని అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంటుంది . I don’t know whether I am right or wrong .

జయంతి , జగ్గయ్య , పండరీబాయి , కాంతారావు , కృష్ణకుమారి , నిర్మలమ్మ , సత్యనారాయణ , మిక్కిలినేని , చంద్రమోహన్ వంటి హేమాహేమీలు నటించారు ఈ 1974 దేవదాసులో . మొన్న ఆదివారమే ఈ సినిమా చూస్తూ నా వాల్ మీద వ్రాసా . ఈ సినిమాలో నాకు నచ్చిన పాత్రలు చంద్రముఖి , ధర్మయ్య . ఆ తర్వాతనే దేవదాసు , పార్వతి పాత్రలు . దేవదాసు కోసం నిజాయితీగా పరితపించిపోతాయి ఆ రెండు పాత్రలు . దేవదాసు కోసమే బతుకుతాయి ఆ రెండు పాత్రలు . మన నిజ జీవితాల్లో ఇలాంటి మనుషులు దొరికటం దుర్లభమే .

భారతీయులకు రామాయణం , భారతం గురించి చెప్పాలా !? అలాగే తెలుగు వారికి ఈ రెండు దేవదాసు సినిమాల గురించి చెప్పాలా ! #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు……… ( By డోగిపర్తి సుబ్రహ్మణ్యం )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆసక్తికరమైన ఆట – ఆటగాడు కూడా రెడీ – సిద్ధంగా లేని పిచ్…
  • ఆ లేఖలో బ్లాస్టింగ్ అంశాలు అన్నారు కదా- పేలవంగా తేలిపోయింది!
  • ఒక బీసీ మహిళ ఔట్… బదులుగా ముగ్గురు బీసీ మహిళలకు పోస్టులు
  • డియర్ యానిమల్ వంగా ! ఒక్క రోమమూ నిక్కబొడుచుకుంటే ఒట్టు !!
  • యుద్ధరంగంలో ఇక ఈ వీరప్పన్ మార్క్ మీసాలు తిప్పబడవు !
  • సెన్సేషనల్ హిట్ ! కానీ ఈ కథలో తెలుగు స్టార్ హీరో ఇమడగలడా !
  • బిగ్‌బాస్ ట్రోఫీ – జస్ట్, ఇంట్లో పెట్టుకునే ఓ షో పీస్‌ మాత్రమే…
  • ఇంద్ర, బ్రహ్మ, విష్ణు, శివాదులందరూ యమలోకానికి వెళ్లారు..!
  • మెలితిరిగిన మీసాల తెలుగు ముఖ్యమంత్రి… ఓ సరదా కథనం…
  • జితేంద్ర మిశ్రా ! ‘ఆపరేషన్ సిందూర్’ లీడర్‌‌కు ఇక ‘ఆపరేషన్ అయోధ్య’…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions