Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కృష్ణ గారడీ ఏమీ లేదు… అంతా పక్కా టైం పాస్ పల్లీబఠానీ…

September 19, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ….. నిజంగానే గారడీ . కృష్ణ , విజయ బాపినీడుల గారడీ . ఫక్తు కమర్షియల్ మాస్ మసాలా గోలగోల ఎంటర్టయినర్ . ఇలాంటి కధలను నేయటంలో విజయ బాపినీడు సిధ్ధహస్తుడు .

ఫేమిలీ సెంటిమెంట్+ క్రైం+ ఏక్షన్+ కావలసినంత కామెడీ . వెరశి 1986 లో వచ్చిన వినోదాత్మకం చిత్రం ఈ కృష్ణ గారడీ . అగ్నికి వాయువు తోడయినట్లు ఈ సినిమాను కాశీ విశ్వనాధ్ డైలాగులు కూడా బాగానే నడిపించాయి . నీలాంటి కేడీగాడు ఉంటే గవర్నమెంటులో ఉండాలి ; లేకపోతే గజదొంగల్లో ఉండాలి వంటి డైలాగులను పేల్చాడు కాశీ విశ్వనాధ్ .

Ads

కృష్ణకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే . జోడీగా జయప్రద . చాలా అందంగా ఉంటుంది . ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటారు ఈ సినిమాలో . జయప్రద పాత్ర కూడా గోల పాత్ర . నారదుడి పాత్ర . బొడ్లో ఓ చిన్న టేప్ రికార్డర్ పెట్టుకుని ఇక్కడి వార్తలు అక్కడికి అక్కడి వార్తలు ఇక్కడికి మోసి తగాదాలు పెడుతుంది . నారదుడి అవతారంలో కూడా కనిపిస్తుంది . నారదుడిగా కూడా అందంగానే ఉంటుంది .

వీరిద్దరి తర్వాత చెప్పుకోవలసింది నూతన్ ప్రసాద్ పాత్ర . అమాయక పోలీస్ సబినస్పెక్టర్ పాత్ర . హీరో కృష్ణ చేత బ్లాక్ మెయిల్ చేయించుకుంటూ భేతాళుడిలాగా అవతారం ఎత్తుతూ కృష్ణకు సాయపడుతుంటాడు . దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని వాపోతుంటాడు .‌

అతని తర్వాత సత్యనారాయణ . ద్విపాత్రాభినయం . రెండు పాత్రల్లోనూ అదరగొట్టేసాడు . ఆ తర్వాత రావు గోపాలరావు , అల్లు రామలింగయ్య జంట . అల్లు గారు కానిస్టేబుల్ గారు , రావు గారు కేడీ గారు . జైల్లో ఇద్దరి గోల , డైలాగులు ప్రేక్షకులకు సరదాగా ఉంటాయి .

ఆ తర్వాత షావుకారు జానకి పాత్ర , ఆమె నటన , క్లైమాక్సులో ఆమె డైలాగ్ డెలివరీ చాలా బాగుంటాయి . ఇతర ప్రధాన పాత్రల్లో జగ్గయ్య , పూర్ణిమ , బాలాజి , పి జె శర్మ , అనూరాధ , రాళ్ళపల్లి , జయవిజయ , నిర్మలమ్మ , మాడా , ప్రభృతులు నటించారు . బాలాజీకి ప్రాధాన్యత కల ఫుల్ లెంగ్త్ దారి తప్పిన తమ్ముడి పాత్ర లభించింది .

చక్రవర్తి సంగీత దర్శకత్వంలో వేటూరి పాటలు థియేటర్లో బాగుంటాయి . బయట హిట్ అయినట్లు లేదు . బాలసుబ్రమణ్యం కృష్ణకు ఇంకా పాడటం మొదలు కాలేదు . మాధవపెద్ది రమేష్ , లలితా సాగర్ , సుశీలమ్మ , శైలజ పాటల్ని పాడారు .

నా కళ్ళలో నీకు కాపురం నా చూపులే నీకు స్వాగతం అంటూ సాగే గ్రూప్ డాన్స్ చిత్రీకరణ ఈ సినిమాకు హైలెట్ . జయప్రద , పూర్ణిమలు చాలా చక్కగా డాన్సించారు . పాట ట్యూన్ , డాన్స్ కంపోజింగ్ బాగుంటాయి . తప్పక చూడవలసిన వీడియో .

చిక్కని చీకట్లో , చింతలకిరి డ్యూయెట్లు హుషారుగా ఉంటాయి . సత్యభామను నేనేనురా అంటూ సాగే డబుల్ మీనింగ్ పాటలో జయప్రద నటన గోలగోలగా ఉంటుంది . అనూరాధ , జయప్రద డాన్స్ పాట రుక్మిణమ్మ అంటూ సాగే పాట కూడా హుషారుగా సాగుతుంది . పాటలన్నీ హుషారుగా ఉంటాయి .

జూడో రత్నం ఫైట్లను కృష్ణ లెవెల్లో కంపోజ్ చేసారు . అట్లూరి రాధాకృష్ణ మూర్తి , కొమ్మన నారాయణరావులు నిర్మాతలు . కధ , స్క్రీన్ ప్లే , దర్శకత్వం గారడీడు విజయ బాపినీడు . సినిమాలో సందేశాలు , సందేహాలు వంటివి ఏమీ ఉండవ్ . జయప్రదను , కృష్ణను చూస్తూ , ఆస్వాదిస్తూ కాసేపు సినిమా హాల్లో కూర్చుని బయటకు రావటమే . ఇప్పుడు యూట్యూబులో ఇంట్లో సోఫాలో రిలాక్స్ అవుతూ చూడటమే . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు #తెలుగు_సినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అధికారానికి మాత్రం మేం… పోరాటాలకు, కేసులకు బడుగులు…
  • కృష్ణ గారడీ ఏమీ లేదు… అంతా పక్కా టైం పాస్ పల్లీబఠానీ…
  • రోడ్ల గుంతలా మజాకా… పెద్ద పెద్ద కంపెనీల్నే తరిమేస్తున్నయ్…
  • సేమ స్టోరీ… సేమ్ ప్రచారం… సేమ్, అప్పట్లో శ్రీదేవి… ఇప్పుడు దీపిక…
  • గెలిచానని నవ్వనా… ఏడ్వనా… మనసా కవ్వించకే నన్నిలా..!
  • ఫాఫం నాగార్జున..! బిగ్‌బాస్ లాంచింగ్ షో రేటింగుల్లో బిగ్గర్ ఫ్లాప్..!!
  • ట్రంపుడి సుంకదాడికి విరుగుడు ఉంది… మోడీయే గుర్తించడం లేదు…
  • రెండూ ప్రభాస్ సినిమాలే… రెండూ కీలకపాత్రలే… రెండింటి నుంచీ ఔట్..!!
  • డియర్ రేవంత్‌రెడ్డి సార్… మీరు ఇంకాస్త బాదండి సర్, పర్లేదు..!!
  • ‘విష్ణు విగ్రహ వ్యాఖ్య’లపై మోహన్ భగవత్ ఏమైనా స్పందించాడా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions